సూరారం లో అగ్నిప్ర‌మాదం.. భారీగా ఆస్తి న‌ష్టం

Date:23/02/2021

హైద‌రాబాద్  ముచ్చట్లు:

సూరారం కృష్ణాన‌గ‌ర్‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. కృష్ణాన‌గ‌ర్‌లోని జీపీ ఫుడ్స్ ప‌రిశ్ర‌మ‌లో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగ‌డంతో సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తెచ్చింది. బాయిల‌ర్ నుంచి ఆయిల్ లీక్ కావ‌డంతోనే మంట‌లు ఎగిసిప‌డిన‌ట్లు జీపీ ఫుడ్స్ సిబ్బంది పేర్కొన్నారు. ఈ ప్ర‌మాదంలో భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Fire in Suraram .. Heavy property damage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *