Corona in the minister's family

మదనపల్లిలో తొలి కరోనా కేసు నమోదు

Date:07/05/2020

మదనపల్లి ముచ్చట్లు:

చిత్తూరు జిల్లాలో మదనపల్లి మండలంలో ఓ వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. మదనపల్లి మండలంలోని దండువారిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెన్నైలో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో వైద్యాధికారులు అనుమానం వచ్చి ప్రాథమిక పరీక్ష నిర్వహించగా పాజిటివ్ రావడంతో తుదిపరి పరీక్ష నిమిత్తం తిరుపతికి తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు. అలాగే అతనితో పాటు వచ్చిన పుంగనూరు మండలం చండ్రమాకులపల్లికి ఓ వ్యక్తిని కూడా పరీక్షించగా నెగిటివ్ రావడంతో అతన్ని క్వారంటైన్ కు తరలించారు.

150 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ

Tags: First Corona case registered in Madanapalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *