షాపై దాడిని తప్పుపట్టిన చంద్రబాబు

Date:11/05/2018
విజయవాడ ముచ్చట్లు:
అమిత్ షా కాన్వాయ్‌పై జరిగిన రాళ్లదాడిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి దాడులతో పార్టీకి చెడ్డపేరు తీసురావొద్దని… పార్టీ అధికారంలో ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదని గుర్తు చేశారట. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరోవైపు ఈ ఘటనపై ఆరా తీసిన బాబు… చిత్తూరు జిల్లా నేతలతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై హోంమంత్రి చినరాజప్ప కూడా స్పందించారు. అమిత్ షా కారుపై దాడి జరగలేదని… వెనుక ఉన్న కారుపై రాయి పడిందని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టడంతో… టీడీపీ కార్యకర్తలు కూడా ప్రతిఘటించారని సమాచారం ఉందన్నారు.ఉదయం అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు. కాన్వాయ్ కొండపైకి వెళుతుండగా… టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈలోపు బీజేపీ కార్యకర్తలు వారిని ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సర్థిచెప్పడంతో గొడవ సద్ధుమణిగింది.
Tags; Chandrababu attacked the attack on Shah

బాలికను మోసం చేసి పెళ్లి చేసుకున్న టీచర్

Date:11/05/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
మాయమాటలతో మభ్యపెట్టి బాలికను పెళ్లి చేసుకున్నాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. ఈ సంఘటన శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో వెలుగు చూసింది. ముచ్చింతల్‌కు చెందిన ఓ బాలిక ఇటీవల వెల్లడించిన పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయింది. ఫెయిలైన సబ్జెక్ట్.. పాస్ చేయిస్తానని చెప్పి బాలికకు మాయమాటలు చెప్పి ప్రధానోపాధ్యాయుడు అక్బర్ ఆమెను తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత బాలికను పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags: The teacher who married the girl was cheated

 గుజరాత్ అల్లర్లలో 19 మంది దోషులే

Date:11/05/2018
గాంధీనగర్ ముచ్చట్లు:
గుజరాత్‌లో 2002వ సంవత్సరంలో అనంద్‌ జిల్లాలోని ఓడే పట్టణంలో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో 19 మందిని దోషులుగా నిర్ధారిస్తూ  గుజరాత్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో విచారణ కోర్టు నలుగురికి జీవిత ఖైదు విధించగా, హైకోర్టు వారిని నిర్థోషులుగా ప్రకటించింది. 2002వ సంవత్సరలో జరిగిన ఈ ఘర్షణల్లో ప్రత్యేక న్యాయస్థానం 23 మందిని దోషులుగా గుర్తించి, వారిలో 18 మందికి జీవితఖైదు, మిగతా ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. విచారణ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిందితులు హైకోర్టులో అప్పీల్‌ చేసుకున్నారు. కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ నిందితులకు మరణ శిక్ష విధించాలని కోరింది. ఈ కేసులో జస్టిస్‌ అకుల్‌ కురేషి, బి.ఎన్‌ కరియాలతో కూడిన బెంచ్‌ ఏప్రిల్‌లో వాదనల విన్న అనంతరం తీర్పును రిజర్వు చేసింది. 2002లో గోద్రా రైలు దహన ఘటన జరిగిన రెండు రోజుల అనంతరం(మార్చి 1, 2002) 23 మంది ముస్లింలను ఆనంద్‌ జిల్లాలోని ఓడ్‌ పట్టణంలో సజీవ దహనం చేశారు. కాగా 47 మంది నిందితుల్లో, విచారణ కోర్టు 23 మంది దోషులుగా నిర్ధారించింది. విచారణ జరుగుతున్న సమయంలో ఒకరు మృతి చెందారు.
Tags: 19 people are guilty of Gujarat riots

భాల్లో స్టాక్ మార్కెట్లు

Date:11/05/2018
ముంబై ముచ్చట్లు:
కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు చివర్లో జోరందుకున్నాయి. మిడ్ సెషన్‌ నుంచీ కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు చెప్పుకోదగ్గ లాభాలు ఆర్జించాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతలతో తొలి నుంచీ మార్కెట్లు పటిష్టంగానే కదిలాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 289 పాయింట్లు జంప్‌చేసి 35,536కు చేరగా.. నిఫ్టీ 90 పాయింట్లు ఎగసి 10,806 వద్ద నిలిచింది.బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ఏసియ‌న్ పెయింట్స్(6.17%), టాటా స్టీల్(2.17%), ఎల్ అండ్ టీ(1.69%), యెస్ బ్యాంక్(1.52%), హెఛ్‌డీఎఫ్‌సీ(1.50%), కొట‌క్ బ్యాంక్(1.46%) లాభాల‌తో ముగియ‌గా, మ‌రో వైపు భార‌తీ ఎయిర్టెల్(6.44%), స‌న్ ఫార్మా(5.05%), టాటా మోటార్స్(0.78%), హీరో మోటోకార్ప్(0.74%), ఎన్టీపీసీ(0.36%) ఎక్కువ‌గా న‌ష్ట‌పోయాయి.
Tags: Stock markets in the slopes

ఇద్దరు ట్రాన్స్ జెండర్లు ఒక్కటయ్యారు

Date:11/05/2018
తిరువనంతపురం ముచ్చట్లు:
కేరళలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తిరువనంతపురానికి చెందిన 33 ఏళ్ల ఇషాన్ కె షాన్, 31 ఏళ్ల సూర్య గురువారం పెళ్లాడారు. కేరళలో చట్టబద్ధంగా రిజిస్టరయిన తొలి ట్రాన్స్‌జెండర్ వివాహం వీరిదే కావడం గమనార్హం. ఇషాన్, సూర్యలకు ఆరేళ్లుగా పరిచయం ఉంది. చాలా కాలంగా వీరిద్దరూ ట్రాన్స్‌జెండర్ల కమ్యూనిటీ సంక్షేమం కోసం పాటుపడుతున్నారు.వీరిద్దరూ ఆరు నెలలుగా ప్రేమించుకుంటుండగా.. తల్లిదండ్రుల సమ్మతితో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులు వారికి వివాహం జరిపించారు. ఇషాన్ 2015లో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకోగా.. సూర్య 2014లో చేయించుకున్నాడు. టీవీ స్టేజ్ ఆర్టిస్ట్‌గా సూర్య ప్రాచుర్యం పొందారు. తిరువనంతపురంలోని ఎంఎంఎన్‌సీ హాల్లో వీరిద్దరి పెళ్లి జరిగింది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులు డ్యాన్స్‌లు చేస్తూ వీరిద్దర్నీ కల్యాణ మండపంలోకి ఆహ్వానించారు.వీరి పెళ్లికి సామాజిక కార్యకర్త జే దేవిక హాజరయ్యారు. సంప్రదాయ బద్ధమైన పెళ్లిళ్లతో పోలిస్తే వీరి పెళ్లిలో ఆచారాలను తక్కువగా పాటించారని ఆమె తెలిపారు.
Tags: Two transgender genders got together

సిక్కోలులో మిల్కి బ్యూటీ

Date:11/05/2018
శ్రీకాకుళం ముచ్చట్లు:
మిల్కీ బ్యూటీ తమన్నా శ్రీకాకుళంలో సందడి చేశారు. పట్టణంలోని బి న్యూ మొబైల్ షోరూంను ఆమె గురువారం ప్రారంభించారు. ఆమెను చూసేందుకు జనం ఎగబడ్డారు. తమన్నా అభిమానులతో మొబైల్ షోరూం ఉన్న జీటీ రోడ్డు ప్రాంతం కోలాహలంగా మారింది. ఓ స్టార్ హీరోయిన్ తమ ప్రాంతానికి రావడంతో మండుటెండను కూడా లెక్క చేయకుండా ఆమెను చూసేందుకు వచ్చారు. తమన్నా రాగానే తమ స్మార్ట్‌ఫోన్లు తీసి కెమెరాలో బంధించారు. తమన్నా మొబైల్ షోరూం వద్దకు చేరుకోగానే అభిమానుల కేరింతలు హోరెత్తాయి.బి న్యూ 54వ మొబైల్ షోరూంను ప్రారంభించిన అనంతరం తమన్నా మాట్లాడుతూ.. ‘శ్రీకాకుళం రావడం, ఇక్కడ అభిమానులను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. నన్నింతగా ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 54వ షోరూం. ఇక్కడ రూ.399 నుంచి రూ.లక్ష వరకు మొబైల్ ఫోన్లు లభిస్తాయి. అన్ని రకాల మొబైల్ యాక్ససరీస్, 4జీ ట్యాబ్లెట్లు, లాప్‌ట్యాప్‌లు కూడా ఉన్నాయి’ అని చెప్పారు. బి న్యూ సంస్థ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై.డి.బాలాజీ చౌదరి మాట్లాడుతూ కస్టమర్ల అపారమైన విశ్వాసం, ఆదరణనే తమ విజయ ప్రస్థానానికి ప్రధాన కారణమన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇది రెండో షోరూమని, రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 షోరూంలు స్థాపించాలన్నదే తన లక్ష్యమమని చెప్పారు.
Tags: Milk Beauty in Sikkol

ఇద్దరిని చంపేసిన వాట్సప్ మెసేజ్

Date:11/05/2018
చెన్నై ముచ్చట్లు:
వాట్సాప్‌లో ఎన్నో చెత్త మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. అలాంటిదే ఒకటి తమిళనాడులో ఇద్దరి ప్రాణాలు తీశాయి. బయటి నుంచి వచ్చే వ్యక్తులపై కన్నేసి ఉంచాలని, వాళ్లు పిల్లలను కిడ్నాప్ చేయడానికి వస్తున్నారన్నది ఆ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ ఆ ప్రాంతంలో వైరల్‌గా మారింది. దీంతో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులను స్థానికులు హత్య చేశారు. పులికాట్‌లో ఓ వ్యక్తిని పిల్లల కిడ్నాపర్‌గా పొరపడి కొందరు వ్యక్తులు దాడి చేసి చంపేశారు. బ్రిడ్జి నుంచి కిందకు వేలాడదీసి హత్య చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ గ్రూపులోని 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఉత్తర భారతదేశం నుంచి వచ్చి పిల్లలను కిడ్నాప్ చేస్తున్నాడని భావించే ఈ హత్య చేసినట్లు వాళ్లు చెప్పారు. అదే రోజు 63 ఏళ్ల రుక్మిణి అనే మరో మహిళను కూడా ఇలాగే కొట్టి చంపారు. ఈ ఘటన తిరువన్నమైలై జిల్లాలో జరిగింది. ఆ మహిళ బంధువులైన నలుగురు కూడా ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఇంటి దేవుడిని దర్శించుకొని బంధువులతో కలిసి రుక్మిణి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దర్శనం తర్వాత ఓ ఊళ్లో కారు ఆపి అక్కడి పిల్లలకు చాక్లెట్లు పంచింది. ఆమె పిల్లలను కిడ్నాప్ చేయడానికే అలా చేస్తుందని భావించిన స్థానికులు ఆమెపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆమె మరణించింది. ఆమె చెప్పేది కూడా వినకుండా వాళ్లు దారుణంగా దాడి చేశారని రుక్మిణి బంధువులు చెప్పారు. ఈ గ్రామంలోని 30 మందిని పోలీసులు అరెస్ట్ చేసి హత్య కేసు పెట్టారు. ఈ వాట్సాప్ మెసేజ్ వల్ల మరికొందరు బయటి వ్యక్తులు కూడా దాడికి గురయ్యారు. ఇలాంటి తప్పుడు వాట్సాప్ మెసేజ్‌లను నమ్మొద్దని వెల్లూరు ఎస్పీ పగలవన్ ప్రజలకు చెప్పారు.
Tags:Watsup message that killed both

కోటి ఇవ్వాలని ఎమ్మెల్యే భార్యకు బ్లాక్ మెయిలింగ్

Date:11/05/2018
గాంధీనగర్ ముచ్చట్లు:
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో సామూహిక అత్యాచార ఘటన నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు నుంచి ఆయణ్ని బయటకు తీసుకొస్తామని, అందుకోసం తమకు రూ. కోటి ఇవ్వాలంటూ సెంగార్ భార్య సంగీతను డిమాండ్ చేసిన ఇద్దరు ప్రబుద్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళపై అత్యాచారం కేసులో సీబీఐ విచారణను ఎందుర్కొంటున్న కుల్దీప్ సెంగార్ ప్రస్తుతం సీతాపుర్ జైల్లో ఉన్నారు. గొసాయిన్‌గంజ్‌‌కు నిందితుడు అలోక్ ద్వివేదీ ఎమ్మెల్యే భార్య సంగీతకు ఫోన్‌చేసి తాను బీజేపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడినని పరిచయం చేసుకున్నాడు. అనంతరం సెంగార్‌ను బయటకు తీసుకొచ్చేందుకు రూ.కోటి ఖర్చవుతుందని తెలిపాడు. అయితే తన వద్ద అంత డబ్బు లేదని ఆమె చెప్పడంతో రూ. 50 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. ఆ మర్నాడు విజయ్ రావత్ అనే మరో వ్యక్తి ఫోన్ చేసి, తాను సీబీఐ ఉన్నతాధికారినని చెప్పాడు. డబ్బును లక్నోలోని సీబీఐ కార్యాలయానికి తీసుకొస్తే సింగార్‌ను తప్పిస్తామని పేర్కొన్నాడు. దీంతో సంగీత పోలీసులకు బుధవారం నాడు ఫిర్యాదు చేసింది. తన భర్తను కేసు నుంచి బయట పడేయాలంటే రూ.కోటి డిమాండ్ చేస్తున్నారని తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా నిందితులను ఘాజీపూర్‌కు చెందిన అలోక్, విజయ్‌లుగా గుర్తించారు. నిందితుడు అలోక్ ద్వివేది అవధ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఖాళీగా ఉంటున్నట్టు విచారణలో తేలింది. సెంగార్ ధనవంతుడని భావించి, పరిస్థితిని అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నించినట్టు తెలిపాడు.
Tags: Block mailing to MLA’s wife to give a quarter