45 సంవత్సరాలలో ఐదు సంకీర్ణ ప్రభుత్వాలు

Date:16/10/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

జమ్ముకశ్మీర్‌లో రద్దు చేసిన ఆర్టికల్‌ 370ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కొత్త సంకీర్ణం పురుడు పోసుకున్నది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, కాంగ్రెస్‌ సహా మరో నాలుగు పార్టీలు చేతులు కలిపాయి. రహస్యంగా ఒక ప్రదేశంలో సమావేశమై కొత్త సంకీర్ణాన్ని ఏర్పాటుచేసిన ఈ ఏడు పార్టీల నేతలు.. 370 ని ఉపసంహరించుకోవాలంటూ కేంద్రానికి పంపిన నోట్‌పై సంతకం చేశారు.జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ని పునరుద్ధరించాలంటూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, కాంగ్రెస్‌తోపాటు ఏడు పార్టీలు ఒక్కటయ్యాయి. 2019 ఆగస్టు 5 కు ముందు పరిస్థితులు తీసుకురవాలన్న లక్ష్యంతో సంకీర్ణ కూటమిగా ఏర్పడ్డారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తిరిగి ఇవ్వాలని, రాష్ట్ర రాజ్యాంగాన్ని అమలుచేయాలంటూ గత ఏడాది పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌, సీపీఐఎం, జమ్ముకశ్మీర్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌, పాంథర్స్‌ పార్టీ, జమ్ముకశ్మీర్‌ అవామీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సహా పలు పార్టీలు డిమాండ్‌ చేస్తూ సంతకాలు చేశాయి.ఈ కూటమికి పీపుల్స్ అలయన్స్ అని పేరు పెట్టాం. చట్టపరమైన పరిధిలో ఉండటం ద్వారా ఈ కూటమి జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తిరిగి ఇచ్చేందుకు రాజ్యాంగ పోరాటం చేస్తుంది.

 

 

ఇక్కడి ప్రజలకు తిరిగి హక్కులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. 2019 ఆగస్టు 5 కు ముందునాటి పరిస్థితులు తీసుకువచ్చేందుకు కృషిచేస్తాం. అసెంబ్లీతో జమ్ముకశ్మీర్‌లో ఏ ఎన్నికలు ప్రకటించినా కూటమిగా మారిన పార్టీలన్నీ సంయుక్తంగా పోటీ చేస్తాయి” అని ఫరూక్‌ అబ్దుల్లా చెప్పారు.బీజేపీతో కూటమిగా ఉండి మూడేండ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ..  గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అసెంబ్లీని రద్ద చేయడంతో కాంగ్రెస్‌, ఎన్‌సీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. 2018 నవంబర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌తో కలసి కూటమి ఏర్పాటుచేశారు. గత 45 సంవత్సరాలలో జమ్ముకశ్మీర్‌లో ఐదు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వారిలో ఒకటి నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమి మాత్రమే కాలపరిమితిని పూర్తి చేసింది.

 

 

1975 నుంచి 1977 వరకు .. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యారు, అయితే, రెండేండ్ల తరువాత కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో కూటమి విచ్చుకుపోయింది. 1982 నుంచి 1986 వరకు.. నేషనల్‌ కాన్షరెన్స్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ లభించింది. ఎన్‌సీతో జట్టు కట్టిన కాంగ్రెస్‌ వారి ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకోవడం ద్వారా ఎన్‌సీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. 2002 నుంచి 2008 వరకు.. పీడీపీ. కాంగ్రెస్ కూటమి అయ్యాయి. కానీ, ప్రభుత్వం చివరి సంవత్సరంలో కశ్మీర్‌లోని అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి భూమి ఇవ్వడాన్ని నిరసిస్తూ పీడీపీ కూటమిని విరమించుకుంది. 2009 నుంచి 2015 వరకు.. మరోసారి నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్ కూటమిగా మారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. ఈ ప్రభుత్వం ఆరేండ్లు కొనసాగింది. 2015 నుంచి 2018 వరకు.. 28 స్థానాలను గెలుచుకున్న పీడీపీ, 25 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీతో 2015 మార్చి నెలలో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. చివరకు 25018 జూన్ లో ఈ కూటమి విడిపోయింది.

వైసీపీ వైపు ప్ర‌తిభా చూపు

Tags: Five coalition governments in 45 years

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *