మెగా డీఎస్సీ పై మొదటి సంతకం

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

ఏపీలో 39 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ రాష్ట్రంలో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతేడాది జులైలో లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2023 జులై 31న లోక్‌సభలో ఒక ప్రశ్నకు అప్పటి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి సమాధానం ఇచ్చారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 2022-23లో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 20021-22లో 38,191 ఉపాధ్యాయ పోస్టులు, 2020-21లో 22,609 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.బుధవారమే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో విద్యా శాఖ అప్రమత్తమైంది. ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్లో 6,100 పోస్టులు ఉన్నాయి. అయితే తాజాగా 30 వేల ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Tags:First signing on Mega DSC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *