ఆర్టీసి బస్సులో మంటలు..ప్రయాణికులు సురక్షితం
పామర్రు ముచ్చట్లు:
పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలం పులవర్తి గూడెం వద్ద ఆర్టీసీ బస్సులో ప్రమాదం తృటిలో తప్పింది. ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విజయవాడ నుండి గుడివాడ వస్తున్న ఆర్టీసీ బస్సు, పులవర్తి గూడెం సమీపంలోకి రాగానే ఉన్నట్లుండి బస్సులో ఒక్కసారిగా భారీ మంటలు వచ్చాయి. ప్రమాద సమయంలో సుమారు ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు, ఒక్కసారిగా మంటలు రావడంతో భయాందోళనలు వ్యక్తం చేసారు. బస్సు సాంకేతిక లోకం కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని ప్రయాణికులు అంటున్నారు.
Tags: Fire in RTC bus..Passengers are safe

