మూడు వారాల్లో వివరాలు ఇవ్వాలిటీటీడీకి హైకోర్టు ఆదేశం

Date:03/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తిరుమల తిరుపతి దేవస్ధానం వివాదం హైకోర్టుకు చేరింది. తిరుమల స్వామి వారి నగలు మాయం, ఆలయం లోపల తవ్వకాలపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ టిటిడిని ఆదేశించింది.మొత్తం వ్యవహారంపై సీబీఐ  చేత దర్యాప్తు చేయాలని పిటిషనర్ లో పేర్కొన్నారు. గుడి లోపల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని కోర్టు కు పిటిషనర్ తెలిపారు. అయితే,, ఎలాంటి  తవ్వకాలు జరపలేదని గుడి లో కొన్ని మరమ్మత్తులు జరిపామని కోర్టు కు టీటీడీ తెలిపింది. ప్రస్తుతం నిర్మిస్తున్న గుడి గోపురం బంగారం కాదని పిటిషనర్  వాదన. ఇప్పుడు చేపడుతున్న దానిలో బంగారం వాడుతున్నామని కోర్టు కు  టీటీడీవిన్నవించింది.  తిరుమల లో జరుగుతున్న అక్రమాల పై న్యూస్ పేపర్లో వచ్చిన కథనాలను కోర్టుకు సమర్పించారు. సుప్రీంకోర్టు జడ్జ్ మెంట్ ప్రకారం న్యూస్ పేపర్లో వచ్చిన వాటిని కోర్టు పరిగణింలేమని  హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 మూడు వారాల్లో వివరాలు ఇవ్వాలిటీటీడీకి హైకోర్టు ఆదేశంhttps://www.telugumuchatlu.com/give-details-in-three-weeks/
Tags:Give details in three weeks

 కోటప్ప కోండలో కోడెల పర్యటన

Date:03/07/2018
గుంటూరు ముచ్చట్లు:
ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకోండలో ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంగళవారం నాడు పర్యటించారు. వర్షాలు పడుతున్న నేపధ్యంలో కోటప్పకోండలో గ్రీనరీ పెంపుపై చర్చ జరిపారు. వర్షాలు కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. వ్యూ పాయింట్, యోగా హల్ లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సాధ్యమైనంత వరకూ కింద నుంచి మట్టి పైకి తీసుకువెళ్లి గ్రీనరీ అభివృద్ధి చేయాలని సూచించారు. వివిధ రకాల మొక్కలు, పూలతో కోటప్పకోండను సుందర, నందన వనంలాగా చేయాలని అన్నారు.  కోటప్పకోండలో గతంలో రాత్రి అయితే ఎవ్వరూ తిరిగేవారు కాదు. మనం చేసిన అభివృద్ధిలో నిత్యం వేల సంఖ్యలో భక్తులు, పర్యాటకులు ఇక్కడ పర్యటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా కోటప్పకొండ విరాజిల్లుతుంది. ప్రభుత్వం అభివృద్ధికి ఎంత నిధులైన ఇవ్వడానికి సిద్దంగా ఉందని అయన అన్నారు.  కాబట్టి పనులు వేగం చేయాలని ఆదేశించారు. కోటప్పకొండపై కోతుల బెడద లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ లో నిర్వహించనున్న హిల్ పెస్టివల్ నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. డిశంబర్ నాటికి రోప్- వే పూర్తయితే పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని కోడెల అన్నారు.
 కోటప్ప కోండలో కోడెల పర్యటన https://www.telugumuchatlu.com/kodela-tour-in-kottpa-ponda/
Tags:Kodela tour in Kottpa Ponda

 దోచుకో…దంచుకో..దాచుకో.. 

Date:03/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ముఖ్యమంత్రి కేసీఆర్, మంతి హరీష్ ల అవినీతిని బయట పెడతా ,జైలుకు పంపిస్తానని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నాడు అయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ళేశ్వరం పై పెయిడ్ ఆర్టికల్ తో టీఆరెస్ ప్రచారం చేరుకుంటుంది.  కాళేశ్వరం ప్రాజెక్టు డీఎన్ ఏ కాంగ్రెస్. కాంగ్రెస్ నిర్మించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులను కాళేశ్వరం పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని అయన ఆరోపించారు. ఎవరికి పుట్టిన బిడ్డనో తన బిడ్డగా కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. చేసింది కాంగ్రెస్ అయితే టిఆర్ ఎస్ తన ఘనత గా చెప్పుకోవడం సిగ్గుచేటని అయన అన్నారు. కేసీఆర్ అవినీతిపై ప్రశ్నిస్తున్నందుకే తన కు సెక్యూరిటీ ని తొలగించారు. నిజాయితీ ఉంటె నేను అడుగుతున్న సమాచారాన్ని ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని అయన అన్నారు. ముప్పై నెలల్లో పాలమూర్ రంగారెడ్డి పూర్తి చేస్తానని హరీష్ అన్నారు. దోచుకో…దంచుకో…దాచుకో స్కీమ్ తో టీఆరెస్ పనిచేస్తుందని అయన ఆరో్పించారు. ఆరోగ్యశ్రీ  ,ఇందిరమ్మ ఇండ్లు , ఫీస్ ఇంబర్స్ మెంట్ లాంటి అద్బుతమైన పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ దేనని అయన అన్నారు.
 దోచుకో…దంచుకో..దాచుకో.. https://www.telugumuchatlu.com/dancukodacuko-stealing/
Tags:Dancukodacuko stealing … ..

