మన్సాస్ ట్రస్ట్  బైలా పై ఫైర్

విజయవాడ ముచ్చట్లు:

 

తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వైఖరిపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాన్సాస్‌ ట్రస్ట్ మాజీ చైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజుపై అశోక్‌ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపై వాసిరెడ్డి పద్మ ఫైరయ్యారు. మహిళల పట్ల అశోక్‌ గజపతిరాజు వివక్ష అనాగరికమన్నారు. మాన్సాస్ బైలా అంటే సతీ సహగమనం చేయాలా అని ప్రశ్నించారు. సంచయిత విషయంలో అశోక్ మాటలు ఇంకా రాచరిక వ్యవస్థను గుర్తు చేస్తున్నాయని విమర్శించారు.మాన్సాస్‌ ట్రస్ట్ మాజీ చైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజు బుధవారం మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. విశాఖపట్నంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తన నియామకంతో పాటు వారసత్వ అంశాన్ని కించపరిచే రీతిలో అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చేశారని సంచయిత పేర్కొన్నారు.సంచయిత ఫిర్యాదుపై వాసిరెడ్డి పద్మ ఘాటుగా స్పందించారు. అశోక్ గజపతిరాజు రాచరికపు వ్యవస్థలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మాన్సాస్ ట్రస్ట్ బైలా పునః సమీక్షించాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అన్నారు. సంచయిత విషయంలో అశోక్ గజపతిరాజుతో చర్చకు సిద్ధమని వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Fire on Mansas Trust Baila

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *