రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

Date:02/09/2020

వరంగల్ ముచ్చట్లు

వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిద్రమత్తులో ఎదురెదురుగా వస్తున్న  కారు, లారీ ఢీకొన్నాయి. కారు నుజ్జునుజ్జు కాగ అందులో ప్రయాణిస్తున్న  ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులల్లో ముగ్గురు వరంగల్ అర్బన్ జిల్లా పోచమ్మ మైదానంకు చెందిన వారు. ఒకరు నర్సంపేటకు, మరొకరు  పరకాలకు చెందిన వారు.  వరంగల్ నుంచి పరకాల వైపు వైపు వెళుతున్న కారు కాళేశ్వరం నుంచి ఇసుక లారీ వరంగల్ వైపు వెల్లుతుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల వివరాలు మేకల ప్రవీణ్, మేకల రాకేశ్, మేడి చందు, రోహిత్, సాబీర్. విషయం తెలుసుకున్న పరకాల ఏసిపి శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

 

మహానేతకు మంత్రి శంకరనారాయణ అశ్రు నివాళులు

Tags:Five killed in road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *