Natyam ad

అగ్ని ప్రమాదం బాధితులను ఆదుకోవాలి-రేవంత్ రెడ్డి

ఆర్మూరుష ముచ్చట్లు:

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదంపై టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. అగ్నిప్రమాదంలో  యువతి యువకులు మృత్యువాత పడడం పట్ల ఆందోళన వ్యక్తం చేసారు. మృతులు  22 ఏళ్ల వయస్సు వారు ఉన్నారని, వారికి ఎంతో గొప్ప భవిష్యత్ ఉన్న యువత ఇలా మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలా వరస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల సికింద్రాబాద్ లో వరసగా సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వం సరైన విచారణ, నివారణ చర్యలు తిసు కోవడం లేదు. దక్కన్ మాల్ లో జరిగిన సంఘటన మరువక ముందే మరో దారుణం జరిగిందని అన్నారు.
విశ్వ నగరం అంటూ కేటీఆర్ గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజల కనీస భద్రత కల్పించడంలేదు.  కుక్కలు ఒక పసివాన్ని పీక్కుతిని చంపేసాయి.

 

 

. ఇప్పుడు అగ్ని ప్రమాదం ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన భద్రత చర్యలు తీసుకోవాలి.. భవిష్యత్ లో ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాలుగా పరిశీలన చేసి చర్యలు చేపట్టాలి. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని అన్నారు.అధిక వర్షాలు పడడంతో రైతులకు అపార నష్టం
గురువారం  అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలు, వడగాళ్ల తో ప్రధానంగా రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు, పండ్ల, పూల తోటలు భారీగా దెబ్బ తిన్నాయి.. రంగారెడ్డి జిల్లాలో పండ్లు, పూలు, కూరగాయల పంటలు భారీగా నష్టపోయాయి.  పంట నష్టాలు అంచనా వేసి రైతులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు.

 

Post Midle

Tags; Fire victims should be supported-Revanth Reddy

Post Midle