కడపలో నయా దందా

-కుల సర్టిఫెకట్ల జారీలో ఎమ్మార్వోల ఇష్టారాజ్యం

Date:27/04/2018

కడపముచ్చట్లు:
బీసీల్లో వర్గీకరణలు, ఏ వర్గీకరణకు కులం సర్ట్ఫికెట్ ఇవ్వాలనే విషయంపై జిల్లాలోని తహసీల్దార్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.  కడప కేంద్రానికి అతి సమీపంలోని ఖాజీపేట మండలంలో సైతం బలిజకులం లేదంటూ ఖాజీపేట పంచాయతికి చెందిన వీఆర్వో ధృవీకరించిన సంఘటన కూడా ఉంది. ప్రస్తుతం కాపు కార్పొరేషన్ తరపున రుణాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ మండలంలోని కాపులకు అవకాశం లేకుండా తహసీల్దార్ మోకాలడ్డుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో తహసీల్దార్లు వారి పరిధిలోని గెజిట్‌లను పరిశీలించకుండానే ఆయా పంచాయతీలకు చెందిన వీఆర్వోలు ఇస్తున్న తప్పుడు సమాచారంతో ఎంతోమంది పేదలు అటు రుణాలు, ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో కొంతమంది వీఆర్వోలు తాము అడిగిన సొమ్మునుఇస్తే తప్ప సర్ట్ఫికెట్లకు క్లియరెన్స్ ఇవ్వలేమంటూ బాహాటంగానే చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ పరిధిలో ఈనెల చివరినాటికి రుణాలకు సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదుచేసుకోవాల్సి వుండగా, తహసీల్దార్ల అస్తవ్యస్త వైఖరివల్ల చాలామంది వాటికి దూరం కాబోతున్నారు.ఒక మండలంలోని తహసీల్దార్ ఒక వర్గీకరణ బీసీకి కులసర్ట్ఫికెట్ ఇస్తే, మరో మండలంలోని తహసీల్దార్ అదే కులవర్గీకరణకు లేదని చెబుతున్నారు. కుల సర్ట్ఫికెట్లకోసం వచ్చే బడుగు బలహీనవర్గాలను, తహసీల్దార్లు కన్నీటి పర్యంతం చేస్తున్న అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నందలూరు మండలం గోపవరం గ్రామంలోని మొండిబండి కులాన్ని అక్కడి తహసీల్దార్ కుల సర్ట్ఫికెట్ ఇవ్వకుండా పక్కనపెట్టడంతో ఈ ఊరులోని ఆ కులానికి కులం ప్రభుత్వ సంక్షేమపథకాలకు దూరమైంది. గ్రామం గ్రామమే గురువారం కలెక్టర్‌ను కలిసి తమగోడు వెల్లబోసుకున్నారు. గ్రామంలో 50 కుటుంబాలు ఉన్నాయనీ, ఏ ఒక్కరికీ ఈ కులంపై సర్ట్ఫికెట్లు ఇవ్వడం కుదరదంటూ స్థానిక తహసీల్దార్ తెగేసి చెబుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ కుగ్రామంలోని కుటుంబాలవారు వారి పిల్లలకు స్కాలర్ షిప్‌లకు, పెన్షన్లు, ఇళ్లు సైతం మంజూరు చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇటీవల బీసీ కార్పొరేషన్ ప్రవేశపెట్టిన రుణాల మంజూరుకు కూడా వీరు అనర్హులైపోయారు. గెజిట్‌లో వీరు బీసీ-ఏ గా ఉన్నారు. ప్రభుత్వం విడుదలచేసిన కులాల గెజిట్ అన్ని తహసీల్దార్ల కార్యాలయాల్లో అట్డడుగున మూలుగుతున్నాయి. ఏ తహసీల్దార్ ఈ గెజిట్లను చూడటం లేదు. సమస్య కుగ్రామానికి సంబంధించిన ఒక్క సమస్యేకాదు, జిల్లా వ్యాప్తంగా అనేకమంది తహసీల్దార్లు ఇష్టానుసారంగా కులసంఘాల సర్ట్ఫికెట్లు మంజూరులో నిరంకుశ వైఖరిని అవలంబిస్తున్నారు. తాము చెప్పిందే వేదమంటున్నారు. ప్రభుత్వం విడుదలచేసిన గెజిట్‌ను పరిశీలించకుండానే, కులం జాబితాలో ఉన్నా ఈప్రాంతంలో లేరని, తమ వీఆర్వో ధృవీకరించలేదని సాకులు చెబుతూ తిరస్కరిస్తున్నారు.
Tags: Naya Danda in Kadapa

అందని రాయితీలు

-చేతులెత్తేసిన ఎస్కార్ట్స్‌ కంపెనీ

Date:27/04/2018

కాకినాడ ముచ్చట్లు:

రైతులకు రాయితీపై యంత్రాలను అందించేందుకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ, ప్రైవేటు భాగస్వామ్యంతో సీహెచ్‌సీ కేంద్రాలను ఏర్పాటు చేసినా దానికి అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయక పోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలో 20 చోట్ల సీహెచ్‌సీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించినా కేవలం ఆరు చోట్ల మాత్రమే వీటిని నెలకొల్పారు. మిగిలిన ప్రాంతాల్లో ఈ కేంద్రాల ఏర్పాటుకు ఏ కంపెనీ ముందుకు రాకపోవడంతో లక్ష్యాన్ని చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎస్కార్ట్స్‌ కంపెనీ ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని యంత్రాలకు సైతం రాయితీ అందక పోవడంతో వీటి నిర్వహణ కూడా ప్రశ్నార్థకంగా మారింది. తమకు రాయితీని అందిస్తే యంత్రాలను ·రైతులకు అందుబాటులో ఉంచుతామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. వ్యవసాయ పనులకు కూలీలు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే వారు యాంత్రీకరణ వైపు మొగ్గుచూపుతుండడంతో యంత్రాలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం రబీ మాసూళ్లు జరుగుతున్న తరుణంలో కొందరు దళారులు వరి కోత యంత్రాలను తీసుకొచ్చి రైతుల నుంచి భారీగా అద్దె వసూలు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏదో విధంగా పంటను ఒబ్బిడి చేసుకోవాలన్న ఆతృతతో రైతులు వారు అద్దె ధరను చెల్లిస్తున్నారు. ఇటీవల రాజోలులో సీహెచ్‌సీ కేంద్రానికి చెందిన వరికోత యంత్రంతో పనిచేస్తుండగా కొందరు దళారులు హడావుడి సృష్టించారు.గంటకు రూ.1,850 అద్దెతో వరి పంటను ఎలా కోస్తారని ప్రశ్నిస్తూ యంత్రం తాళాలను తీసుకెళ్లి రెండు రోజుల వరకూ ఇవ్వలేదు. ఈ పరిస్థితిలో సీహెచ్‌సీ సెంటర్లకు రాయితీని విడుదల చేసి ఈ యంత్రాలను విస్తృతంగా అందుబాటులోకి తేవాల్సిన అవసరముంది.ఎస్కార్ట్స్‌ క్రాప్‌ సొల్యూషన్స్‌ కంపెనీ సుమారు రూ.3 కోట్లతో యంత్రాలను కొనుగోలు చేసి సీహెచ్‌సీ సెంటర్ల ద్వారా అందుబాటులో ఉంచింది. దీనికి 50 శాతం రాయితీ ప్రకారం రూ.1.50 సంబంధిత కంపెనీకి అందజేయాల్సి ఉంది. గత ఖరీఫ్‌ సీజన్‌లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రైతులకు ఈ యంత్రాలను అందించడంతో రైతులకు కొంత మేరకు ప్రయోజనం చేకూరింది. రబీకి సంబంధించి వరి మాసూళ్లు ప్రారంభమైన తరుణంలో వరికోత యంత్రాలకు డిమాండ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎస్కార్ట్స్‌ కంపెనీకి రావాల్సిన రాయితీ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ అందలేదు. దీంతో రైతులకు రాయితీపై యంత్రాలను అందించలేమని సంస్థ చేతులెత్తేసింది. ఫలితంగా రైతులు అధిక అద్దెలు చెల్లిస్తూ ప్రైవేటు యంత్రాలను వినియోగిస్తున్నారు. సీహెచ్‌సీ కేంద్రాల ద్వారా వరి కోత యంత్రాన్ని గంటకు రూ.1,850 అద్దెకే అందించే వారు. కానీ ప్రస్తుతం ప్రైవేటు యంత్రాల నిర్వాహకులు గంటకు రూ.2,300 నుంచి రూ.2,400 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు ఎకరాకు రూ.600 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అసలే పెట్టుబడులు భారీగా పెరిగి అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు రాయితీతో యంత్రాలు వినియోగించుకునే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

 

Tags: Not subsidies

అకాల వర్షంతో మామిడికి పురుగులు

Date:27/04/2018
విజయవాడ ముచ్చట్లు:
అకాల వర్షం ఉద్యాన పంటలపై ప్రభావం చూపింది. పండ్ల తోటలలో కాపునకొచ్చిన కాయలపై చినుకులు పడడంతో తామర పురుగుల బెడద తప్పలేదు. రాష్ట్రంలో చిత్తూరు, కృష్ణా జిల్లాల తర్వాత మామిడి తోటల సాగులో కడప జిల్లా స్థానం దక్కించుకుంది. జిల్లా సగ భాగం బౌగోళికంగా ఉద్యాన తోటల పెంపకానికి అనువైన భూమి ఉంది. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట, కోడూరు డివిజన్లలోనే మామిడి 80 శాతం సాగులోకి వచ్చింది. ఏటా మామిడి ఎగుమతుల కారణంగానే రూ.200 కోట్లు పైబడి జిల్లాలో వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగాను ఎగుమతి కావడంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి జిల్లాకు చేరుతోంది. నీటి లభ్యత లేని ప్రాంతాలలోనూ మామిడి సాగు చేసి సీజనల్‌ వర్షాలతోనే తోటలను కాపాడుకొంటున్న రైతులు ఏడాదికి ఒక్కసారి వచ్చే దిగుబడిపై ఆధారపడి కుటుంబ జీవనం సాగిస్తున్నారుకాయపై వాలిన పురుగు కాయ పైభాగంలోని రసం పీల్చేందుకు కంటికి కనిపించని రీతిలో రంధ్రాలు, గోకడం ఎక్కువగా చోటు చేసుకుంది. పురుగుకు లోనైన కాయ సైజు పెరిగే కొద్ది పురుగు తొలచిన రంధ్రాలు, గోకిన ప్రాంతం నల్లగా మసిబారిపోతుంది. కంటికి ఇంపుగా ఉండేలా రూపుదిద్దుకొంటున్న కాయపై నల్లటి చుక్కలు కనిపించడంతో వ్యాపారులు కొనుగోలుకు సంకోచిస్తున్నారు. వారం రోజుల ముందు వరకు టన్ను రూ.80 వేలు వరకు ఉన్న ధర ప్రస్తుతం రూ.50 వేల లోపునకు తగ్గడంతో రైతులు, వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రభావం వర్షాలు కురిసిన కొన్ని ప్రాంతాల్లోనే ఉండడంతో మిగిలిన ప్రాంతాల రైతులు ఊపిరి పీల్చుకొంటున్నారు. ఈ సారి మామిడి దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. ఏటా జిల్లా నుంచి రాజస్థాన్‌, పూనె, ముంబయి, జమ్ము-కాశ్మీర్‌, గుజరాత్‌, చెన్నై, సూరత్‌, హైదరాబాద్‌ ప్రాంతాలకు భారీగా ఎగుమతి అయ్యేవి. తోటలలో ఉన్న అరకొర కాయలకు అకాల వర్షాలతో ఇలాంటి మచ్చలు ఏర్పడతాయని ఊహించలేదని రైతులు అంటున్నారు.జిల్లాలో వార్షిక ఆదాయం ఇచ్చే పంటలలో మామిడి ప్రధానమైంది. . ఈ సారి తోటలలో కాపు తగ్గడం, దేశంలోని ఇతర రాష్ట్రాలలోనూ జాతీయ మార్కెట్‌కు కాయలు రావడం ఆలస్యం కావడంతో ధరలు మాత్రం కొంత మేర స్థిరీకరణగా ఉంటున్నాయి. ఇటీవల కాయలకు వస్తున్న మంగు చూసి వ్యాపారులు, రైతులు దిగులు చెందుతున్నారు.
Tags: Mango mango with premature rain

 కర్ణాటక సమరంలో 3374 మంది

Date:26/04/2018
బెంగళూర్ ముచ్చట్లు:
 కర్ణాటక ఎన్నికలు…ప్రస్తుత జాతీయ రాజకీయాలను వెడెక్కిస్తున్నఎన్నికలు. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ఓటమి, ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా నిరాకరణ, కావేరీ జల వివాదం, తెలంగాణ మైనార్టీ బిల్లు తిరస్కరణ. బాలికలపై మహిళలపై హత్యాచారాలు, కరెన్సీ కొరత వంటి పరిణామాల తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో  బీజేపీకి ఈ ఎన్నికలు సవాలనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బుధవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన అనంతరం 3374 మంది అభ్యర్థులు రంగంలో మిగిలారు. బుధవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్‌ కంటే బీజేపీ నుంచి  మంది అభ్యర్థులు అధికంగా ఉన్నారు. మంది అభ్యర్థులు మొత్తం 4853 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల కమిషనర్‌ సంజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. బీజేపీ నుంచి  మంది అభ్యర్థులు కాంగ్రెస్‌ నుంచి 251 మంది జేడీఎస్‌ నుంచి 281బీఎస్‌పీ నుంచి 22 సీపీఐ నుంచి ముగ్గురు సీపీఎం నుంచి ఇద్దరు ఎన్‌సీపీ నుంచి 15 మంది రంగంలో ఉన్నారు.స్వతంత్ర అభ్యర్థులు 1678 మంది బరిలో ఉండగా గుర్తింపు లేని రాజకీయ పార్టీల తరఫున 596 మంది అభ్యర్థులు మిగిలారు. 3374మంది అభ్యర్థుల్లో మహిళలు 259మంది కాగా పురుషులు 3115మంది ఉన్నారు. ఉపసంహరణకు మరో రెండు రోజుల గడువు ఉంది. ఇక బెంగళూరు పరిధిలోని నియోజకవర్గాల నుంచి 471మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ముళబాగిలు నియోజకవర్గంలో అత్యధికంగా 60 మంది అభ్యర్థులుండగా వరుణలో 35మంది హుబ్లీ ధార్వాడలో 35 మంది ఉన్నారు. నియోజకవర్గాల్లో 15 మందికి పైగా అభ్యర్థులు ఉన్నారు. ఉత్తరాది పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాలలో అధికారం చేపట్టి తన సామ్రాజ్యాన్ని దక్షిణాదిన కూడా స్థాపించాలనే దృఢ నిశ్చయంతోపాటు ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌ను ఇక్కడ కూడా ఓడించి మరింత బలహీన పరచాలనే ధ్యేయంతోనే పావులు కదుపుతుంది. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో  బీజేపీ అధికారం చేపడుతుందో లేక కాంగ్రెస్‌ పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
Tags: 3374 people in Karnataka

