అడవి బిడ్డల ఐదు దశాబ్దాల కల..

అదిలాబాద్ ముచ్చట్లు:

ఆదివాసీ గూడాల్లో పోడు సంబురానికి వేలైంది. దశాబ్దాలుగా జల్ జంగిల్ జమీన్ అంటూ పోడు భూముల కోసం పోరు సలుపుతున్న ఆదివాసీల కల నెరవేరబోతోంది. అటవి భూముల్లో సాగు కోసం నిత్యం యుద్దం చేయాల్సిన పరిస్థితుల నుండి విముక్తి‌ కలగబోతోంది. తెలంగాణ సర్కార్ పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు సిద్దమవడంతో అటవి పోడు తల్లి పులకించ పోతోంది.  కొమురంభీం సాక్షిగా ఆసిపాబాద్ జిల్లా వేదికగా సీఎం కేసీఆర్ అంకురార్పణ చోయబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా లక్షా 47 వేల ఎకరాలకు పోడు పట్టాలతో పాటు రైతు బంద్ పథకం సైతం అమలు కాబోతోంది. అందుకు కొమురంభీం జిల్లా ఆసిపాబాద్ కేంద్రం వేదికానుంది.అడవి బిడ్డల ఐదు దశాబ్దాల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. కొండకోనల్లో పోడు భూముల్లో పోడు సాగు చేస్తున్న అడవి బిడ్డలకు పోడు గోడు ఇక దూరం కానుంది.  కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా వేదికగా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ఆదివాసీల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పోడు భూములకు పట్టాలు ఇవ్వటంతో పాటు వాటికి రైతుబంధు కూడా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో ఆదివాసీల్లో ఆనందం రెట్టింపైంది.వానకాలం సీజన్ వచ్చిదంటే చాలు అడవి భూముల్లో ఆదివాసీలకు అటవిశాఖకు మద్య ఓ యుద్దవాతవరణమే కనిపించేది.

 

 

 

పోడు సాగు చేసుకునేందుకు హక్కు లేదంటూ అటవిశాఖ అడ్డుకోవడంతో ఆదివాసీ పోడు రైతులు తిరగబడక తప్పని పరిస్థితి. ఒక‌ సార్సాల, ఒక పెంచికల్ పేట, ఒక కోయపోచగూడ.. ఇలా ఒక్కటేమిటి అడవుల జిల్లా ఆదిలాబాద్ నుండి భద్రాద్రి కొత్తగూడెం వరకు పోడు భూముల్లో సాగు ఒక నిత్య యుద్దమే. ఇప్పుడు ఆ కష్టాలకు చెక్ పెడుతూ పోడు గోడును దూరం చేస్తూ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్.జూన్ 30 2019 కొమురంభీం జిల్లా సిర్పూర్ నియోజక వర్గం సార్సాలలో చోటు‌చేసుకున్న అటవిశాఖ వర్సెస్ ఆదివాసీల పోరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సరిగ్గా ఐదేళ్లకు ఇదే రోజు ఇదే జిల్లాలో పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్రంలోని 12 లక్షల ఎకరాల పోడు భూమికి గాను 4300 గూడేలకు సంబంధించిన 2450 గ్రామాల నుంచి 3,40,000 దరఖాస్తులు తీసుకున్న సర్కార్… ఏడాదికి పైగా సర్వే నిర్వహించి .. రాష్ట్రంలోనే 1 లక్ష 47 వేల ఎకరాలకు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 37 వేల ఎకరాలకు పోడు పట్టాలు అందించేందుకు సిద్దమైంది.ఉమ్మడి ఆదిలాబాద్ లోని 37వేల ఎకరాలకు గాను 15 వేల మంది లబ్ధిదారుల్లో వంద మందికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ సాగనుంది.

 

 

Post Midle

మిగిలిన పట్టాలను జిల్లా మంత్రులు , ఎమ్మెల్యే లు పంపిణి చేయనున్నారు. పట్టాల పంపిణీ జరిగిన గంటల్లోనే రైతు బందు సైతం వారి అకౌంట్లలో జమకానుంది. జల్ జంగిల్ జమీన్ అంటూ పోరాటం సలిపిన కొమురంభీం సాక్షిగా.. కొమురంభీం గడ్డ పై నుండే చారిత్రాత్మక పోడు పట్టాల పంపిణి జరగనుండటంతో ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే 22 వేల ఎకరాలకు పైగా సాగులో ఉన్న గిరిజనేతరులకు మాత్రం నిరాశ తప్పడం లేదు. వీరంతా నియమనింబదనల ప్రకారం మూడు తరాలకు పైగా సాగులో లేకపోవడంతో పట్టాలు దక్కే అవకాశం లేదని తేల్చేసింది సర్కార్. పోడు పట్టాల పంపిణి అనంతరం ఇక మీదట పోడు సమస్య.. అటవిశాఖ కు ఆదివాసీలకు మద్య గొడవలు ఉండవని.. కొత్త పోడు‌కొడితే కఠిన శిక్ష లు తప్పని చెపుతోంది సర్కార్.

 

Tags; Five decades of wild children’s dream..

Post Midle