Natyam ad

రాష్ట్రంలో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు

తాడేపల్లి ముచ్చట్లు:


రాష్ట్రంలో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి.  అనంతపురం జిల్లా  పామిడి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న  చాంద్ మెకానిక్ షాప్ ని గుర్తు తెలియని వ్యక్తులు  నిప్పు పెట్టడంతో ఒక్కసారి మంటలు పెద్దఎత్తున ఎగిసి పడ్డాయి… మెకానిక్ షాప్ లో సుమారు ఇరవై అయిదు బైక్లు తోపాటు స్పేర్ పార్ట్స్ దగ్ధమయ్యాయి, చుట్టుపక్కల వారు  పోలీస్ అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో పక్కనే ఉన్న షాప్స్ కు అదేవిదంగా ఇల్లుకు మంటలు వ్యాపించుకుండా అదుపులోకి తెచ్చారు..పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ చేపట్టారు, కరెంట్ షాట్ సర్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేదా ఇతర కారణాలు వల్ల దుండుగులు నిప్పు పెట్టారా అనేది పోలీసులు దర్యాప్తులో తెలియాల్సివుంది. కాకినాడ సిటీలో
దీపావళి సామాగ్రికి సంబంధించి బిల్డింగ్ లోపల పార్కింగ్లో ఉన్న కారుకి అగ్ని మంటలు తగిలి రాచుకుంది. రాచుకున్న అగ్ని మంటలు వల్ల పక్కన ఉన్న స్టేషనరీ లో మంటలు చెలరేగాయి. కారు ముందర భాగం బానేట్ పూర్తిగా దగ్ధమైంది. రెండు సైకిళ్ళు ఒక మోటార్ వెహికల్ దగ్ధమయ్యాయి.  సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది.
పల్నాడు జిల్లా నరసారావు పేట మార్కెట్ సెంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.  ఓ దుకాణంలో షాట్ సర్కుట్ తో  మంటలు  వ్యాపించాయి. మంటలు ధాటికి మరో 10 షాపులకు  మంటలు అంటుకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్ని మాపక శకటాలు వచ్చి మంటలను అదుపు చేసాయి.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం, అసన్నగూడెం గ్రామంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ తో పటాన్ అలీమారి ఇల్లు దగ్ధం అయింది. ఆసమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ,  సుమారు 5 లక్షల రూపాయలు  కాలిపోవుగా వస్తువులు అన్నిపూర్తిగా కాలిపోయినాయి. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలును అర్పివేసారు. .

 

Tags: Fire accidents in many places in the state

Post Midle
Post Midle