Natyam ad

పుంగనూరులో తోటలకు అగ్నిప్రమాదాల ముప్పు

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని పిచ్చిగుండ్లపల్లె సరిహద్దులోని శ్రీనివాసులకు చెందిన మామిడితోట అగ్నిప్రమాదానికి గురైంది. మంగళవారం సమాచారం అందడంతో ఫైర్‌ ఆఫీసర్‌ సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఫైర్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ వేసవిలో ఆకులు రాలిపోవడంతో ఆకతాయిలు కారణంగా తోటలలో అగ్నిప్రమాద ం సంభవించి నష్టం కలుగుతోందన్నారు. గత 15 రోజులుగా ప్రతి రోజు ఒకటి, రెండు సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు తమ తోటలలో చుట్టు ప్రక్కల ఎండు చెత్తను తొలగించి , జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే రానున్న రోజుల్లో మరింత ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.

 

Post Midle

Tags: Fire threat to gardens in Punganur

Post Midle