నంద్యాల పట్టణంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు అర్బన్ హెల్త్ సెంటర్ లు మంజూరు

-3 అర్బన్ హెల్త్ సెంటర్లు ( వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ )లాంఛనంగా ప్రారంభం
-నంద్యాల మున్సిపల్ చైర్మన్. షేక్ మబునిసా

 

నంద్యాల  ముచ్చట్లు:

 

నంద్యాల పట్టణంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు అర్బన్ హెల్త్ సెంటర్ లు మంజూరు. అయినాయని అందులో3 అర్బన్ హెల్త్ సెంటర్లు లాంఛనంగా  ప్రారంభించు చున్నాము అని నంద్యాల మున్సిపల్ చైర్మన్ షేక్ .మబునిసా అన్నారు.
గురువారం నంద్యాల పట్టణంలో శ్రీనివాస నగర్. గాంధీనగర్. ఎన్జీవోస్ కాలనీ లలోని   అర్బన్ హెల్త్ సెంటర్లను నంద్యాల పురపాలక సంఘం అధ్యక్షురాలు షేక్ మా బున్నిసా . నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం నంద్యాల పురపాలక సంఘం అధ్యక్షురాలు షేక్ .మబునిసా  మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం విద్య- వైద్యానికి  పెద్దపీట వేసిందని మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఉద్దేశంతో ప్రతి 40 వేల జనాభాకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారని అందులో భాగంగా మన నంద్యాలలో 4 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు మంజూరయ్యాయని అందులో మూడు సెంటర్లకు డాక్టర్లు వైద్య సిబ్బంది వచ్చారని అందుకొరకే ప్రజలకు  మెరుగైన వైద్యం అందించుట కొరకు తాత్కాలిక భవనాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.12.11.13.35.36.39.43. వార్డులకు గాను శ్రీనివాస్ నగర్ లోని దనేల్ పురం గేటు దగ్గర ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ను. 32 రైతు నగరం 12ఉడుమలుపురం నకు సంబంధించి గాంధీ నగర్ నందు ఒక అర్బన్ హెల్త్ సెంటర్.16.17.18.20.21.23.29.13. వార్డు లకు సంబంధించి ఎన్జీవోస్ కాలనీ నందు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ను తాత్కాలిక భవనములో  ప్రారంభించు చున్నాము అని అన్నారు. .

 

 

 

నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం విద్య- ఆరోగ్యానికి  పెద్ద పీట వేసిందని .నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను ఆరోగ్య కేంద్రాలను సుందరంగా  ఆధునీకరించి వార్డులోని ప్రజలకు ప్రాథమిక వైద్యాన్ని అందిస్తుందని అందులో భాగంగానే గురువారం నాడు నంద్యాల పట్టణంలో మూడు హార్బర్ హెల్త్ సెంటర్లను తాత్కాలిక భవనాల్లో లాంఛనంగా ప్రారంభించుకున్నామని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ప్రమాణాలను పెంచుకునే విధంగా 40 వేల జనాభాకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. వార్డులోని వార్డు వాలంటీర్లు ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి ప్రజలు ప్రాథమిక వైద్యం కొరకు ఈ అర్బన్ హెల్త్ సెంటర్ కు వచ్చేలా ప్రజలను చైతన్య పరుస్తున్నారు అని అన్నారు. అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్ల ద్వారా గర్భిణీ స్త్రీలకు బాలింతలు అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి మెరుగైన వైద్యం పొందేలా వారు మహిళలను చైతన్య పరుస్తున్నారు అని అన్నారు.వీరి వెంట కౌన్సిలర్ దేశం సులోచన.  మునిసిపల్ కార్యాలయం సిబ్బంది మునిసిపల్ కౌన్సిలర్లు. సచివాలయ సిబ్బంది డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Five Urban Health Centers have been sanctioned in Nandyal town at a cost of Rs 4 crore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *