Natyam ad

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపాలనే ఫ్లాగ్ మార్చ్.

-మదనపల్లె డిఎస్పీ జి ప్రసాద్ రెడ్డి.

 

మదనపల్లి ముచ్చట్లు:


ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపాలనే ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లి మదనపల్లి డిఎస్పి ప్రసాద్ రెడ్డి తెలిపారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ ధ్యేయంగా కేంద్ర సాయుధ బలగాలైన ఎస్ ఎస్ బి ఫోర్స్ మరియు సబ్ డివిజనల్ పరిధిలోని పోలీస్ అధికారులు సంయుక్తంగా మదనపల్లి పట్టణంలో ఆదివారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక నక్కలదిన్నె నుండి సురభి కాలనీ గాంధీపురం పిఎన్టిటి కాలనీ, సొసైటీ కాలనీ, ఎన్టీఆర్ సర్కిల్, బీసెంట్ సర్కిల్, మల్లికార్జున సర్కిల్, బెంగళూరు బస్టాండు, అప్పారావు తోట, వెంకటరమణ స్వామి దేవాలయం వీధి, బెంగళూరు బస్టాండు, ఎమ్మెస్సార్ సర్కిల్, మెట్రో సర్కిల్, ఇందిరానగర్, మార్పురి వీధి, కృష్ణానగర్, ఎస్బిఐ కాలనీ, రామారావు కాలనీ తదితరాలలో ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలలో ఆపత్రత భావాన్ని తొలగించడానికి శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగేలా శాంతిభద్రతలే లక్ష్యంగా ఫ్లాగ్ మార్చిఫ్లాగ్ మార్చి నిర్వహించడం జరిగిందని డిఎస్పీ తెలిపారు ఈ ఫ్లాగ్ మార్చ్ లో సీఐలు వల్లి భాష, యువరాజు, శేఖర్, ఎస్సైలు మరియు సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బంది పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Flag march to hold elections in peaceful atmosphere.

Post Midle