యాదాద్రి పనులు వేగవంతం

Date:03/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా దేవాలయ పరిధిలో చేపడుతున్న వివిధ పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు.మంగళవారం సచివాలయంలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్ మెంట్ అధారిటీ సమీక్షా సమావేశం  జరిగింది. ఈ సందర్భంగా సి.యస్ యాదాద్రి పనులపై సమీక్షించారు. దేవాలయనిర్మాణ పనులను సకాలంలో పూర్తి కావాలని, కాటేజీలు, విల్లాలు, ప్లాట్ల నిర్మాణం, రాయగిరి గండి ఇరిగేషన్ చెరువుల సుందరీకరణ, రాయగిరి వద్ద ఆర్వోబీ నిర్మాణం, తదితర పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తికావాలన్నారు. వేద పాఠశాల నిర్మాణానికి అవసరమైన చోట ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.ఈ సమావేశంలో  వైస్ ఛైర్మన్  కిషన్ రావు, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్, ఆర్ అండ్ బీ అధికారులు గణపతిరెడ్డి, రవీందర్ రావు, ఈ.ఓ గీత తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి పనులు వేగవంతం https://www.telugumuchatlu.com/faster-to-speed-up/
Tags:Faster to speed up

తిరుమల శ్రీవారి ఆలయం మూత  

Date:03/07/2018

-చంద్ర గ్రహణం కారణంగా

తిరుమలముచ్చట్లు:

చంద్రగ్రహణం కారణంగా జూలై  27వ తేదీ సాయంత్రం 5.00 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మూసివేయనున్నారు. జూలై 27వ తేదీ శుక్రవారం రాత్రి 11.54 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై జూలై 28న శనివారం ఉదయం 3.49 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. జూలై 28న ఉదయం 4.15 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 7.00 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుంది. జూలై 27న ఆర్జితసేవలు రద్దు –

చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేదీ శుక్రవారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెతవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

జూలై 27న పౌర్ణమి గరుడుసేవ రద్దు

ఈ నెల 27వ తేది శుక్రవారం నిర్వహించవలసిన పౌర్ణమి గరుడసేవను చంద్రగ్రహణం కారణంగా టిటిడి రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

తిరుమల శ్రీవారి ఆలయం మూత https://www.telugumuchatlu.com/the-thirumala-shreevari-temple-lid/

Tags:The Thirumala Shreevari Temple lid

మానస సరోవర్ యాత్రలో విషాదం

Date:03/07/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
మానస సరోవర్ యాత్రలో విషాదం నెలకొంది. యాత్ర కోసం బయలుదేరిన కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు మృతి చెందారు. మానస సరోవరం నుంచి తిరుగు ప్రయాణంలో టిబెట్ ప్రాంతంలో అయన మృతి చెందినట్లు సమాచారం అందింది.  మృతదేహాన్ని హిల్సాకు నుంచి సిమిల్ కోట్ కు,  అక్కడి నుంచి నేపాల్ గంజ్ కు అధికారులు  తరలించారు. నేపాల్ గంజ్ లో పోస్టుమార్టం అనంతరం లక్నో మీదుగా స్వస్థలానికి తరలిస్తారు. ఏపీ భవన్ కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ నేపాల్ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో  మానస సరోవర్ యాత్రికులను సురక్షితం గా తీసుకు వస్తామని అన్నారు. ఎ.పి భవన్  అధికారులతో మాట్లాడి  సహాయక చర్యల గురించి అయన అడిగి తెలుసుకున్నారు. .  యాత్రికులను సురక్షితంగా తీసుకువస్తాం. బంధువులు ఆందోళన చెందవద్దని అయన అన్నారు.
మానస సరోవర్ యాత్రలో విషాదం https://www.telugumuchatlu.com/tragedy-at-manasa-sarovar-yatra/
Tags:Tragedy at Manasa Sarovar Yatra

