ఐదు రాష్ట్రాల ఎన్నికలు..బీజేపీకి ప్రతిష్టాత్మకం!

Five States Elections!

Five States Elections!

 Date:06/10/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
2019లో జరగాల్సిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు మరెంతో సమయం లేదు. సరిగ్గా ఆరేడు నెలల్లో లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో… ఇలాంటి ప్రతిష్టాత్మక ఎన్నికలు వస్తాయా? అని కొంతమంది సందేహాలు కూడా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లలో ఎన్ని కలను ఎదుర్కొనడానికి భారతీయ జనతా పార్టీ ఇష్టపడుతుందా? అని అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారు.
ఒక దశలో అయితే.. ఈ ఎన్నికలతో పాటు, లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని కూడా జాతీయ స్థాయిలో విశ్లేషణలు వినిపించాయి. ప్రస్తుతం షెడ్యూల్ వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ, మిజోరంలు భారతీయ జనతా పార్టీకి అంత ప్రతిష్టాత్మకం కాదు. ఎందుకంటే.. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి ఉన్న బలం అంతంత మాత్రం. తెలంగాణలో పుంజుకుంటాం అంటున్నారు కానీ.. ఇక్కడ బీజేపీ ప్రధాన పోటీదారు అయితే కాదు. మిజోరంలో కూడా బీజేపీ ఉనికి అంతగా లేదు.
ఆ బుల్లి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దశబ్దాలుగా ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. ఎటొచ్చీ రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్‌లు మాత్రం.. భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకమైనవి. ఎందుకంటే..ఐదేళ్ల నుంచి అప్రహతీతంగా సాగుతున్న భారతీయ జనతా పార్టీ ప్రభంజనం మొదలైనది ఈ రాష్ట్రాల నుంచినే. ఐదేళ్ల కిందట ఈ మూడు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయాలనునమోదు చేసింది. ఆ ఊపు లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగింది.
ఆ తర్వాత దేశంలోని చాలా రాష్ట్రాల్లో కాషాయ పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఎక్కడైతే బీజేపీ తన వీరవిహారాన్ని మొదలుపెట్టిందో.. ఇప్పుడు అక్కడే మళ్లీ సత్తా చూపించాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ ఆ ఆధిపత్యం అలాగే కొనసాగితే ఫర్వాలేదు… కానీ ఏమైనా తేడా కొడితే మాత్రం రేపటి లోక్‌సభ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
గమనించాల్సిన మరో విషయం.. ఈ మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రథమ శత్రువు అయిన కాంగ్రెస్ మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గడ్ లలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కాబట్టి.. పోరు రసవత్తరంగా, ప్రతిష్టాత్మకంగా మారుతోంది.
Tags:Five States Elections!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *