గర్భవతులు పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి

Date:15/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

గర్భవతులు అందరు క్రమం తప్పకుండ పాలు, గ్రుడ్డులాంటి పౌష్ఠికాహారాన్ని ప్రతి రోజు తీసుకోవాలని మండల మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సోనియా పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలో ఆయుష్‌మాన్‌భారత్‌ పథకం క్రింద ర్యాలీని 104 వైద్యాధికారి డాక్టర్‌ ప్రవీన్‌, డాక్టర్‌ ఆనందరావుతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 2 వరకు మున్సిపాలిటి, మండల సబ్‌సెంటర్లలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకోవాలన్నారు. గర్భవతులు పౌష్ఠికాహారంతో పాటు సరైన వైద్యచికిత్సలు చేసుకోవాలని సూచించారు. గర్భవతులు నిర్లక్ష్యం చేస్తే బిడ్డలు ఆనారోగ్యానికి గురైయ్యే అవకాశం ఉందని తెలిపారు. గర్భవతులు ప్రతి నెల తమ ఆరోగ్య పరిరక్షణ వివరాలను నమోదు చేయించుకుని వైద్య సేవలు పొందాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా గర్భవతులకు చికిత్సలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ హరిప్రసాద్‌, సోమలి, విజయలక్ష్మి, పార్వతమ్మతో పాటు ఏఎన్‌ఎంలు ,ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

రైల్వేబోర్డు మెంబర్‌గా ఎంపి రెడ్డెప్ప

Tags; Pregnant women should take nutritional supplements

రైల్వేబోర్డు మెంబర్‌గా ఎంపి రెడ్డెప్ప

Date:14/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు పార్లమెంట్‌ సభ్యులు ఎన్‌.రెడ్డెప్పను కేంద్ర ప్రభుత్వం రైల్వేబోర్డు మెంబరుగా నియమించింది. శనివారం ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ రైల్వేబోర్డు మెంబరుగా నియమించేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి, రాజంపేట ఎంపి మిధున్‌రెడ్డికి, రాష్ట్రపంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో సభ్యుడుగా కొనసాగనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రైల్వేలైన్లు ,స్టేషన్ల అభివృద్ధికి శక్తి వంచన లేకుండ కృషి చేస్తానని తెలిపారు. కాగా తొలిసారిగా పార్లమెంట్‌ సభ్యులుగా ఎంపికైన రెడ్డెప్ప దళితకుటుంబంలో జన్మించారు. సీనియర్‌ న్యాయవాదిగా కొనసాగుతూ వైఎస్సార్సీపిలో ఎంపిగా గెలుపొందారు. పార్లమెంట్‌లో వివిధ రకాల సమస్యలపై తొలి సమావేశాలలోనే తన సత్తాచాటుకుని ఆదర్శంగా నిలిచారు. రైల్వేబోర్డు మెంబరుగా నియమితులైన వెంటనే మంత్రి పెద్దిరెడ్డిని కలసి ఆయన ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పలువురు ఎంపి రెడ్డెప్పకు శుభాకాంక్షలు తెలిపారు.

15న మదనపల్లెలో ఆటోడ్రైవర్ల సమావేశం

Tags: MP Reddeppa as Railway Board Member

15న మదనపల్లెలో ఆటోడ్రైవర్ల సమావేశం

Date:14/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

మదనపల్లె ఆర్టీవో కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఆటోడ్రైవర్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆర్‌టిఏ యూనిట్‌ అధికారి మనోహర్‌రెడ్డి తెలిపారు. శనివారం రాత్రి ఆయన పుంగనూరులో ఆటోడ్రైవర్లు, యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు డిప్యూటి ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్‌ బసిరెడ్డి ఆదేశాల మేరకు మదనపల్లెలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు ఆటోడ్రైవర్లకు రూ.10 వేలు చెల్లించే కార్యక్రమానికి సంబంధించి ఆటోరికార్డులను ఆధార్‌తో అనుసందానం చేయాల్సి ఉందన్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశానికి అన్ని రకాల ఆటోలకు చెందిన యజమానులు, డ్రైవర్లు హాజరుకావాలని ఆయన కోరారు.

జాతీయ లోక్‌అదాలత్‌లో 68 కేసులు పరిష్కారం

Tags: Automobile drivers conference in Madanapalle on 15th

జాతీయ లోక్‌అదాలత్‌లో 68 కేసులు పరిష్కారం

– రూ.29.18 లక్షలు పరిహారం చెల్లింపు

Date:14/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు కోర్టు ఆవరణంలో జాతీయ మెగాలోక్‌అదాలత్‌ను సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ ఆధ్వర్యంలో ప్రిన్సిపుల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి భారతి, కలసి శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నిరకాలకు చెందిన 68 కేసులను పరిష్కరించి, రూ.29.18 లక్షలు పరిహారం చెల్లింపు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి బాబునాయక్‌ మాట్లాడుతూ ప్రజలకు సత్వరం న్యాయం అందించడమే లక్ష్యంగా లోక్‌అదాలత్‌లను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీర్ఘకాలంగా పరిష్కారం కానీ కేసులను కూడ లోక్‌అదాలత్‌లో పరిష్కరించడం జరుగుతోందన్నారు. ప్రజలు పట్టింపులతో కాలాన్ని, ధనాన్ని వృధా చేసుకోకుండ తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు లోక్‌అదాలత్‌ వేదికౌతుందన్నారు. ఈ లోక్‌అదాలత్‌లో అన్ని రకాల కేసులను ప్రజలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా లోక్‌ అదాలత్‌లో పరిష్కారమైయ్యే తీర్పులకు అప్పీల్‌ ఉండదని, తుదితీర్పు లోక్‌అదాలత్‌లదేనని స్పష్టం చేశారు. అలాగే మండల లీగల్‌సర్వీసస్‌ అథారిటి ద్వారా అన్ని రకాల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. న్యాయవాదులను నియమించుకునే స్థోమత లేని కక్షిదారులకు న్యాయవాదులను నియమించి కేసుల నిర్వహించేలా సహాయం చేయడం జరుగుతుందన్నారు. సమస్యలపై ప్రతివాదులను పిలిపించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాలను వినియోగించుకుని చట్టం, న్యాయం పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరు హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోన్యాయవాదుల సంఘ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, కార్యదర్శి కెవి.ఆనందకుమార్‌, ఏజిపి ప్రభాకర్‌నాయుడు, న్యాయవాదులు శ్రీరాములురెడ్డి, మల్లికార్జునరెడ్డి, వెంకట్రామయ్యశెట్టి, జమీల్‌, సమివుల్లా తదితరులు పాల్గొన్నారు.

సుఖవ్యాదులపై అవగాహన సదస్సు

Tags: 68 Lokayukta cases resolved

సుఖవ్యాదులపై అవగాహన సదస్సు

Date:14/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

సుఖవ్యాదుల నివారణ, చికిత్సలపై ప్రజలకు అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. పట్టణంలో ఎయిడ్స్ నియంత్రణ మండలి, చైల్డ్ఫండ్‌ ఇండియా సంయుక్తంగా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు జెవి.నాగరాజు మాట్లాడుతూ టిబి, ఎయిడ్స్వ్యాదులు సంక్రమించే లక్షణాలను వివరించారు. ఇందు కోసం తీసుకోవాల్సిన నివారణ చర్యలను వివరించారు. వ్యాదులు సోకిన వెంటనే ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసిటిఎస్‌ కేంద్రాలలో రక్తపరీక్షలు నిర్వహించి, చికిత్సలు చేసుకోవాలన్నారు. ఆరు నెలల పాటు నివారణ మందులు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. సుఖ వ్యాదులు సోకకుండ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు.

పుంగనూరు రాతిమసీదుకు 300 సంవత్సరాల క్రితం నిర్మితం

Tags: Awareness seminar on comfort

పుంగనూరు రాతిమసీదుకు 300 సంవత్సరాల క్రితం నిర్మితం

Date:14/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు జమీందారులు నిర్మించిన అపురూప నిర్మాణాలు నాటి నుంచి నేటికి వైభవాన్ని చాటి చెబుతున్నాయి. పట్టణంలోని రాతి మసీదును అందుకు ప్రతీకగా చెప్పవచ్చు. పుంగనూరును పరిపాలించిన జమీందారులు మత సామరస్యానికి ప్రతీకగా వ్యహరించినట్లు శాసనాలు, అధారాలు ఉన్నాయి. పట్టణంలోని ముస్లింల కోసం 1644లో సుందరమైన రాతి మసీదును ఇంజనీర్లతో కలసి నిర్మించారు. సుమారు 358 సంవత్సరాల పూర్వం రాతి మసీదును నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఆ రోజుల్లో మసీదును పుర్తిగా రాతితో నిర్మించిన పది గొలుసులు సైతం వేలాడుతున్నాయి. ఈ మసీదునే సంగీన్‌ జానిమా మసీదు అంటారు. ఉర్దూబాషలో సంగీన్‌ అంటే రాయి అని అర్థం. దీనిని పూర్తిగా రాతితో నిర్మించినందున రాతి మసీదుగా ప్రజల్లో పేరు వచ్చింది.

పుంగనూరు సమీపం మార్లపల్లెలో 1701లో క్రైస్తవమతం ఆవిర్భావం

Tags: Built over 300 years ago, the Punganur stone masjid

పుంగనూరు సమీపం మార్లపల్లెలో 1701లో క్రైస్తవమతం ఆవిర్భావం

Date:14/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం మార్లపల్లెకి చెందిన వెంకటమ్మ రాష్ట్రంలోనే తొలిసారిగా బాష్టిజాన్ని స్వీకరించింది. 1701లో వెంకటమ్మ తన నలుగురి కుమారులతో కలసి ఒక రోజు పట్టణ నడిబోడ్డున బజారువీధిలో మతబోధనలను విన్నారు. తల్లికోరిక మేరకు ముగ్గురుకుమారులు క్రైస్తవమతాన్ని స్వీకరించిన వెంకటమ్మ తరువాతి కాలంలో తనపేరును సవరమ్మగా మార్చుకుంది. తెలుగునాట వెహోట్టవెహోదటి క్రైస్తవ మతాన్నిస్వీకరించినపల్లెగా మార్లపల్లెలో చర్చిని నిర్మించింది. ఈ విషయం గిన్నీస్‌బుక్‌లో కూడా నమోదైంది. పుంగనూరు జమీందార్లు దగ్గరున్న జమీందారి వివరాలను తెలియజేసే పాత రికార్డులో పట్టణానికి ఒకటన్నర మైలు దూరంలో ఒక పెద్దరోమన్‌ క్యాథలిక్‌ గుడి పాడుపడి ఉన్నదని పేర్కొన్నారు. దేర్‌ఈజ్‌ యాన్‌ఓల్డ్ రోమన్‌ క్యాథలిక్‌ చాపెల్‌ -బేరింగ్‌డేట్‌. 1780 ఎట్‌మార్లపల్లెనని ప్రముఖ చరిత్ర కారుడు టిఎన్‌.శేషన్‌ రాసిన తన ఆంగ్ల రచనలో పేర్కొన్నాడు.

స్కందపుష్కర ణి నిర్మాణం అత్యఅద్భుతం

Tags: The emergence of Christianity in 1701 at Marlapalle near Punganur

స్కందపుష్కర ణి నిర్మాణం అత్యఅద్భుతం

– నాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం

Date:14/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాయలసీమ జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా 1772 సంవత్సరంలో పుంగనూరు జమీందారు ఇమ్మడి చిక్కరాయతమ్మేగౌని భార్య ముద్దమ్మణి నిర్మించారు. పుంగనూరు పట్టణంలోని కోనేటి పాళ్యెం రోడ్డు వద్ద గల శ్రీ కాశివిశ్వేశ్వరస్వామి ఆలయ సమీపంలో నిర్మించారు. దీనిని అత్యంత అద్భుతంగా రాళ్లతో ఖచ్చితమైన కొలతలతో నిర్మించారు. కోనేటికి నలుమూలల నల్లజానపు రాతిగుండ్లు నిర్మించారు. అలాగే పుష్కరిణి మధ్యలో బావి ఉండేలా శిల్పాచార్యులు తీర్చిదిద్దారు. కోనేటికి నాలుగు మహాద్వారములు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎనిమిది ఉపద్వారాలు ఏర్పాటు చేసి, ఈ పుష్కరిణికి స్కంద పుష్కరిణిగా , నీటికి సాలిగ్రామతీర్థమని పేరు ఉంది. ఈ కోనేటిని ఎవరు అవరోదం చేసినా కాశీ క్షేత్రంలో గోవద చేసిన పాపన పోతారని చెరువు తూముపై శిలాశాసనం చేశారు.

మరమ్మతులకు భయపడ్డారు….

అత్యంత నైపుణ్యంతో నిర్మించిన కోనేరులో సుమారు 40 సంవత్సరాల క్రితం దక్షిణదిశలో కోనేటి మెటికలు కొద్దిగా క్రిందకు వగింది. దీనిని మరమ్మతులు చేసేందుకు చెన్నై నుంచి ఇంజనీర్లను పిలిపించారు. పట్టణ ప్రముఖుల సమక్షంలో మరమ్మతులు చేసేందుకు ఇంజనీర్ల బృందం సిద్దమైంది. కానీ రాళ్లను నేరుగా పెట్టేందుకు ప్రయత్నించడంతో కోనేరులోపల అన్ని దిక్కులలోను రాళ్లు కదలడంతో ఇంజనీర్లు భయపడి వదిలివెనుతిరిగారు. నాటి ఇంజనీర్ల పనితీరును నేటి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇంజనీర్లు చక్కదిద్దలేకపోవడం హాస్యాస్పందం .

జగన్ వంద రోజుల ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం

Tags: The structure of the scapula is amazing