ఆ నలుగురే బాగున్నారు : ఉత్తమ్ 

Date:30/07/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
ముఖ్యమంత్రి కేసీఆర్ నరేంద్ర మోదీ ఏజెంట్. ఇది స్పష్టంగా పార్లమెంట్ లో అర్దమయింది. విభజన హామీలను అడగనందుకా నరేంద్ర మోదీ కేసీఆర్ ను మెచ్చుకుంది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పొత్తులు పై నిర్ణయం తీసుకునేది రాహుల్ గాంధీ. ఎన్నికల ముందు మా అభిప్రాయం తీసుకొని అప్పుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత ఏన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందనే కోపం తో మాకు ఓట్లు వేయలేదు. కాని వచ్చే ఏన్నికల్లో ఏపీ ప్రజలు కాంగ్రెస్ కే మద్దతు ఇస్తారు. పార్లమెంట్ లో నరేంద్ర మోడీ ప్రసంగంలో కాంగ్రెస్  తెలంగాణ ఇచ్చిందని ఓప్పుకున్నారు…కేసీఆర్, టిఆర్ఏస్ వల్ల తెలంగాణ వచ్చిందని  మోడీ అనలేదని అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల విషయంలో ఏపీ కి  సంబంధించిన వ్యక్తులకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. సీఏం ఏవరనేది హైకమాండ్ తీసుకుటుంది..మా సలహాలు సూచనలు కావాలంటె ఇస్తం. పొత్తులు లేకున్నా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.డ  గతంతో పోలిస్తె ఇప్పుడు కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా ఉంది…ఏన్నికలు ఏప్పుడొచ్చినా ఏదుర్కోనేందుకు సిద్దం. రెండేళ్ల కిందనే ఏఐసీసీ నవంబర్ ,డిసెంబర్ లో ఏన్నికలు సిద్దం కావాలని చెప్పిందని అన్నారు. అభ్యర్థులను 6 నెలలముందే  ప్రకటించడం వల్ల పార్టీ కీ లాభం. టిఆర్ఏస్ లో అభ్యర్థుల సమస్య ఏక్కువ ఉంటుంది. టిఆర్ఏస్ నేతల్లో న్ సెక్యూరిటి ఏక్కువ గా ఉంది. చాలా మంది టిఆర్ఏస్ నేతలు నాతో టచ్ లో ఉన్నారు.అధిష్టానం నిర్ణయం తర్వాత పార్టీ లో చేర్చుకుంటాం. ఏఐసీసీ అన్ని రాష్ట్రాల తో పాటు తెలంగాణ కాంగ్రెస్ లో కూడా అన్ని కమిటీ లు పూర్తిచేస్తుంది. పార్లమెంట్ సమావేశాల అనంతరం రాహుల్ పర్యటన తెలంగాణ లో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సమావేశాలతో పాటు పాలిటిక్స్ కు సంభంధంలేని వ్యక్తులను కూడా కలుస్తారు. దానికి సంబంధించిన హొం వర్క్ చేసే పనిలో ఉన్నానని అన్నారు. వచ్చేనెల రాహుల్ పర్యటన తర్వాత ప్రతీ నెలలో ఓకరోజు రాహుల్ తెలంగాణ పర్యటన ఉంటుంది. 31 వేల బూత్ కమిటీ లతో  రాహుల్ సమావేశమవుతారు. 31వేల బూత్ కమీటీల అధ్యక్షులకు కాంగ్రెస్ ఐడీ కార్డులను ఇవ్వాలనే ఆలోచన ఉందని అయన అన్నారు. వీరందరితో ఓకే సారి టెలికాన్ఫరెన్స్ పెట్టాలనే ఆలోచన ఉంది…రాహుల్ గాంధీ ని కూడా వీళ్ళతో మాట్లాడిస్తానని అన్నారు. తెలంగాణ లో ఆ నలుగురు మినహా అందరు దుంఖంతో ఉన్నారు. ఈ విషయం నేను కాదు జ్యోగిని శ్యామల కూడా చెప్పింది.
 ఆ నలుగురే బాగున్నారు : ఉత్తమ్ https://www.telugumuchatlu.com/thats-four-good-good/
Tags:That’s four good: good

రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన

 Date:30/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఉత్తర కోస్తాఒరిస్సా దాని పరిసర ప్రాంతాలలో 3.6 కీమి నుండి 7.6 కీమి మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ వైపుకి అనుసంధానమయి వుంది. ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న అండమాన్ ప్రాంతాలలో 7.6 కీమి ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రాగల మూడురోజులు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కోస్తా ఆంధ్రాలో ఈరోజు కొన్నిచోట్ల,  రేపు ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు రాయలసీమలో మంగళవానం కొన్నిచోట్ల, మరుసటిరోజు  అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన https://www.telugumuchatlu.com/weather-forecast-for-up-to-three-days-7/
Tags:Weather forecast for up to three days

గ్రేటర్ లో 1327 ప్రాంతాల్లో బల్దియా హరిత హారం నాటే మొక్కలకు జియోట్యాగింగ్

Date:30/07/2018
హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్లో 40లక్షల మొక్కలు నాటడానికి జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ 40లక్షల మొక్కల్లో 5లక్షల మొక్కలను జీహెచ్ఎంసీ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 1327 ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రహదారుల వెంట నాటుతుండగా, మిగిలిన 35లక్షల మొక్కలను నగరవాసులకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. జీహెచ్హెంసి ద్వారా ఇప్పటికే 60 వేల మొక్కలను నాటారు. జీహెచ్ఎంసీ నాటనున్న 5లక్షల మొక్కలకు సంబంధించి  స్థలాల ఎంపిక చేయడంతో పాటు వాటి జియోట్యాగింగ్ కూడా చేపట్టనుంది. ఇప్పటికే 455 స్టలాలను జియో ట్యాగింగ్ పూర్తయ్యింది. ఇప్పటికే మొక్కలు నాటడానికి గుంతల తవ్వకం ముమ్మరంగా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ ద్వారా నాటనున్న 5లక్షల మొక్కల్లో ఎల్బీనగర్ జోన్లో 95వేలు, చార్మినార్ జోన్లో 65వేలు, ఖైరతాబాద్ జోన్లో 79,600, శేరిలింగంపల్లి జోన్లో 85,250, కూకట్పల్లి జోన్లో 1,01,050 మొక్కలు, సికింద్రాబాద్ జోన్లో 74,100 మొక్కలు నాటడానికి ఏర్పాట్లను చేపట్టారు.  మొక్కలు నాటేందుకుగాను 3,60,880 హెక్టార్ల భూమిని దాదాపు 2వేల ప్రాంతాల్లో గుర్తించారు.. వీటితో పాటు నగరవాసులకు ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్దేశించిన 35లక్షల మొక్కల్లో ఎల్బీనగర్, చార్మినార్ జోన్లలో 7లక్షలచొప్పున, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లలో 5లక్షల చొప్పున, సికింద్రాబాద్ సర్కిల్లో 6లక్షల మొక్కల చొప్పున కేటాయించారు. ఇప్పటికే కొన్ని జోన్లలో పాఠశాల విద్యార్థులకు మొక్కల పంపిణీ ప్రారంభించారు. 34 నర్సరీల్లో మొక్కల పెంపకంజీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 34నర్సరీల్లో 40లక్షల మొక్కలు సిద్దంగా ఉంచారు. జీహెచ్ఎంసీ నాటనున్న 5లక్షల మొక్కల్లో 2,92,404 మొక్కలు 5ఫీట్లకు పైగా ఎత్తుగల మొక్కలు ఉన్నాయి. ప్రధానంగా ఈ మొక్కల్లో వేప, జువ్వి,  కానుగ, జమ్మిలతో పాటు పండ్ల మొక్కలైన సపోట, మామిడి, అల్లనేరేడు, బాదం తదితర పలు రకాల మొక్కలు సిద్దంగా ఉన్నాయి. వీటితో పాటు ఇళ్లలో పెంచుకునేందుకు ఔషద మొక్కలు ఉచితంగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లను పూర్తిచేశారు.
గ్రేటర్ లో 1327 ప్రాంతాల్లో బల్దియా హరిత హారం నాటే మొక్కలకు జియోట్యాగింగ్ https://www.telugumuchatlu.com/geotagging-for-buldia-green-denominations-in-1327-regions-in-greater/
Tags:Geotagging for buldia green denominations in 1327 regions in Greater

ప్రియుడ్ని సజీవ దహనం చేసిన ప్రేయసీ

 Date:30/07/2018
ఒంగోలు ముచ్చట్లు:
వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన వివాదం చివరకు అతడి సజీవదహనానికి కారణమైంది. ప్రియురాలే అత్యంత కిరాతంగా ప్రియుడిని హతమార్చింది. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా పొదిలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పొదిలికి చెందిన షకీరా అలియాస్ ఇమాంబీ అనే మహిళ ఎస్కే షబ్బీర్  అనే హోమ్ గార్డుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ కలిపి కొన్ని నెలల కిందట కోళ్ల ఫారాలను లీజుకు తీసుకుని నడుపుతున్నారు. ఇటీవల షబ్బీర్‌, షకీరా మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో మనస్పర్థలు తలెత్తాయి. కొద్ది రోజుల నుంచి విధులకు హాజరుకాని షబ్బీర్ ఆమెతోనే గడుపుతున్నాడు. అయితే, అతడి అడ్డుతగిలించుకోవాలని ఇమాంబి పథకం వేసింది.  రాత్రి ఇద్దరూ కలిసి చవటపల్లిలోని కోళ్ల ఫారానికి వెళ్లారు. అక్కడ అతడిని ఏమార్చి మంచానికి కట్టేసి సజీవదహనం చేసింది. దీంతో షబ్బీర్ పెద్దగా కేకలు వేయడంతోపాటు మంటలు చెలరేగాయి. దీన్ని గమనించి స్థానికులు మంటలెందుకు వచ్చాయని షకీరాను ప్రశ్నించగా చెత్త తగలబెడుతున్నానని, షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వచ్చాయని ఆమె తెలిపిందిది. అయితే కోళ్లఫారం యజమానికి అనుమానం వచ్చి లోనికి వెళ్లి చూడగా, షబ్బీర్ సజీవదహనమై మంచంపై కనిపించాడు. అతడి కాళ్లు చేతులను గొలుసులతో మంచానికి కట్టేసి, తాళాలు వేసి ఉన్నాయి. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అతడు మృతిచెందినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు షకీరాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడిని హత్యకు దారితీసి కారణాలుపై ఆరా తీస్తున్నారు. మృతుడు ఎస్కే షబ్బీర్‌ ఇది వరకు రెండు పెళ్లిలు చేసుకోగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మర్రిపూడి పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహించే అతడికి పొదిలికి చెందిన వివాహిత ఇమాంబితో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో అతడిని హతమార్చాలని పథకం వేసింది. అతడిని ఏమార్చి సజీవదహనం చేసింది.
ప్రియుడ్ని సజీవ దహనం చేసిన ప్రేయసీ https://www.telugumuchatlu.com/lover-of-love/
Tags:Lover of love

ప్రత్యేక హోదా బలమైనది లగడపాటి

 Date:30/07/2018
విజయవాడ ముచ్చట్లు:
ప్రత్యేక హోదా అంశం ఏపీ ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయిందన్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. అనంతపురం జిల్లాలో తన స్నేహితుడ్ని కలిసేందుకు వచ్చిన ఆయన.. తాజా రాజకీయాలతో పాటూ విభజన హామీలు, హోదా అంశంపై స్పందించారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా చాలా ముఖ్యమన్నారు లగడపాటి. రాష్ట్రానికి పరిశ్రమలు, యువతకు ఉద్యోగావకాశాలు రావాలంటే హోదా కావాల్సిందేనన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు. పోరాటాలతో ప్రత్యేక హోదాను సాధించాలే తప్ప.. ఆత్మహత్యలు, బలిదానాలతో అది సాధ్యం కాదన్నారు రాజగోపాల్. రాష్ట్ర విభజన చేసినందుకు 2014లో ప్రజలు కాంగ్రెస్‌కు బ్యాలెట్‌తో బుద్ధి చెప్పారని.. హామీలను నెరవేర్చకపోతే 2019లో బీజేపీకి కూడా అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా.. ప్యాకేజీనా అనేది ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు నిర్ణయించుకోవాలన్నారు లగడపాటి. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. సర్వే గురించి ఇప్పుడే ఏం మాట్లాడనని.. ఎన్నికలకు ముందు ఆ వివరాలను వెల్లడిస్తానన్నారు.
ప్రత్యేక హోదా బలమైనది లగడపాటి https://www.telugumuchatlu.com/special-status-is-stronger/
Tags:Special status is stronger

 బంగ్లా ప్రీమియర్ కు ఎన్నికల సెగ

Date:308/07/2018
లాహోర్ ముచ్చట్లు:
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు ఎన్నికల సెగ తాకింది. సార్వత్రిక ఎన్నికల ప్రభావంతో బీపీఎల్ లీగ్ వెనక్కి వెళ్లింది. ఈ ఏడాది అక్టోబర్‌లో బీపీఎల్ నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. కానీ అక్టోబర్ తర్వాత బంగ్లాదేశ్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో.. భద్రత కల్పించలేమని పోలీసు యంత్రాంగం చేతులెత్తేసింది. దీంతో ఈ టీ20 టోర్నీని వచ్చే ఏడాది జనవరి 5 నుంచి నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. మిర్పూర్‌లో టోర్నమెంట్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్లు, ఫ్రాంచైజీల ప్రతినిధుల మధ్య జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు డిసెంబర్ చివరి వారంలో నిర్వహించే వీలుంది. దీంతో జనవరి 5, ఫిబ్రవరి 8 తేదీల మధ్య బీపీఎల్ నిర్వహించనున్నాం’ అని బీపీఎల్ టెక్నికల్ కమిటీ చైర్మన్ జలాల్ యూనస్ తెలిపారు. బీపీఎల్ వెనక్కి వెళ్లిపోవడంతో.. అక్టోబర్లో జింబాబ్వే బంగ్లా పర్యటనకు రానుంది. ఇరు జట్లు మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో తలపడనున్నాయి.
 బంగ్లా ప్రీమియర్ కు ఎన్నికల సెగ https://www.telugumuchatlu.com/electoral-sega-to-the-bangla-premier/
Tags:Electoral Sega to the Bangla Premier

డిజి యాత్రకు విమానయాన శాఖ రెడీ

 Date:30/07/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ‘డిజి యాత్ర’ సౌకర్యం మరో రెండు నెలల్లో అమలులోకి రానుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ విషయం వెల్లడించారు. ‘డిజి యాత్ర’ సౌకర్యం వల్ల ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం వేగవంతం అవుతుంది. దీనివల్ల విమానయానంలో కాగితం వినియోగాన్ని తగ్గించ‌నున్నారు. డిజిటల్ వ్య‌వ‌స్థ‌ కింద ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి, విమానం ఎక్కడానికి సదరు ప్రయాణికుల ఆధార్ నంబర్‌ను, మొబైల్ నంబర్‌ను వినియోగిస్తారు. ఈ వ్యవస్థ కింద డిజిటల్ రూపంలోనే టికెట్ బుకింగ్, ఎయిర్‌పోర్ట్ ఎంట్రీ, బోర్డింగ్ పాస్, సెక్యూరిటి చెకింగ్‌ను నిర్వహించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ భావిస్తోంది. మేము రానున్న రోజుల్లో డిజి యాత్ర పేరిట స‌రికొత్త డిజిటల్ వ్యవస్థను తీసుకు వస్తున్నాం. రానున్న రెండు నెలల్లోనే దీనిని ప్రారంభిస్తామనే విశ్వాసంతో ఉన్నాం’ అని ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. ఈ ‘డిజి యాత్ర’ వ్యవస్థ కింద ప్రయాణికులు విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన తరువాత వారి ఫేసియల్ లేదా ఐరిష్ బయోమెట్రిక్‌ను తీసుకుంటారు. ఆ తరువాత సదరు ప్రయాణికులు జీవితంలో మ‌రెప్పుడైనా సెక్యూరిటి చెకింగ్ లేకుండానే విమానయానం చేయవచ్చు’ అని మంత్రి వివరించారు. అయితే, ప్రజల గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రభుత్వం అనుసరిస్తుందని, ‘డిజి యాత్ర’ అమలు సందర్భంగా వాటిని ఉల్లంఘించబోదని మంత్రి వివరించారు. డిజి యాత్ర’ అనేది ఒక ఆప్షన్‌గా మాత్రమే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘డిజి యాత్ర అనేది కేవలం ఆధార్ ఆధారంగా మాత్రమే పనిచేసేది కాదు. ఏదైనా గుర్తింపును చూపించొచ్చు. ఒకసారి మీరు మీ గుర్తింపును చూపించినట్లయితే, మీరు జీవితమంతా ఎప్పుడైనా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు’ అని సురేశ్ ప్రభు చెప్పారు. ‘ఈ డిజి యాత్ర అనేది ప్రయాణికుల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా ప్రయాణికులు తమ గుర్తింపును వెల్లడించడానికి ఇష్టం లేకపోతే, వారు మామూలు పద్ధతిలో విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు. మేము సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించబోము’ అని మంత్రి పేర్కొన్నారు.
డిజి యాత్రకు విమానయాన శాఖ రెడీ https://www.telugumuchatlu.com/airlines-ready-for-dg-travel/
Tags:Airlines ready for DG Travel

ఆస్పత్రిలోనే ప్రేమ వివాహం

Date:30/07/2018
ఛండీఘర్ ముచ్చట్లు:
పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని ఓ యువ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. తొలుత వీరి పెళ్లికి ఒప్పుకోని తల్లిదండ్రులు చివరకు దిగిరాక తప్పలేదు. దీంతో వీరి వివాహం హాస్పిటల్‌లో జరిగింది. ఈ ఘటన హరియాణాలోని హిస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. పేరన్‌వలీ గ్రామానికి చెందిన గుర్ముఖ్ సింగ్, విద్యుత్ నగర్‌కు చెందిన కుసుమ్ హిస్సార్‌లోని డీఎన్ కాలేజీలో చదువుతున్నారు. కాలేజీలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. తమ ప్రేమ గురించి పెద్దలకు తెలియజేయడంతో ఇరు కుటుంబాలు వారి వివాహానికి ససేమీరా అన్నాయి. దీంతో ఒకర్ని విడిచి ఒకరు ఉండలేమని భావించిన ఈ జంట హిస్సార్‌లోని ఓ ఇంటర్నెట్ కేఫ్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీన్ని గమనించిన స్థానికులు వైద్యం కోసం హుటాహుటిన ఆస్సత్రికి తరలించారు. అపస్మారకస్థితిలోకి ఉన్న వీరికి వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందజేశారు. హాస్పిటల్‌లో ఉన్న ఇద్దర్నీ చూసి వారి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. తాము కాదంటే ప్రాణాలు తీసుకోవడమేనా అని మందలించి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మీ సంతోషమే మాకు ముఖ్యమని చెప్పి వివాహం జరిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చెప్పినట్టుగానే హాస్పిటల్‌లోనే వారి పెళ్లి జరిపించారు. ఐసీయూనే కల్యాణ మండపంగా చేసి, హాస్పిటల్ సిబ్బందినే ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. శనివారం నాడు భరత్ హాస్పిటల్‌లో ఈ పెళ్లి జరిగింది. అయితే, హాస్పిటల్‌లో వీరిని చూసిన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడే ఉన్న రుబీ చౌహన్ అనే డాక్టర్ జోక్యం చేసుకుని పరిస్థితి వివరించారు. దీంతో ఇరు కుటుంబాలను పెళ్లిచేయడానికి అంగీకరించాయి.
ఆస్పత్రిలోనే ప్రేమ వివాహం https://www.telugumuchatlu.com/love-is-in-the-hospital/
Tags:Love is in the hospital