ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్య

Date:13/12/2019

చెన్నై ముచ్చట్లు:

ఆన్ లైన్ లాటరీ ఓ కుటుంబాన్ని బలి తీసుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తమిళనాడులోని విల్లుపురం, సిద్ధేరి సమీపంలోని సలామత్ నగర్ లో లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అరుల్ అనే ఆభరణాల వ్యాపారి కి లాటరీ టికెట్లు కొనే అలవాటుంది.  డబ్బంతా వాటికే ఖర్చు చేస్తుండడంతో అతడి కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. తన భార్య లక్ష్మీ, ముగ్గురు పిల్లలు బాగ్యలక్షీ,ముదియలక్ష్మీ,యాసినీ లకు  సైనైడ్ ఇచ్చి, తానూ దాన్ని తాగడంతో వారందరూ మృతి చెందారు. అంతేకాదు, అతడు ఈ ఆత్మహత్య ఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించి, కొందరికి షేర్ చేశాడు. మూడు అంకెల లాటరీ టికెట్లు కారణంగా నేను మరణించాను. నాలా ఎవరు ఆశ పడి అప్పులు కాకండని కోరాడు. అరుల్  వీడియో చూసిన వెంటనే కొంత మంది అరుల్ ఇంటికి చేరుకుని, అతడి ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోపలకి ప్రవేశించారు. అయితే, అప్పటికే ఐదుగురు మృతి చెందారు. ఘటనతో పోలీసులు రంగంలోకి దిగారు. లాటరీ వ్యాపారం చేస్తున్న 13 మందిని అరెస్టు చేపారు. మరికొంత మంది లాటరీ వ్యాపారస్తుల కోసం గాలిస్తున్నారు.

 

ప్రత్యేక అలంకరణలో శ్రీ విరూపాక్షి మారెమ్మ

 

Tags:Five suicides in the same family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *