ఆటోమొబైల్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం
చిత్తూరు ముచ్చట్లు:
పలమనేరులో బిస్మిల్లా ఆటోమొబైల్స్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. దుండగులు కారులో వచ్చి కారు వెనుక భాగంతో దుకాణం షటర్న్ ఢీ కొట్టి పెట్రోల్ పోసి అంటించి పారిపోతున్న దృశ్యాన్ని స్థానికుడు గమనించాడు. ఈ ఘటనలో కారు వెనుక భాగం లో కూడా మంటలు వ్యాపించాయని చెబుతున్నాడు. మంటలు వ్యాపించిన కారుతో సహా సంఘటనా స్థలం నుంచి దుండగులు పారిపోయారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. దుకాణంలోని పూర్తి సరుకు దగ్ధం అయింది. 20 లక్షల సరుకు, మూడు లక్షల నగదు అగ్నికి ఆహుతైదని సమాచారం.మంటలను గుర్తించి ఫైర్ సిబ్బందికి సమాచారం స్థానికులు అందించారు. మంటలను అదుపు లోకి వచ్చాయి. అగ్ని ప్రమాదం సహజంగా జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Tags:Fire at automobile shop