విశాఖలో జనపేన కార్యాలయం 

Date:03/07/2018
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖలో జనసేన పార్టీకి కేరాఫ్ అడ్రస్ దోరికింది.ప్రజల సమస్యలపై గళమెత్తుతున్న పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఉత్తరాంద్రకు సంబంధించిన నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి నూతన కార్యాలయం వేదిక కావాలని ఆకాంక్షించారు. ‘‘ అన్ని వనరులు ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణం. దీనికి కారణాలను అన్వేషించడంతోపాటు ఈ ప్రాంత సమస్యలకు పరిష్కారాలు సూచించి, అభివృద్ధికి బాటలు వేసేందుకు ఈ కార్యాలయం వేదిక కావాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రంలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశమై చర్చలు నిర్వహించారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున తరలి వచ్చిన అభిమానులు పవన్ కు ఘన స్వాగతం పలికారు. ప్రజల సమస్యలపై ఉద్యమిస్తున్న పవన్ కళ్యాణ్ విశాఖలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటుతో మరింత ప్రజల్లోకి వెళ్లేందుకు మార్గం సుగగమైందని భావిస్తున్నారు.
విశాఖలో జనపేన కార్యాలయం https://www.telugumuchatlu.com/vision-office-in-visakhapatnam/
Tags:Vision office in Visakhapatnam

 ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన యస్‌వి. రంగారావు

Date:03/07/2018
ఏలూరు ముచ్చట్లు:
తెలుగుజాతి చరిత్ర ఉన్నంతవరకూ యన్‌టిఆర్, యస్‌విఆర్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని తెలుగునాట ఆ ఇద్దరూ నటులూ యుగపురుషులుగా కీర్తింపబడుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రముఖ సినీనటుడు, విశ్వనటచక్రవర్తి సామర్ల వెంకట రంగారావు (యస్‌వి. రంగారావు) శతజయంతి సందర్భంగా మంగళవారం కలపర్రు టోల్‌గేట్ వై జంక్షన్‌లో 12.5 అడుగుల యస్‌వి. రంగారావు విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈసందర్భంగా యస్‌వి. రంగారావు నటించిన పలు చలనచిత్రాలలోని ప్రధాన ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫొటో ఎ గ్జిబిషన్‌ను చంద్రబాబు ప్రారంభించి తిలకించారు. యస్‌వి. రంగారావు పుట్టి నేటికి 100 ఏళ్లు పూర్తికావడం అటువంటి మహానటుడి విగ్రహాన్ని తన చేతులు మీదుగా ఆవిష్కరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తాననిచంద్రబాబు చెప్పారు. చరిత్రలో ఎ ంతోమంది పుడతారని అయితే వారిలో కొందరే యుగపురుషులుగా నిలుస్తారన్నారు. ఆకోవకు యన్‌టిఆర్, యస్‌విఆర్ తెలుగునాట ఇద్దరే ఇద్దరు సమ ఉజ్జీలుగా ముందుకు సాగారని చెప్పారు. యస్‌విఆర్ నటనలో నిండుతనం హుందాతనం మరెవ్వరికీ సాటి రావన్నారు. యస్‌విఆర్ లాంటి నటులు మరొకరు రావడం కష్టమే అన్నారు. మళ్లీ వారి స్ధాయి చేరేవారు ఎ వరూ లేరన్నారు. యస్‌విఆర్‌లో ఉన్న నిండుతనం, హుందాతనాన్ని చూపించే విధంగా శిల్పాన్ని రూపకల్పన చేసిన రాజ్‌కుమార్ వడయార్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. యస్‌వి. రంగారావుకు సముచిత న్యాయం జరగలేదని ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి మేనత్త బాధపడుతున్నదని చెప్పారని కానీ నేడు శ్రీ బడేటి బుజ్జి కృషి ఫలితంగా యస్‌వి రంగారావుకు తగిన గౌరవం లభించిందని మేనత్త కోరిక తీర్చి లోటును పూర్తి చేసిన ఘనత బడేటి బుజ్జికే దక్కుతుందని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం యస్‌విఆర్ విగ్రహాన్ని నెలకొల్పిన ప్రాంతాన్ని యస్‌విఆర్ జంక్షన్‌గా నామకరణం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. యన్‌టిఆర్ నాయకుడుగా, ప్రతినాయకుడుగా యస్‌విఆర్ సినిమాలలో ప్రేక్షకులను అలరించే వారని అన్నారు. యస్‌విఆర్ డైలాగ్‌లు చెప్పడంలో వారికి వారే సాటి అని, భవిష్యత్తులో కూడా అటువంటి వారు పుట్టబోరని సియం అన్నారు. యన్‌టిఆర్, యస్‌విఆర్ పాతాళ##బైరవి, కలిసిఉంటే కలదు సుఖం, మాయాబజార్, ఆత్మబంధువు, చరణదాసి, ముఖ్యంగా పాండవ వనవాసం సినిమాల్లో ఎ ంతోచక్కగా హావభావాలతో నటన చేసారన్నారు . ఏలూరులో 60 ఎ కరాలు భూమి కొనుగోలు చేసి 12 వేల కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నామని ఇందుకోసం ఒక్కొక్కరికీ మూడు లక్షలు ఇస్తున్నామని సియం చెప్పారు. దీనిమూలంగా ఆకాలనీల్లో 50 వేలమంది నివాసానికి అనువుగా టౌన్ షిప్ అభివృద్ధి పరిచి విద్యుత్తు, డ్రైయినేజీ, షాపింగ్ మాల్స్, తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇళ్లు లేని పేదల స్వంత ఇంటి కల సఫలీకృతం చేస్తున్నామన్నారు. గతంలో కాంగ్రెస్ వాళ్లు కొన్ని ఇళ్లు కట్టిస్తామని పేదల సొమ్ము దోచుకున్నారని అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా లబ్దిదారులే నిర్మించేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. అంతేకాక పట్టణాల్లో నాణ్యమైన ఇళ్లు కొన్ని స్వచ్ఛంధ సంస్ధలతో నిర్మిస్తున్నామని, డబ్బు ఉన్న వాళ్లు నిర్మించుకునే రీతిలో ఎ ంతో హుందాతనంగా ఈఇళ్లు ఉంటాయన్నారు. పేదలను దృష్టిలో ఉంచుకుని అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. విఆర్ఓలకు 10500 వరకూ, హోమ్ గార్డులకు 9 వేల నుండి 18 వేలవరకూ, అంగన్‌వాడీ కార్యకర్తలకు, సూపర్ వైజర్లకు 4 వేల నుండి 10500 వరకూ, ఆశా కార్యకర్తలకు 3 వేల వరకూ గౌరవ వేతనాన్ని అందిస్తున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎ న్ని పనులు చేసినా తక్కువేనని అన్నారు. పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు, టూరిజం అభివృద్ది చెందాలన్నారు. అయితే ఇక్కడ భూమి ఇవ్వడానికి మీరు ముందుకు రావడం లేదని అన్నారు. కలపర్రు వద్ద భూమి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు ప్రజాప్రతినిధులు చెబుతున్నారని అదే జరిగితే ఈప్రాంతంలో ఆధునిక నగరం అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అమరావతి తర్వాత శాటిలైట్ సిటీగా ఏలూరు నగరం అభివృద్ది చెందుతున్నదన్నారు. ప్రజాప్రతినిధులు కోరుతున్న కోరిక మేరకు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని సియం చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎ టువంటి అభివృద్ది కార్యక్రమానికైనా ఏపని అడిగినా సాధ్యాసాధ్యాలు మేరకు కాదనకుండా పనులు చేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొల్లేరు, మరోప్రక్క పట్టిసీమ, మరోప్రక్క పోలవరం ప్రాంతాలతోపాటు సముద్రతీరం, గోదావరి తీరాలలో బీచ్‌లు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళిక అమలు చేస్తామన్నారు. ఎ న్ని జన్మలెత్తినా పశ్చిమ ప్రజలు చూపుతున్న స్వాగత ఆదరాభిమానాలు మరువులేమని చంద్రబాబు చెప్పారు. ఈసందర్భంగా యస్‌విఆర్ కాంస్య విగ్రహాన్ని రూపకల్పన చేసిన ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్ వడయార్‌ను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ, కెయస్. జవహర్, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జడ్‌పి ఛైర్మన్ శ్రీ ముళ్లపూడి బాపిరాజు, యంపీలు మాగంటి వెంకటేశ్వరరావు, తోట సీతారామలక్ష్మి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, శాసనసభ్యులు మొడియం శ్రీనివాసరావు, గన్ని వీరాంజనేయులు, ముప్పిడి వెంకటేశ్వరరావు, రామానాయుడు, ఎ మ్మెల్సీ షరీఫ్, పాందువ్వ శ్రీను, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్ధ ఛైర్మన్ పాలి ప్రసాద్, తెలుగుయువత అధ్యక్షులు మాగంటి రాంజీ, జిల్లా ప్రజాపరిషత్తు మాజీ ఛైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, రాష్ట్ర చలనచిత్ర, నాటకరంగ సంస్ధ అభివృద్ధి ఛైర్మన్ అంబికా కృష్ణ, జిల్లా కలెక్టరు డా. కాటంనేని భాస్కర్, జిల్లా యస్‌పి రవిప్రకాష్, ఏలూరు మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఉప్పాల జగదీష్‌బాబు, పలువురు జడ్‌పిటిసిలు, యంపిపిలు, తదితరులు పాల్గొన్నారు.
 ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన యస్‌వి. రంగారావు https://www.telugumuchatlu.com/yashvi-who-was-in-the-heart-of-the-people-forever-ranga/
Tags:Yashvi, who was in the heart of the people forever. Ranga