మేనకోడలిపై ఐదేళ్లుగా అత్యాచారం

Date:22/11/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. 49ఏళ్ల వ్యక్తి మేనకోడలిని బెదిరించి ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆమె నగ్న వీడియోలు సేకరించిన కామాంధుడు వాటిని అడ్డం పెట్టుకుని బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతానికి చెందిన యువతి(26) కుటుంబంతో కలిసి జీవిస్తోంది. సీలాన్‌పురాకు చెందిన వ్యక్తి ఆమె మేనమామ అవుతాడు. ఐదేళ్ల క్రితం ఓ పని నిమిత్తం క్రితం ఓ పని నిమిత్తం యువతి తన మేనమామతో కలిసి పహర్‌గంజ్‌‌ వెళ్లింది. ఓ రాత్రి అతడితో హోటల్‌రూమ్ తీసుకుని బస చేసింది. ఆ సమయంలో మేనకోడలిపై కన్నేసిన ఆ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తతంగాన్నంతా సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. దాన్ని అడ్డం పెట్టుకుని ఐదేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.ఇటీవల అతడి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు భరించలేక తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పేసింది. దీంతో వారు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి సెల్‌ఫోన్లో బాధితురాలి నగ్న వీడియోలు కనిపించడంతో పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. నిందితుడికి కోర్టు 14రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

 

ద్రాక్ష జ్యూస్ లో సన్నీ లియోన్

 

Tags:Five years rape on niece

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *