Date:13/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఉమ్మడి రాష్ట్రం శాసనమండలిలో మంగళవారం నాడు తెలంగాణ శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మండలి సమావేశానికి డిప్యూటి ఛైర్మన్ నేతి విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. సోమవారం నాడు గవర్నర్ ప్రసంగం సమయంలో అనుచితంగా ప్రవర్తించిన కాంగ్రెస్ సభ్యుల సస్పెన్ష్ పై సభానాయకుడు కడియం శ్రీహరి తీర్మానం ప్రవేశ పెట్టారు. దీంతో బడ్జెట్ సమావేశాల సెషన్ పూర్తి వరకు వారిని సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసింది. షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సంతోష్, దామోదర్ రెడ్డి, ఆకుల లలిత, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ కు గురయ్యారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అసలు ఎందుకు సస్పెండ్ చేశారో కారణాలు చెప్పాలేదని షబ్బీర్ అలీ మండిపడ్డారు.షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఎందుకీ సస్పెండ్ చేశారో కారణాలు చెప్పా లేదని విమర్శించారు. ఈరోజు ప్రజాస్వామ్యం లో బ్లాక్ డే, రాజ్యాంగానికి కూడా అని అన్నారు. ఉరి శిక్ష వేస్తే కూడా చివరి కోరిక అడుగుతారు. కానీ ఇక్కడ అదేం జరగలేదని అన్నారు. ఇండియా లో ఏ అసెంబ్లీ లో ఇలా ఉండదు. సస్పెండ్ చేసిన సభ్యుల కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని అయన డిమాండ్ చేసారు. మీ ఎంపి లు పార్లమెంట్ లో వెల్ లోకి పోవచ్చు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. మేమిచ్చిన భిక్ష తో మీరు సీఎం అయ్యారని అయన అన్నారు. సోమవారం సభ ప్రారంభం కాకముందే 200 మంది పోలీస్ లు, మార్షల్ లు ఉన్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు.
Tags: Five Congress MLAs have been sacked