మత్స్యకార ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలి-మంత్రి సీదిరి అప్పలరాజు

నరసాపురం ముచ్చట్లు:

తీరప్రాంత మత్స్యకారులు మత్స్య సంపద అమ్మకాలు జరుపుకునుటకు అధునాతన మైన పిష్ మార్కెట్ ను బుధవారం నరసాపురం పట్టణం 11వ వార్డులో 1 కోటి 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన 40 షాపుల ఫిష్ మార్కెట్టును సముదాయామును ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు ముదునూరి. ప్రసాదరాజు, జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి తో కలసి రాష్ట్ర పశు సంవర్థక,పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు.ఈ సందర్భంగా  మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ మత్స్య కారులు వ్యాపార అభివృద్ధికి  ఫిష్ మార్కెట్ ఎంతో ఉపయోగ పడుతుందని, మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాజా, నాణ్యమైన చేపలను అందించి వినియోగ దారుల మన్ననలు పొందాలని మంత్రి అన్నారు. అధునాతనమైన ఫిష్ మార్కెట్ నిర్మాణంకు ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు ముదునూరి. ప్రసాదరాజు కృషి ఎంతో ఉందని రాష్ట్ర పశు సంవర్థక,పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి సీదిరి. అప్పలరాజు అన్నారు.

 

ఈ కార్యక్రమంలో ఆర్డీవో యం అచ్యుత అంబరీష్, రాష్ట్ర ప్రభుత్వ అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృధ్ది కార్పొరేషన్ చైర్మన్  తిరుమాని నాగ రాజు, తహాశీల్దారు యస్ యం ఫాజిల్,పురపాలక సంఘం కమీషనరు డా. కె వెంకటేశ్వర రావు, పురపాలక సంఘం చైర్పర్సన్ బర్రి వెంకటరమణ, ఏయంసి చైర్మన్ గుబ్బల రాధా కృష్ణ,పురపాలక సంఘం వైస్ చైర్పర్సన్ కామన నాగిని,రాష్ట్ర ప్రభుత్వ అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృధ్ది కార్పొరేషన్  డైరెక్టరు బంధన పూర్ణచంద్రరావు,జిల్లా  మత్స్య శాఖ అధ్యక్షులు అండ్రాజు చల్లా రావు, జడ్పిటిసి సభ్యులు తిరుమాని బాపూజీ, బొక్కా రాధాకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Fishermen’s benefits should be utilized – Minister Sidiri Appalaraju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *