Natyam ad

కొమువెల్లి ఆలయంలో అగనిగండాల కార్యక్రమం

సిద్దిపేట ముచ్చట్లు:

కొమురవెళ్లి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన అగ్నిగుండాలను వీరశైవ అర్చకులు, ఆలయ ఈవో, చైర్మన్ ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున  ఆలయ తోటబావి వద్ద వీర శైవ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో మహాగణపతి పూజ, వీరభద్ర పల్లెరం, భద్రకాళి పూజ, అగ్నిగుండ ప్రవేశం శాస్త్రోక్తంగా జరిగింది, ఐదు రకాల సమీదలను(కట్టెలను) నిప్పులగుండంగా తయారు చేసి,ఆయాదేవతలను స్తుతిస్తూ వీరశైవ అర్చకులు దండకలు వేసి,అష్టదిక్కులను గుమ్మడికాయలతో బలిహారణ చేసి,వీరభద్రుడి విజయ ఖడ్గనికి అవహనం చేసిన అనంతరం వీరశైవ అర్చకులు అగ్నిగుండాలు తొక్కడం ప్రారంభించరు.అర్చకుల అనంతరం భక్తులు, శివసత్తులు తన్వయత్వం మల్లన్నను  స్మరిస్తూ అగ్నిగుండాలను దాటుతారు.అగ్ని గుండాల ప్రవేశంలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిద్ధిపేట డిసిపి అడ్మిన్ మహేందర్ ,హుస్నాబాద్ ఎసిపి సతీష్ ఆధ్వర్యంలో సుమారు 250మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.  ఈ కార్యక్రమం అనంతరం స్వామివారి గర్భాలయంలో మహాన్యాస పూర్వక ఏకదశారుద్రాభిషేకం,వీరభద్ర పల్లెరం నిర్వహిస్తారు, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని,పాడిపంటలు సమృద్ధిగా పండలని మల్లన్న స్వామికి కోరుకున్నామని అలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్ తెలిపారు.

 

Tags: Fireworks program at Komuvelli Temple

Post Midle
Post Midle