Natyam ad

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

ప్రకాశం ముచ్చట్లు:


ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారు జామున మాచర్ల నుంచి తిరుపతి వెళ్తున్న కారు కంభం సమీపంలోకి రాగానే లారీని వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు.మృతుల్లో గురువమ్మ , అనిమిరెడ్డి, అనంతమ్మ , ఆదిలక్ష్మి , నాగిరెడ్డి లు ఉన్నారు. వీరంతా పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిపాడు వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ప్రమాద ఘటనతో సిరిగిపాడు గ్రామంలో విషాదం నెలకొంది. ఇదిలాఉంటే పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నారు.

 

Tags: Five people died in a road accident

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.