ఏపి ఎక్స్ ప్రెస్ లో మంటలు..నెక్కోండలో నిలినివేత

వరంగల్ ముచ్చట్లు:
 
వరంగల్ జిల్లా నెక్కొండ లో  ఏపీ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. ఎస్ 6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో  డ్రైవర్ గమనించి  నెక్కొండ స్టేషన్లో రైలును నిలిపివేశారు. దీంతో ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్‎లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.  ప్రయాణికులు రైల్లో నుంచి పరుగులు తీశారు. నెక్కొండ రైల్వే స్టేషన్లో ట్రైన్ నీ నిలిపివేసి ప్రయాణికులను దించేయడం తో ప్రాణాపాయం తప్పింది. ట్రైను విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఘటన జరిగింది. రైలు బ్రేకులు జాం కావడంతో పొగలు వచ్చాయని అధికారులు తెలిపారు. లేదా ఇంకేదయినా సాంకేతిక సమస్య తలెత్తిందా అన్న కోణంలో కూడా అధికారులు పరిశీలించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags; Fires in AP Express..Stopping at Nekkonda

Natyam ad