టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఐదు మంది ప్రమాణ స్వీకారం
తిరుమల ముచ్చట్లు:
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శేషుబాబు, వెంకట సతీష్ కుమార్, శంకర్, ఉదయ భాను, అమోల్ కాలే ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో వీరి చేత జేఈవో వీరబ్రహ్మం ప్రమాణ స్వీకారం చేయించారు.స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం వీరికి జేఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు లోకనాథం, కస్తూరి బాయి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:Five members of the Board of Trustees of TTD took oath
