సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం
మేడ్చల్ ముచ్చట్లు:
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పీర్జాదిగూడలోని శ్రీ సాయి నిలయంలో సెక్యూరిటీ ఉంటున్న గదిలో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు పేలి చెలరేగాయి. ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మంటలకు, భారీగా కమ్మిన పొగకు స్థానికులు భయబ్రాంతులకు గురైయారు. రెండు అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చిన గదిలో ఘటన జరిగింది. వెంటనే స్పందించిన స్థానికులు, డి ఆర్ ఏఫ్ బృందం, అగ్నిమాపక సిబ్బంది మంటలను చల్లార్చారు.
Tags: Fire hazard due to cylinder explosion

