కొండగట్టు ప్రమాదానికి ఫిట్ నెస్, బ్రేక్ ఫెయిల్

Fit Ness for Breakthrough, Break Fail
Date:14/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
కర్నుడు చావుకు సవాలక్ష కారణాలు అన్న చందంగా మారింది.కొండగట్టు ఘాట్‌ రోడ్డులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 62‌కు చేరింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ పొరపాటేనని మొదట్లో భావించినా.. దర్యాప్తు ముందుకు సాగేకొద్ది అసలు నిజాలు బయటపడుతున్నాయి. బస్సుకు ఫిట్‌నెస్ లేకపోవడం వల్లే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని తేలింది.డ్రైవర్‌కు ఎంత అనుభవం ఉన్నా.. వారు నడిపే వాహనాలకు ఫిట్‌నెస్ లేకపోతే ఎంత ప్రమాదకరమనేది ఈ దారుణ ఘటనే నిదర్శనం.
బస్సు బ్రేక్ ఫెయిల్ కావడమే కాకుండా, స్టీరింగ్ కూడా విరిగిపోవడంతో డ్రైవర్ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో డ్రైవర్ ప్రమాదం గుర్తించి.. బస్సు లోయలో పడిపోతోందని అరవడం మినహా మరే ప్రయోజనం లేకుండా పోయింది. లోయలో పడిన బస్సును అధికారులు గురువారం వెలికితీశారు. 100 కిమీల వేగంతో దూసుకెళ్లింది:
బస్సు కండక్టర్ పరమేశ్వర్ చెప్పిన వివరాల ప్రకారం.. గట్టు నుంచి బస్సు బయల్దేరగానే స్పీడ్ బ్రేకర్లు వచ్చాయని, అక్కడ బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి లోయలోకి వెళ్లిపోయిందని తెలిపారు. ఆ సమయంలో బస్సు సుమారు 100 కిమీల కంటే వేగంతో దూసుకెళ్లిందని తెలిపారు. కొద్ది క్షణాల్లో ఘోరం జరిగిపోయిందన్నారు. కళ్లు తెరిచి చూసే లోపు లోయలో ఉన్నామని తెలిపారు.
ఆర్టీసీ బస్సు కండిషన్‌లో లేకపోవడం, బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. 2007 మోడల్‌కు చెందిన ఈ బస్సు 12 లక్షల కిమీలు మాత్రమే ప్రయాణించాలి. అయితే, ఈ బస్సు 14,95,116 కిమీలు తిరిగింది. ఈ నేపథ్యంలో ఈ బస్సును కాలం చెల్లిన బస్సుగా పరిగణించి, ఘాట్ రోడ్లపై నడపరాదు. ఈ నేపథ్యంలో డ్రైవర్‌కు ఎంత అనుభవం ఉన్నా.. ఘాట్ రోడ్డుపై బ్రేక్ ఫెయిలైతే బస్సును నియంత్రించడం కష్టతరం. పైగా, బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటం కూడా మరొక కారణం.
Tags:Fit Ness for Breakthrough, Break Fail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *