స్వేచ్ఛకు సంకెళ్లా..ఇదేమి పాలన

– వాస్తవాలు వెలుగులోకి తెస్తుంటే ప్రసారాలు నిలపివేస్తారా..
– ఎమ్మిగనూరులో గళమెత్తిన తెదేపా నాయకులు

Date:18/09/2019

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నందుకు ఏబీన్-ఆంధ్రజ్యోతి,టీవీ-5 ల ప్రసారాలను నిలిపివేశారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వేచ్ఛకు సంకెళ్లా..ఇదేమి పాలన అంటూ బుదువారం  ఎమ్మిగనూరు తెదేపా నాయకులు అంబేద్కర్ సర్కిల్ నుంచి సోమప్ప సర్కిల్ మీదుగా తహశీల్ధార్ కార్యాలయానికి చేరి డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రాన్ని అందజేశారు.

 

 

 

 

అనంతరం తెదేపా నాయకులు కొండయ్యచౌదరి, సుందర్ రాజు, రంగస్వామి గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ ప్రజా ఎక్స్ ప్రెస్ ఎడిటర్ ఫరూక్ లు మాట్లాడుతూ సమాజంలో వాస్తవాలను ప్రజలకు చూపే చానళ్లపై ప్రభుత్వం అనధికార ఆంక్షలు విధించి నిలిపి వేయటంపై సిగ్గు చేటన్నారు.ప్రభుత్వ విధానాలను, ఎత్తిచూపే చానళ్లపై ప్రభుత్వం కత్తికట్టడం అమానుషమని మండిపడ్డారు.నిలిపివేసిన ఏబీఎన్,టీవీ-5 చానెళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

 

 

 

 

 

 

కార్యక్రమంలో తెదేపా నాయకులు రాందాస్ గౌడ్, మాచానిశివశంకర్, మిఠాయి నరసింహులు, రంగస్వామి, కటారిరాజేంద్ర, దామనరసింహులు, ఈరన్న,  ఆంధ్రజ్యోతి సిబ్బంది పరమేష్, శివ, నరసింహులు, రవి, టివి5 మక్బూల్ తదితరులు పాల్గొన్నారు.

బంటకుంట లో మట్టి మిద్దె కూలీ రోడ్డున పడ్డా కుటుంబం

Tags: Freedom is the rule of the same thing

బంటకుంట లో మట్టి మిద్దె కూలీ రోడ్డున పడ్డా కుటుంబం

Date:18/09/2019

కౌతలం  ముచ్చట్లు:

మండల పరిధిలో బంటు కుంట గ్రామంలో  హరిజన వాడలో బై నే ముకయ్య  మట్టి మిద్దె కూలి కుటుంబం రోడ్డున పడింది. మూడు రోజుల నుంచి కురుస్తున్న వాన కు మట్టి మీద నాని కూలిపోయింది. ప్రాణ నష్టం ఏమి జరగలేదు ఆస్తి నష్టం జరిగింది తలదాచుకోడానికి ఇల్లు కూడా లేదనీ  ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. ముకయ్య కు ఒక భార్య ముగ్గురు కొడుకులు ఉన్నారు వారు బెంగళూరులో వలసకు వెళ్లారు. వెంటనే అధికారులు స్పందించి బాధితులకు ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

అసెంబ్లీ లో బిల్టు ఫ్యాక్టరీ పై గళమెత్తిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Tags: The family that fell on the muddy muddy road in Bantankuttu

అసెంబ్లీ లో బిల్టు ఫ్యాక్టరీ పై గళమెత్తిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Date:18/09/2019

ములుగు  ముచ్చట్లు:

ములుగు నియోజకవర్గం లోని బిల్ట్ ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులను ఆదుకోవాలని  బిల్ట్ ఫ్యాక్టరీ గత 5సంవత్సరాలుగా  మూతపడి కార్మికులు అప్పుల బాధ తో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నెలకొన్న దుస్థితి వుందని ఈ ఫ్యాక్టరీ మూతపడడం వలన 10000మంది కార్మికులు రోడ్డున రోడ్డున పడ్డారని  అమె అన్నారు. జీవో నె.91 ప్రకారం సంవత్సరానికి  30కోట్లు  జీవో నె.2 వ ప్రకారం సంవత్సరానికి 42 కోట్ల రూపాయల రాయితీతో  ఇలా 327 కోట్ల  రాయితీలతో బిల్టు ఫ్యాక్టరీని తెరిపిస్తామని ముఖ్యమంత్రి  చెప్పడం  జరిగిందని గత 48 నెలలుగా కార్మికులకు జీతాలు  చెల్లించలేదని ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సెటిల్మెంట్ చెయ్యలేదని సీతక్క  అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని నిలదీయగా  సంబంధిత మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ములుగు ఎమ్మెల్యే సీతక్క  సహకారం తో అదే విదంగా లోకల్ వారి సహకారముతో  త్వరలోనే బిల్టు ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

 

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

Tags: MLA Sitakka, the mushroom on the Built Factory in the assembly

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

Date:18/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు సమీపంలోని ఉలవలదిన్నె గ్రామం వద్ద నడుచి వెళ్తున్న వెంకటస్వామి(55) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వెంకటస్వామి నడిచి వెళ్తుండగా ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెంకటస్వామికి తలకు తీవ్ర గాయాలైంది. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

19న శ్రీ స్వయంప్రకాశం సచ్చిదానంద సరస్వతి రాక

Tags: Injuries to a person in a road accident

19న శ్రీ స్వయంప్రకాశం సచ్చిదానంద సరస్వతి రాక

Date:18/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

కర్నాటక హరిహరమఠం పీఠాధిపతి శ్రీ స్వయంప్రకాశం సచ్చిదానంద సరస్వతి స్వామి గురువారం పట్టణంలో పర్యటించనున్నారు. బుధవారం బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు మదుకుమార్‌శర్మ మాట్లాడుతూ పట్టణంలోని హరహరమఠంలో శ్రీ రామానందతీర్థ స్వామివారి ఆరాధాన కార్యక్రమాలను మఠంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి స్వామివారు పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు ఆశీర్వాదం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు హాజరై , స్వామివారి ఆశీస్సులు పొంది, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

బాధితురాలికి కార్పెంటర్ల ఆర్థిక సహాయం

Tags: Arrival of Sri Swayamyakkara Sachchidananda Saraswati on the 19th

బాధితురాలికి కార్పెంటర్ల ఆర్థిక సహాయం

Date:18/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని గాంధినగర్‌లో నివాసం ఉన్న కార్పెంటర్‌ ఆసిఫ్‌ భార్య మెహర్‌తాజ్‌ ప్రమాదంలో గాయపడింది. బుధవారం పుంగపూరి కార్పెంటర్ల సంఘ ప్రతినిధులు కలసి రూ.45 వేలు ఆర్థిక సహాయాన్ని ఆమె భర్తకు అందజేశారు. గత వారం బాధితురాలు మెహర్‌తాజ్‌ ఆర్టీసి బస్సులో వస్తుండగా లారీ ఢీకొన్న ప్రమాదంలో కుడిచెయ్యి విరిగిపోయింది. ఆమె వెలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇలా ఉండగా ఆపరేషన్‌కు సుమారు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలపడంతో కార్పెంటర్లు అందరు తమ శక్తి మేరకు విరాళాలు అందజేశారు.

రైతు భరోసా క్రింద సమగ్ర సర్వే

Tags: Carpenters’ financial assistance to the victim

రైతు భరోసా క్రింద సమగ్ర సర్వే

Date:18/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలో రైతు భరోసా పథకం క్రింద సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు తహశీల్ధార్‌ వెంకట్రాయులు తెలిపారు. బుధవారం ఆయన ఏవో సంధ్యతో కలసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్ధార్‌ మాట్లాడుతూ 20 వరకు రైతు భరోసా క్రింద అన్ని గ్రామాల్లోను సర్వే నిర్వహిస్తామన్నారు. పంచాయతీలలో జరిగే గ్రామ సభలకు రైతులు పట్టాపాసుపుస్తకం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, అకౌంట్‌ పాసుపుస్తకం తీసుకుని సభల్లో అందజేయాలన్నారు. రెండుశాఖల ఆధ్వర్యంలో వైఎస్సార్‌ రైతు భరోసా గ్రామ సభను నిర్వహించడం జరుగుతుందన్నారు. వెబ్‌ల్యాండ్‌ జాబితాను రైతులకు గ్రామాల వారిగా చూపించి, అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వీఆర్‌వోలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

అంటువ్యాదులు ప్రభలకుండ అవగాహన సదస్సులు

Tags; A comprehensive survey under the Farmer’s Assurance

పెళ్లికానుకకు ఐదురోజులు ముందు ధరఖాస్తు చేయాలి

Date:18/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌ పెళ్లికానుక పథకం కోసం ఐదు రోజులు ముందుగా నూతన వదువరులు ధరఖాస్తు చేసుకోవాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు పెళ్లి చేసుకోబోయే దంపతులు గతంలో పది రోజులు ముందుగా ధరఖాస్తు చేసుకోవాల్సి ఉండేదని తెలిపారు. కానీ ఈ నిబంధనలను ప్రభుత్వం సడలించి ఐదు రోజులు ముందుగా నమోదు చేసుకోవాలని ఆదేశించిందన్నారు. ఈ విషయమై ప్రతి ఒక్కరు అవగాహన చేసుకుని పెళ్లికి ఐదు రోజులు ముందుగా నమోదు కార్యక్రమం చేసుకుంటే వైఎస్సార్‌ పెళ్లికానుక అందజేయబడుతుందని తెలిపారు. లేని వారికి ఈ పథకం వర్తించదన్నారు.

అంటువ్యాదులు ప్రభలకుండ అవగాహన సదస్సులు

Tags: Five days before the wedding