పదిలో ఫస్ట్ మనమే ఉండాలి

First we must be in the top ten

First we must be in the top ten

   Date:15/03/2019
   సిద్దిపేట ముచ్చట్లు:
శుక్రవారం నుండి ప్రారంభం అయ్యే పదో  తరగతి పరీక్షలు వ్రాయనున్న విద్యార్థిని, విద్యార్థులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు శుభాశీస్సులు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ  సంవత్సరం  ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. గత సంవత్సరం జిల్లా 3వ స్థానంలో నిలిచింది అదే స్ఫూర్తితో ఈ సారి ఉపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ సారి జిల్లా మొదటి స్థానంలో నిలుస్తోంది అని ఆశిస్తున్నన్నారు.  విద్యార్థులు కష్ట పడి చదివారు, వారి కష్టం వృధా కాదన్నారు. విద్యార్థుల భవిష్యత్ పునాది పదోతరగతేనని తెలిపారు. ఇష్టపడి ఆత్మవిశ్వాసం తో పరీక్షలు రాయాలని కోరారు. ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులు ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తున్నన్నారు. ఏకాగ్రత తో  పరీక్షలు రాసి అద్బుతమైన ఫలితాలు సాధించాలని కోరారు.
Tags:First we must be in the top ten

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *