గుండాల మండలంలో వైద్యం ఎండమావే

Date:19/08/2019

ఖమ్మం ముచ్చట్లు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని ప్రజలకు వాగు దాటితేనే వైద్యం అన్నట్లుగా పరిస్థితి మారింది. అత్యవసర సమయంలోనూ బాధితులను వాగు దాటించడానికి నానా అవస్థలు

పడుతున్నారు. రెండు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్న ఓ చిన్నారి, పురుగుల మందు తాగిన మహిళ, పాము కాటుకు గురైన రైతును అతి కష్టం మీద వాగు దాటించి దవాఖానాకు

తీసుకెళ్లారు. గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామానికి చెందిన సాయిశ్రీ మండల కేంద్రంలోని ఎస్టీ గురుకులంలో మూడో తరగతి చదువుతోంది.మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో

కుటుంబీకులు ఇంటికి తీసుకెళ్లారు.  జ్వరం ఎక్కువ కావడంతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రంలోని పీహెచ్సీకి బయల్దేరారు. అక్కడికి వెళ్లాలంటే గ్రామానికి మధ్యలో ఉన్న

మల్లన్నవాగు దాటక తప్పని పరిస్థితి. దాంతో అంతా కలిసి నడుంలోతు నీళ్లలోంచి వాగు దాటి హెల్త్ సెంటర్ కు వెళ్లారు. మండల పరిధిలోని కన్నాయిగూడెం గ్రామానికి చెందిన గిరిజన రైతు దుగ్గి

శోభన్బాబు పొలంలో శనివారం పని చేస్తుండగా పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులకు తెలపడంతో శోభన్ బాబుని అతికష్టం మీద మల్లన్న వాగు దాటించి గుండాల దవాఖానాకు తీసుకెళ్లారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఇల్లందు సర్కారు దవాఖానాకు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.రోళ్లగడ్డ గ్రామానికి చెందిన భూక్య సాలి శనివారం పురుగుల

మందు తాగింది. గమనించిన కుటుంబీకులు వెంటనే ఎడ్ల బండిలో మల్లన్న వాగు వరకు తీసుకువచ్చారు. శనివారం ఉదయం మండలంలో కురిసిన భారీ వర్షానికి మల్లన్న వాగు ఉధృతంగా

ప్రవహిస్తోంది. అయినా తల్లిని బతికించుకోవాలనే తపనతో ఆమె కుమారులు, గ్రామస్తులు నానా అవస్థలు పడి మల్లన్న వాగు దాటించి మండల కేంద్రంలోని హాస్పిటల్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె

చికిత్స పొందుతోంది.గుండాల మండలంలోని నర్సాపురం తండాకు చెందిన గుగులోత్ భామిని రాత్రి మనస్థాపంతో పురుగుల మందు తాగింది. కుటుంబీకులు నానా అవస్థలు పడి ఉద్ధృతంగా

ప్రవహిస్తున్న మల్లన్న వాగుని దాటించి మండల కేంద్రంలోని సర్కారు దవాఖానాకు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన తర్వాత పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం రెఫర్చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో  మృతిచెందింది.

తెలంగాణలోకి ఏపీ మద్యం వ్యాపారులు

Tags: Healing in the Gundala Zone

తెలంగాణలోకి ఏపీ మద్యం వ్యాపారులు

Date:19/08/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

ఏపీలో జగన్ ప్రభుత్వం మద్య నిషేధానికి అనుగుణంగా అడుగులు వేస్తూ బెల్టు షాపులపై కొరడా విధించడంతో ఇక అక్కడి మద్యం షాపుల కాంట్రాక్టర్లు తెలంగాణపై దృష్టి సారించారు. ఇక్కడ అలాంటి

నియంత్రణ ఏదీ లేకపోవడం వారికి వరంగా మారింది. దీంతో ముఖ్యంగా ఏపీ, తెలంగాణ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో తమ వ్యాపారాన్ని సాగించేందుకు

నడుం కడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణాలో మద్యం షాపుల ప్రారంభానికి దరఖాస్తుదారులు లక్ష రూపాయల రుసుం చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా ఏపీ
‘ గాలి ‘ తెలంగాణాలో వీచనుండడంతో.. ఇక్కడి ప్రభుత్వం ఈ అప్లికేషన్ ఫీజును ఏకంగా రెట్టింపు.. అంటే రెండు లక్షలు చేసినట్టు సమాచారం . ఇప్పటికే లక్ష రూపాయల రుసుముతో ఖజానాకు

300 కోట్లకు పైగా లాభం చేకూరినట్టు చెబుతున్నారు. సాధారణంగా అక్టోబరు నుంచి తెలంగాణాలో కొత్త ఎక్సయిజు పాలసీ ప్రారంభమవుతుంది. అందువల్ల మరో రెండు నెలల్లోగా ఏపీ కాంట్రాక్టర్లు,

ఇక్కడ తమ ‘ మద్యం వాపారాన్ని ‘ విస్తరించేందుకు పావులు కదుపుతున్నారని, రెండు లక్షలు కాదు.. మూడు లక్షల ఫీజయినా చెల్లించేందుకు సుముఖంగా ఉన్నారని తెలిసింది. దీంతో-

అటు- తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరగడానికి వీలుంటుంది గనుక ఇక్కడి సర్కార్ ‘ పచ్ఛ జెండా ‘ ఊపినట్టే లెక్క

సంక్షేమ హాస్టల్స్  కు 3000 సీసీ కెమెరాలు

Tags: AP liquor dealers into Telangana

సంక్షేమ హాస్టల్స్  కు 3000 సీసీ కెమెరాలు

Date:19/08/2019

ఖమ్మం ముచ్చట్లు:

సంక్షేమ విద్యార్థిని, విద్యార్థుల సౌకర్యం కోసం ప్రభుత్వం వసతి గృహాలనునెలకొల్పింది. వీటిపై పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో ఎవరి ఇష్టారాజ్యం వారిది అన్నట్లుగా ఉంటోంది.వసతి గృహాలలో

నిర్వహణ పారదర్శకంగా కొనసాగేందుకు ప్రభుత్వం‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో 50 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో మూడు నుంచి ఇంటర్‌ వరకు 5,580

మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వసతి గృహాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సీసీ కెమెరాల ఏర్పాటుతో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం

అందిస్తున్నారా? లేదా అని పరిశీలన జరిపే అవకాశం ఉంది. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటికి ఇక చెక్‌ పడనుంది. వసతి గృహాల్లో

విద్యార్థుల ప్రవర్తన నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఏర్పడనుంది. బయటి నుంచి ఎవరు వస్తున్నారు.. ఎవరు వెళుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతోందా?

తెలుసుకోవడంతోపాటు విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. వసతి గృహాల్లో పారదర్శకత పెంచడానికి.. అక్రమాలకు చెక్‌ పెట్టడానికి ప్రభుత్వం జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ వసతి

గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది.ఒక్కో వసతి గృహంలో ఆరు కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వసతి గృహం ప్రాంగణం, పరిసరాల్లో ఏమి జరిగినా తెలుసుకునేందుకు వీలుగా ప్రధాన

ద్వారం వద్ద, వరండాల్లో, వంట గదిలో, భవనానికి రెండు వైపుల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆయా కెమెరాలను వసతి గృహ సంక్షేమాధికారి గదిలోని కంప్యూటర్‌కు అనుసంధానం చేశారు.

అనుమతి లేనివారు లోపలికి ప్రవేశించినా, అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎలా జరిగింది, ఏమి జరిగిందనేది పక్కగా తెలుసుకునేందుకు ఇవి దోహదపడతాయి. కొన్ని వసతి గృహాల్లో సరకులు

సంబంధిత వార్డెన్లు, సిబ్బంది అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వాటికి ఇక చెక్‌ పడనుంది. వసతి గృహాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా జిల్లా

అధికారులకు వెంటనే తెలిసే అవకాశం ఏర్పడింది. వసతి గృహా సంక్షేమాధికారి విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా తెలుసుకునే అవకాశం ఉంది. బాలికల వసతి గృహాల్లో భద్రత పెరగనుంది.

అపరిచిత వ్యక్తులు వసతి గృహంలోకి ప్రవేశించినా, విద్యార్థులకు సమయానికి భోజనం అందిస్తున్నారా? అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. వసతి గృహాల్లో పారదర్శకత మరింత పెరగనుంది.

నిజామాబాద్…మారుతోందోచ్

 

Tags: 3000cc cameras for welfare hostels

నిజామాబాద్…మారుతోందోచ్

Date:19/08/2019

నిజామాబాద్ ముచ్చట్లు:

నిజామాబాద్ నగరం…. ఎటు చూసిన తవ్వకాలు, కట్టడాలు, పైప్‌లైన్ పనులు, హెచ్చరిక బోర్డులు, రోడ్డు డైవర్షన్‌లు…. ఇవన్నీ గత కొంతకాలంగా నగర ప్రజలకు కనిపిస్తున్న దృశ్యాలు….

ఆ పనుల ఫలితం ఎలా ఉన్న ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తాతో పాటు స్థానిక ఎంపి కల్వకుంట్ల కవితను నగర పాలక వర్గాన్ని ఎవరినీ వదిలిపెట్టకుండా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎదురవుతున్న అసౌకర్యం

అలాంటిది కావడం. అందుకు కారణంగా కాగా అవన్నీ ఎమ్మెల్యే గణేష్‌గుప్త వద్దకు ఫిర్యాదు అందుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఇదే అదునుగా బిజెపి, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు సైతం అధికార

పార్టీపై దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలోను విమర్శల హోరు సాగుతూనే ఉంది. ఇదంతా ఒకవైపు మాత్రమే కనిపించే, వినిపించే అంశం కాగా వాటన్నింటిని కొట్టిపారేస్తూ, విమర్శలను

లెక్కచేయకుండా ముందుకు సాగుతున్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. నిజానికి ఆయా పనులను చేపట్టేందుకు ముందే ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్యే

మీడి యా సమావేశం పెట్టి తన మనోగతాన్ని వినిపించారు. అర్బన్‌లో మిషన్ భగీరథ పనుల వల్ల రోడ్లు పాడవుతున్నాయని అధికారులు తనను వారించినా తాను అంగీకరించలేదని తేల్చి చెప్పారు.

ప్రస్తుతం భూగర్బంలో తాగునీటి పైప్‌లైన్లు ఉన్నా అవి భవిష్యత్తు అవసరాలు తీర్చలేవని, అద్బుత పథకం అవకాశంగా వచ్చినప్పుడు వినియోగించుకోవాల్సిందేనని బిగాల పట్టుబట్టారు. ఇదే

విషయాన్ని స్పష్టం చేస్తూ భూ గర్భ మురికి నీటి కాల్వల పనులు, భగీరథ పనులతో పాటు నగర సుందరీకరణ పనులను ఒకేసారి చేపడుతున్నామని, ప్రజలకు కొంతకాలం అసౌకర్యం తప్పదని

స్పష్టం చేశారు. కొంతకాలం అసౌకర్యం  ఎదురైనా నగరాన్ని మోడల్  సిటీగా మార్చే అవకా శం ఉందని, ప్రజలు సహకరించాలని కోరారు. అయితే అధికారులకు, ఎమ్మెల్యే పనుల కొనసాగింపుకే మొగ్గు

చూపారు. పాలకవర్గం తనకు అనుకూలంగా ఉండ టం స్థానిక ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారం ఎమ్మెల్యేకు కలిసొచ్చినట్లైంది. వరుసగా 2016-17,2017-18, 2018-19 వార్షిక సంవత్సరాలుగా రూ.

100 కోట్ల చొప్పున మొత్తం రూ. 300 కోట్లను నగర పనులకు సాధించారు. ఇప్పటికే రూ. 200 కోట్ల పనులకు శ్రీకారం చుట్టగా మరో రూ.వంద కోట్లకు పరిపాలన ఆమోదం రావాల్సి ఉంది. నిజానికి

గతంలో సీనియర్ నేతగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో భూగర్బ మురికి కాల్వల పనులకు శ్రీకారం చుట్టిన ధర్మపురి శ్రీనివాస్ ఆ పనుల కారణంగానే రాజకీయంగా కోలుకోలేని దెబ్బతినగా ఆ

పనులు వద్దంటూ బిగాలకు అనుచరులు వారించేందుకు యత్నించారు. అయితే పనులు పూర్తి చేసి తీరుతానని, విమర్శకులే ప్రశంసలు కురిపిస్తారంటూ ఆయన మొండిగా వాదిస్తూ వస్తున్నారు.

చివరికి నగరమంతా తవ్వకాలు చేపట్టి భూగర్బ మురికి నీటి కాల్వల పనులను దాదాపు పూర్తి చేశారు. ఇక్కడే వేసవికాలంలో తవ్వకాల వల్ల వచ్చిన దుమ్మ తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే

అవేమి బిగాల దూకుడుకు అడ్డుకట్ట వేయకపోగా మిషన్ భగీరథ పనులను సైతం పూర్తి చేయించారు. ఆయా పనులను రూ. 171 కోట్లను ఖర్చు చేయగా అమృత పథకం కింద రూ. 98 కోట్లను

ఖర్చు చేస్తున్నా రు. నగరంలోని 8 చోట్ల భారీ తాగునీటి ట్యాంకుల నిర్మాణానికి రూ. 20 కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా పనులు చివరి దశకు చేరగా నగర ప్రజల చిరకాల డిమాండ్

అయిన రైల్వే అండర్ బ్రిడ్జి పనులను ప్రారంభించారు. ఈ విషయం లో జిల్లా కలెక్టర్, ఆర్‌అండ్‌బి, పోలీస్, ఇతర శాఖ అధికారులతో చర్చించి వెనకడు గు వేసిన ఎమ్మెల్యే అంగీకరించలేనట్లు తెలిసింది.

వీటికి తోడు నగరంలో ప్రధాన రోడ్డు మార్గాల్లో రోడ్డు విభాగినిని అందంగా మార్చే పనులు ఊపందుకున్నాయి. ప్రత్యేక రాతికట్టడాలు నగర ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పులాంగ్, కలెక్టరేట్

మొదలుకొని నెహ్రుపార్క్, గాంధీచౌక్ అన్ని కూడళ్లు ఆకర్షణీయంగా తయారు కానున్నాయి. వివిధ నగరాలను కలిపే రోడ్డు మార్గాల్లో దాదాపు 20 కిలో మీటర్ల మేర అందమైన కట్టడాలతో డివైడర్

రూపుదిద్దుకునే పనులు వేగవంతయమ్యాయి. ఓ వైపు అందమైన రోడ్లు, 24 గంటల తాగునీరు, మురికినీరు కనిపించని భూగర్బకాల్వలను పూర్తి చేస్తునే ఏకకాలంలో ఆహ్లదాన్ని పెంచే సుందరీకరణ పనులు పూర్తి చేసి తీరాలన్నదీ ఎమ్మెల్యే బిగాల మొండి పట్టుదలగా కనిపిస్తోంది.

కాలం  చెల్లిన ఆటోలు 

Tags: Nizamabad … marutondoc

కాలం  చెల్లిన ఆటోలు 

Date:19/08/2019

వరంగల్ ముచ్చట్లు:

పిల్లలను తీసుకెళ్లే ఆటోల స్థితిగతులు తెలుసుకోవడంలో తల్లిదండ్రులు విఫలమవుతున్నారు. ఒక్క ఆటోలో పరిమితికి మంచి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదు. డ్రైవర్‌కు కనీస అర్హత ఉందా ? లేదా

తాగి డ్రైవింగ్ చేస్తున్నాడా గమనించడం లేదు. కాలం చెల్లిన వాహనాలను ఉపయోగిస్తూ డ్రైవర్ల నిరక్షం కారణంగా రోజు ఎన్నో ఆటోలు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. పిల్లలను నమ్మకంగా

డ్రైవర్‌లకు అప్పగించిన తల్లిదండ్రులు ఆపై డ్రైవింగ్ వారు వాహనాల కండిషన్‌పై దృష్టి పెట్టడం లేదు. ఇలాంటి విషయాలను ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తే పిల్లలు క్షేమంగా ఇంటికి కొస్తారన్న

విషయాన్ని మరిచిపోవద్దు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న, ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిన ఆటోల అవసరం ఎంతైనా ఉంది. ప్రతి వారు తమ పిల్లల భవిష్యత్తుకై

ఆరాటపడుతున్నారు తప్ప చిన్న చిన్న విషయాలపై దృష్టి సారించలేకపోతున్నారు. బడి పిల్లల భద్రతకై ట్రాఫిక్ పోలీసుల దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదాలు జరిగినప్పుడు

తీసుకునే చర్యల కన్న, ముందు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నగరంలో వందల కొద్ది స్కూళ్లు ఉన్నాయి. రోజుకు ఎన్ని ఆటోలలో పిల్లలను బడికి తీసుకెళ్తున్నారు. వారి ఆటోల వివరాలను

కూడా పోలీసుల ఆరాతీయాల్సిన అవసరం ఉంది.నగరంలోనే కాకుండా మారుమూల ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు ఆటోలను వాడుతున్నారు. ఆటోలో పరిమితికి మంచి విద్యార్థులను

తీసుకెళ్తున్న రోడ్డు రవాణా శాఖ అధికారులు కానీ పట్టించుకున్న దాఖాలాలు లేవు. కాలం చెల్లిన ఆటోలను చూస్తు సీజ్ చేయలేకపోతున్నారు. అధికారుల నిర్లక్షం  వల్ల ఎంతో భవిష్యత్తును కలిగిన

విద్యార్థులు ప్రాణాలను బలికావాల్సి వస్తోంది. మీ పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోలకు సంబంధించిన పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. డ్రైవర్‌కు లైసెన్స్ ఉందా, లేదా అడిగి తెలుసు

కోవాలి. వాహనంలో పరిమితిమించి ఎంత మందిని విద్యార్థులను తీసుకెళ్తున్నారనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. పరిమితికి మించి తీసుకెళ్తుంటే మీరు డ్రైవర్లను హెచ్చరించారు. లేదా

పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కొందరు డ్రైవర్లు మద్యం తాగి వాహనా లను నడుపుతున్నారు. దీనిని తల్లిదండ్రులు దృష్టి సారించాలి. డ్రైవర్ ఆటోలకు ఇరువైపుల స్కూల్ బ్యాగులను

వేలాడదీయుట ప్రమాదం. ఇలాంటి పరిస్థితి లేకుండా చూసుకోవాలి. కాలం చెల్లిన వాహనాల్లో పిల్లలను పంపించవద్దు

 

యదేచ్చగా కల్తీలు

Tags: Outdated Autos

యదేచ్చగా కల్తీలు

Date:19/08/2019

కామారెడ్డి ముచ్చట్లు:

కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు కల్తీరాయుళ్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఉదయం నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ప్రజల అవసరాలన్నీ కల్తీమయం అవుతున్నాయి.

ప్రభుత్వాలు ఎన్నిరకాల చర్యలు తీసుకున్నా అధికారుల వైఫల్యం ప్రజలకు శాపంగా మారుతోంది. ఫలితంగా కల్తీ వస్తువులు ప్రజల ఉసురుతీస్తున్నాయి. నిత్య జీవితంలో ప్రజలకు అతిముఖ్యమైన

వంట నూనెల కల్తీ అడ్డూ అదుపులేకుండా సాగుతోంది. నిజామాబాద్ వ్యాప్తంగా వంట నూనెల అమ్మకాలపై నిఘా లేకపోవడం, తనిఖీలు అసలే జరగకపోవడంతో ఏది కల్తీ, ఏది మంచి అన్నది

లేకుండా ప్రతినెల కోట్లాది రూపాయల అమ్మకాలు సాగుతున్నాయి. ప్రజలను తీవ్ర అనారోగ్యానికి గురి చేసే వ్యర్థపదార్థాలు వంట గదికి చేరుతున్నాయి.ప్రతి ఇంట్లో వంటకు వినియోగించే నూనె

అమ్మకాల్లో కల్తీ రాయుళ్లు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. బ్రాండెడ్ వంట నూనెల పేర్లతోను కల్తీ నూనె మార్కెట్‌లో విక్రయించబడుతున్నట్లు ఆరోపణలున్నాయి. నిజామాబాద్ నగరంతో పాటు

కామారెడ్డి, పిట్లం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కల్తీనూనెల అమ్మకాలు జరుగుతున్నట్లు విస్తృత ప్రచారం ఉంది. నిజానికి పల్లీ, పొద్దుతిరుగుడు, సోయాల నుంచి తయారైన వంట నూనెలను ప్రజలు

తమ నిత్యావసరాలకు వినియోగిస్తారు. వీటి ధర ఎక్కువగానే ఉండగా బిటి పత్తి, మొక్కజొన్న చొప్ప, జొన్న, గడ్డి, ఆముదం నుంచి తీసే నూనెలు అతి తక్కువ ధరకు లభ్యమవుతుంటాయి. తక్కువ

ధరకు లభించే నూనెలను పల్లీ, పొద్దుతిరుగుడు, సోయా నూనెలతో కలిపి విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వీటికి తోడు జంతు కళేబరాల నుండి తీసే నూనె సైతం పెద్ద ఎత్తున నిజామాబాద్,

కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ తదితర పట్టణాల్లోని ఫాస్‌ఫుడ్ సెంటర్‌లు, హోటళ్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.నిజామాబాద్ నగర శివారులోని మాలపల్లిలో అనేకసార్లు జంతు కళేబరాల నుంచి నూనె

తీసే ముఠాలు పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే పోలీసు దాడులు కల్తీ రాయుళ్లను నిలువరించకపోగా పెద్ద ఎత్తున కల్తీనూనె మార్కెట్‌లకి వస్తున్నట్లు సమాచారం. మరో పక్క వివిధ ప్రాంతాల్లో

ఏర్పాటు చేసిన చౌకధర నూనెలు ఆయిల్ విక్రయదారులకు చేరుతున్నట్లు సమాచారం. నిరంతరం జరుగుతున్న ఈ సరఫరా కోట్ల రూపాయల విక్రయానికి దారితీస్తుండగా వంట నూనె పూర్తిగా

కల్తీమయమవుతోంది. శుభకార్యాల్లో పెద్ద ఎత్తున అవసరమయ్యే నూనెలు కొనుగోలు డబ్బాల రూపంలో జరుగుతుండగా వాటిలో ఎక్కువ శాతం కల్తీ అయిన నూనెలే ఉంటున్నాయని

తెలుస్తోంది.ఖరీదైన బ్రాండెడ్ వంట నూనెలను వాడకపోగా ఎలాంటి ధృవీకరణ లేని వంట నూనెలను నేరుగా వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తారు. ఇక్కడే వారికి కావాల్సిన నూనెను కొలతల

ప్రకారంగా విక్రయిస్తుండగా కల్తీనూనెలను అరికట్టలేని పరిస్థితి తలెత్తోంది. కామారెడ్డిలో ఓ వ్యాపారి కల్తీనూనెలతో కోట్లాది రూపాయలను సంపాదిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు సైతం

అయితే పెద్ద ఎత్తున ముడుపులు అందుకుంటున్న అధికారులు అక్రమార్కునిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. సదరు వ్యాపారి పెద్ద ఎత్తున హోల్‌సెల్ అమ్మకాలను సాగిస్తూ కామారెడ్డి పరిసర

ప్రాంతాల్లో సైతం కల్తీనూనెలతో ముంచెత్తుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మరో పక్క కామారెడ్డి జిల్లా పిట్లంలో కల్తీ నూనెలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం

కావడంతో చౌకగా లభించే నాణ్యతలేని వంట నూనెలు పిట్లంలో పెద్ద ఎత్తున విక్రయించబడుతోంది. మామూలు మండల కేంద్రమైన పిట్లంలో ప్రతిరోజు లక్షలాది రూపాయల వంట నూనెల అమ్మకాలు

జరుగుతుండడం గమనార్హం.నిజామాబాద్ నగరంలో ఓ ప్రముఖ వ్యాపారి కల్తీవంట నూనెలతోనే కోట్లు సంపాదించినట్లు ప్రచారం ఉంది. నిజామాబాద్ గంజ్ ప్రాంతం మొదలుకొని పలుచోట్ల భారీగా

కల్తీవంట నూనెలు విక్రయించబడుతున్నాయి. నూనెల తయారీ అమ్మకాలపై నిర్థిష్ట మార్గదర్శకాలు లేకపోవడంతో వంట నూనెల విక్రయాలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. వంట నూనెల

దుకాణాలపై దాడులు జరిగిన దాఖలాలు లేకపోగా ప్రతి ఇంటి వంటగదిని కల్తీ పలకరిస్తోంది. ఫలితంగా ప్రజలకు గుండెపోటు, బిపి తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. కల్తీనూనెల కారణంగా రక్త

నాళాల్లో కొవ్వు పేరుకుపోయి చిన్నవయస్సులోనే అనేకమంది మృత్యువాత పడుతున్నారు. వైద్యులు చేస్తున్న హెచ్చరిల్లో వంట నూనెలు చేరుతుండగా కల్తీని నిరోధించలేక వంట నూనె లేకుండా వంట చేయలేక సామాన్య ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారు.

పేరుకే… ప్లాస్టిక్ బ్యాన్ 

Tags: Adulterers

పేరుకే… ప్లాస్టిక్ బ్యాన్ 

-ఆచరణల్లో కనిపించని నిషేధం

Date:19/08/2019

నిర్మల్ ముచ్చట్లు:

పర్యావరణానికిహాని కలిగించే ప్లాస్టిక్‌ను వాడొద్దని ప్రభుత్వాలు చెబుతున్నారు. ప్లాస్టిక్‌ నిషేధించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని మూడు పట్టణాలు, 18 మండలాల్లో

ప్లాస్టిక్‌కు ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు. నిర్మల్‌లో ప్రతి రోజు 68 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరిస్తుండగా.. ఇందులో ప్లాస్టిక్‌ సంచులు, బాటిళ్లు వంటివి దాదాపు ఎనిమిది క్వింటాళ్లు, భైంసాలో

20 మెట్రిక్‌ టన్నులకు సుమారు నాలుగు క్వింటాళ్లు ఉంటున్నాయంటే వినియోగం ఎంత మొత్తంలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పర్యావరణానికి పెనువిఘాతంగా మారిన ప్లాస్టిక్‌ను

నిషేధించాలని నిర్మల్‌ మున్సిపాల్టీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్లాస్టిక్‌ రహిత జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఆగస్టు 15నుంచి చిరు దుకాణదారులు మొదలుకొని పెద్ద వ్యాపారుల వరకు ఎట్టి

పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్‌ సంచులు విక్రయించకూడదని, వినియోగించవద్దని ప్రకటన జారీ చేశారు. అమలునకు ఆరంభంలోనే పెను విఘాతం కలిగింది. ఎక్కడికక్కడ ప్లాస్టిక్‌ సంచులు పెద్ద మొత్తంలోనే

సదరు వ్యాపారులు వాడుతున్నారు. కూరగాయలు, తదితర సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారులకు వాటిలోనే వస్తువులను ప్యాక్‌ చేసి అందజేస్తున్నారు. పర్యావరణానికి

పెనుభూతంలా మారిన ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించాలన్న ధ్యేయంగా అన్నిచోట్ల ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నిర్మల్‌ మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్లాస్టిక్‌పై సమరం చేస్తామని

ప్రకటించినా ఆచరచణలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో యథావిధిగా మారిందిమరికొందరు వ్యాపారులైతే ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన ప్లాస్టిక్‌ సంచులను, అందులోనూ నాణ్యత లేనివి,

నిషేధించిన వాటిని విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్‌ వినియోగంతో పర్యావరణానికి పెద్దమొత్తంలో నష్టం వాటిల్లుతోంది. ఈ ప్లాస్టిక్‌కు నిర్మూలించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం

కలిగిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని గతంలోనే కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. భూసారం తగ్గడం, వాటిని తిన్న పశువులు జీర్ణం కాక మృత్యువాత పడడం, ఆహార పదార్థాలు

వాటిలో ప్యాక్‌ చేసి ఇవ్వడం వంటి వాటితో ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం పడడం, మురుగు కాలువల్లో పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా నిలుస్తుండడం, చెరువులు, నదులు, కుంటల్లో

చేరడంతో నీరు కలుషితం కావడం, తదితర అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతటి వైపరిత్యాలు కలిగిన ప్లాస్టిక్‌ను నిరోధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పుర అధికార యంత్రాంగం

సైతం ప్లాస్టిక్‌పై సమర శంఖం పూరించారే తప్ప వాటిని కట్టడి చేయడంలో సరైన దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం ఇష్టారీతిన వాటిని విక్రయించడం, వినియోగిస్తున్నారు. ఇకనైనా నిషేధంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది

 

గులాబీ నేతల కొత్త కీచులాటలు

Tags: Just the name … the plastic bane

గులాబీ నేతల కొత్త కీచులాటలు

Date:19/08/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ నేతల తీరు, అధిష్టానానికి ఇబ్బందిగా మారిందా పార్లమెంట్ ఎన్నికల నుంచి మొదలైన నేతల మధ్య రగడ, ఇప్పటికీ కంటిన్యూ అవుతుండటం, హైకమాండ్‌కు

తలనొప్పులు తెచ్చి పెడుతోందా ఇప్పుడు తాజాగా మరోసారి గ్రేటర్ లీడర్ల మధ్య రచ్చకొచ్చిన వివాదమేంటి ఎవరికివారే యమునా తీరే అన్నట్టు సాగుతున్న నాయకులను ఏకతాటిపైకి తెచ్చేందుకు,

కఠిన నిర్ణయాలకు కేటీఆర్‌ సిద్దమవుతున్నారా. కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ గులాబీ నేతల మధ్య కోల్డ్ వార్ పీక్‌ స్టేజ్‌కి చేరుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్ల మధ్య విభేదాలు

రచ్చరచ్చవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా బయటపడ్డ విబేధాలు, ఇప్పటికీ కొనసాగుతున్నట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారిగా ఇంచార్జీలను

నియమించి మరీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలు పెట్టింది గులాబీ పార్టీ. పాత కొత్త అని తేడా లేకుండా నాయకులంతా కలిసి అనుకున్న విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని,

గులాబీ బాస్ ఆదేశిస్తే గ్రేటర్‌లో మాత్రం నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దాని ఫలితంగానే సిటీలోని చాలా నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ఇంకా పూర్తి కాలేదు. ఇదే గులాబీ

బాస్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది.  పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థుల మధ్య సరైన కోర్దినేషన్ లేకుండా పోయింది. అప్పుడు ఎమ్మెల్యేలు సహకరించడం లేదని పార్టీ

పెద్దలకు ఎంపీ అభ్యర్థులు ఫిర్యాదు కూడా చేశారు. పార్టీ నిర్వహించిన బహిరంగ సభలకు కూడా నాయకులు జనసమీకరణ చెయ్యడంలో విఫలమయ్యారు. దానికి కారణం నేతల మధ్య

సమన్వయలోపంగా గుర్తించిన పార్టీ ఎన్నికలకు ముందు సిటీ నేతలకు క్లాస్ కూడా తీసుకున్నారు. అయినా సరే నేతలు మారలేదు. దీంతో కచ్చితంగా గెలుస్తాం అనుకున్న స్థానాలు కూడా

కోల్పోయింది టిఆర్ఎస్. అయితే తాజాగా తెలంగాణ భవన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై గ్రేటర్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. జిల్లాలతో పోలిస్తే సిటీలో చాలా

తక్కువగా సభ్యత్వం నమోదు అవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు, ఇగోల వల్లే కార్యక్రమం నత్తనడకగా కొనసాగుతుందన్న

సమాచారంతో, తనే స్వయంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తానని గ్రేటర్ నేతలకు చెప్పారట కేటీఆర్. నియోజకవర్గాల వారిగా వివరాలు సేకరించిన కేటీఆర్, సంబంధిత నాయకులకు గట్టిగానే క్లాస్

తీసుకున్నారట. దీనికి తోడు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, మేయర్ అభ్యర్థులను కూడా నగర నాయకులే ఎవరికీ వారు డిసైడ్ చేసుకుని, ఇప్పటి నుంచే గ్రూపులు

కడుతున్నట్టు తెలుస్తోంది. ఎవరికి వారే యమునాతీరే అంటూ వ్యవహరించడం పార్టీకి ఇబ్బందిగా మారింది. దీంతో నేతల మధ్య సమన్వయం కుదిర్చే పనిలో ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

మొత్తానికి పార్టీ పెద్దలు సమావేశం నిర్వహించిన ప్రతిసారీ, మేమంతా ఒకే లైన్‌లో ఉన్నామంటూ పైకి చెపుతున్న గ్రేటర్ నాయకులు, లోలోపల మాకు మేమే, మీకు మీరే అన్నట్టు

వ్యవహరించిండాన్ని పార్టీ సీరియస్‌గానే గమనిస్తున్నట్టు తెలుస్తోంది. నగరంలో పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైతే అధినేత కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సీనియర్ నేతలే చర్చించుకుంటున్నారు.

మంగళవారం సీఎం కలెక్టర్లతో సమావేశం

Tags: The new cheers of the rose leaders