ముందు నీవు బ్యాంకులకు రూ.1,000 కోట్లు కట్టి నీతులు మాట్లాడు-ఎంపి విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ ముచ్చట్లు:

రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల రఘురామ ఎన్నికల సర్వే అంటూ కొన్ని ఫలితాలను వెల్లడించడం పట్ల విజయసాయి ఘాటుగా స్పందించారు.ప్రభుత్వ బ్యాంకుల్లో అమాయక డిపాజిటర్లను నిలువునా ముంచాక, ఇప్పుడు రఘురామ మాయలమారి రాజకీయ పండితుడి అవతారం ఎత్తాడని విమర్శించారు. పనీపాటా లేకపోవడంతో అతడి మానసిక ఆరోగ్యం గాడితప్పిందని, అందుకే ఢిల్లీలో కూర్చుని ఏపీ ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తున్నాడని ఎద్దేవా చేశారు. రఘురామను తలకిందులుగా వేళ్లాడదీసి ప్రభుత్వ బ్యాంకులకు అతడు బకాయిపడిన రూ.1000 కోట్లను కక్కించాలని సీబీఐని కోరుతున్నట్టు విజయసాయి ట్వీట్ చేశారు.

 

Tags: First you tie up Rs.1,000 crore to the banks and talk about ethics – MP Vijayasai Reddy

Leave A Reply

Your email address will not be published.