Natyam ad

బోయకొండలో పిడుగుపడి చెలరేగిన మంటలు

-అర్ధరాత్రి ఘోరం
– కాలిపోయిన ఈవో ఆఫీసు
– లక్షల్లో ఆస్తి నష్టం
– ఆందోళనలో భక్త జనం

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

చిత్తూరు జిల్లాలో రెండవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో పిడిగు పడి ఈవో ఆఫీసు దగ్ధమైంది. సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షాలలో ఉరుములు, మెరుపులు తీవ్రం కావడంతో పిడుగులు పడ్డాయి. ఈ సమయంలో పిడుగులు గంగమ్మ కొండపై గల ఈవో కార్యాలయం పక్కన పడటంతో ఆఫీసు అగ్నికి ఆహుతై , లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది. ఈ మంటలలో అమ్మవారి ఫోటోలు, గ్లాసు డోర్లు, ఈవో చాంబర్‌లోని ఫర్నిచర్‌ దగ్ధమైంది. మంటలు కమ్ముకుని పొగలు రావడంతో సిబ్బంది హుటాహుటిన అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. సంఘటన తెలిసిన వెంటనే మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆందోళన చెందారు. తక్షణమే ఈవో, చైర్మన్‌ తో మాట్లాడి సంఘటనపై పూర్తి సమాచారం కోరారు. దీనిపై బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి, ఈవో చంద్రమౌలి సంఘటన స్థలాన్ని పరిశీలించి చర్యలు చేపట్టారు. కాగా పిడుగుపాటుకు ఈవో కార్యాలయం దగ్ధమైందా…లేక వేరే కారణాలు ఏమైన ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈవో కార్యాలయం ప్రక్కన ఉన్న విద్యుత్‌ స్తంబాలలోని లైట్లు కూడ కాలిపోవడం పిడుగుపాటుకు జరిగినదిగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైన బోయకొండలో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

Tags; Fires that broke out in Boyakonda due to lightning

 

Post Midle