మత్స్యకారుల తిరంగా కార్యక్రమం

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖలో మత్య్సకారులు బోట్లపై జాతీయ జెండాలను ప్రదర్శించి జల్ పర్ తిరంగా వినూత్న కార్యక్రమా న్ని చేపట్టారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్ వేదికగా మత్స్యకారులందరూ వారి బోట్లపై జెండా ఎగురవేసే జల్ పర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.‎ ఈ కార్యక్రమంలో మత్య్సకారులు వారి బొట్లపై జెండాలను ప్రదర్శించి దేశంపై ఉన్న మమకారాన్ని చాటి చెప్పారు.విశాఖలో జరిగిన జల్ ఫర్ తిరంగ కార్యక్రమంలో 100 బోట్లలో మత్య్సకారులు జెండాను ఆవిష్కరిం చారని సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసు తెలిపారు.దేశ అభివృద్దిలో మత్య్సకారులు కూడా భాగస్వామ్యు లుగా నిలిచారని చెప్పారు.

 

Tags: Fishermen’s Tiranga Program

Leave A Reply

Your email address will not be published.