పీలేరులో తొలి కరోనా కేసు నమోదు

Date:23/05/2020

పీలేరు ముచ్చట్లు:

పీలేరులో తొలి కరోనా కేసు నమోదైన సందర్భంగా ప్రజలు మరింత అప్రమత్తంగా వుండాలని తహశీల్దారు పుల్లారెడ్డి, ఇన్చార్జ్ సిఐ మురళీకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శనివారం పాత్రికేయులతో మాట్లాడుతూ ఈనెల 17వ తేదీన ఢిల్లీకి చెందిన వ్యక్తి (45), అనంతపురం వరకు ట్రైన్ లో వచ్చి, అక్కడి నుండి పలమనేరులో ఓ మహిళతో కలసి ప్రయాణించి ఆపై పీలేరులోని అత్తగారింటికి చేరుకున్నాడు. ఐతే పలమనేరు వరకు ప్రయాణించిన మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఆ మహిళతో పాటూ ప్రయాణించిన వారిపై వివరాలను ఆరాతీసి పీలేరుకు వచ్చిన అతని రాకను పసిగట్టిన స్థానిక వైద్య సిబ్బంది హోమ్ క్వారంటైన్ లో వుంచారు. ఈ క్రమంలో శనివారం అతనిని పరీక్షించగా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. కరోనా కట్టడిపై తదుపరి పారిశుద్ధ్య పనులు , లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ ప్రజలు స్వీయ నిర్భంధంలో వుంటూ సహకరించాలని వారు కోరారు.

 

జిల్లా జాయింట్ కలెక్టర్లు తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

Tags: First corona case registered in Peelaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *