నార్కెట్ పల్లిలో కాల్పుల కలకలం

నార్కెట్ పల్లి ముచ్చట్లు:


కాల్పుల ఘటనలు  పట్టణాల్లోనే కాదు.. పల్లెలకూ పాకింది. పచ్చని పల్లెల్లో తుపాకుల మోత మొగుతోంది. గురువారం  రాత్రి నల్లగొండ జిల్లాలో జరిగిన కాల్పులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నార్కట్ పల్లి (మం)బ్రాహ్మణ వెళ్ళెంల గ్రామానికి చెందిన లింగస్వామి వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ డీలర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పార్ట్ టైంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తుంటాడు. గత రాత్రి మునుగోడుపైపు బైక్ పై పయనిస్తున్నాడు లింగస్వామి. సింగారం వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని దుండగులు లింగస్వామిపై కాల్పులతో రెచ్చిపోయారు. మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. వెన్నుముక, కుడి చేతి కింద బాగాన లింగస్వామికి బుల్లెట్ గాయాలయ్యాయి. దాంతో అక్కడిక్కడే స్పృహ కోల్పోయాడు లింగస్వామి. చనిపోయాడనుకున్న నిర్దారించుకున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు బాధితుడుని నార్కెట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అనంతరం.. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.  ఘటనా స్థలిలో ఓ బుల్లెట్ సేకరించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ గొడవలే దాడికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు చెప్పిన అనుమానితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

 

Tags: Firing in Narket Palli

Leave A Reply

Your email address will not be published.