29న ఢిల్లీలో ప్ర‌జా ఆగ్ర‌హా ర్యాలీ 

– ఏపీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి
Date:26/04/2018
గుంటూరు  ముచ్చట్లు:
ఏఐసీసీ అధ్య‌క్ష‌డు రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 29న ఢిల్లీలో ‘ప్ర‌జా ఆగ్ర‌హా ర్యాలీ’ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు ఎన్‌.ర‌ఘువీరారెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జాతీయ ప్రజా ఆగ్రహా ర్యాలీ నిర్వహిస్తున్నా మని, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయ‌కులు అభిమానులు, కార్య‌క‌ర్త‌లు ఈ ర్యాలీలో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపు నిచ్చారు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రత్యేకంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రజలు దోపిడీకి గురైన పాలనలో ఉన్నారని, నిరుద్యోగ పెరుగుదల, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, రైతు ఆత్మహత్యలపై నిరసన తెలుపుతూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ర్యాలీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మ‌హిళా, ఓబీసీ విభాగం, మత్స్యకారుల కాంగ్రెస్, అసంఘటిత వర్కర్స్ కాంగ్రెస్,  వివిధ విభాగాల కాంగ్రెస్ నాయ‌కులు అధిక సంఖ్య‌లో పాల్గొంటార‌ని తెలిపారు.
Tags:Public rally in Delhi on 29th

ఏపీ డిమాండ్ కు న్యాయం ఉంది

Date:26/04/2018
తిరుమల ముచ్చట్లు:
విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్‌ షిండే పేర్కొన్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి అవసరమైన అన్ని వసతులు కల్పించాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నామని పునరుద్ఘాటించారు. బీజేపీ ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తుందో తనకు అర్థం కావట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. సీఎంచంద్రబాబు నాయుడు, ఏపీ ప్రజలు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదేనని షిండే అభిప్రాయపడ్డారు. ఏపీ ఇంతగా పోరాటం చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ స్పందించడం లేదని, దీన్ని ఇలాగే కొనసాగించాలని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పూర్తిస్థాయి మెజార్టీ సాధించి, మరోసారి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కథువా, ఉన్నావ్‌, గుజరాత్‌ అత్యాచార ఘటనలు చాలా బాధాకరమని అన్నారు. గత ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలను ఏవీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. అన్ని వర్గాల్లోనూ మోదీపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ ఆధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Tags: There is justice for AP demand

నాలాగ ఇతర అమ్మాయిలు కాకుడదు 

Date:26/04/2018
జోధ్ పూర్ ముచ్చట్లు:
మైనర్ బాలిక అత్యాచారం కేసులో వివాదస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును దోషిగా తేల్చిన న్యాయస్థానం, జీవితఖైదు విధించింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదురించిన ఆ బాలిక, నాలుగు దశాబ్దాలపాటు లక్షలాది మందితో ఆధ్యాత్మిక గురువుగా పూజలందుకున్న ఆశారాంను న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టింది. తీర్పు అనంతరం బాధితురాలు మాట్లాడుతూ… నా ఐదేళ్ల గృహ‌నిర్బంధంతో నేటితో ముగిసిందని వ్యాఖ్యానించింది. జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆశారం తనపై అత్యాచారానికి పాల్పడటంతో భయపడి ఒక్కసారి గందరగోళంలోకి వెళ్లిపోయానని, ఘటన జరిగిన తర్వాత కొద్ది రోజులు మౌనంగా ఉండిపోయినట్టు తెలిపింది. చివరికు మాత్రం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. తనపై అత్యాచారానికి పాల్పడిన ఆశారాం, దానికి సంబంధించి సాక్షులను హత్యచేసి, నా విద్యాభ్యాసానికి భంగం కలిగించాడని వాపోయింది. తన కుటుంబాన్ని వెంటాడు.. వాడు చేసిన నేరానికి తాను ఐదేళ్లు గృహ‌నిర్బంధం అనుభవించానని అవేదన చెందింది. ఈ విషయంలో కొందరు నాపై జాలిచూపించారు.. మరికొందరు సూటిపోటి మాటలతో బాధించారు.. చాలా బెదరింపులు కూడా ఎదురయ్యాయి, ఇవన్నీ భయంకరమైన పీడకలగా వెంటాడాయని తెలిపింది. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం బలంగా ఉండేది, కానీ నేరస్థుడు పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో కేసు నుంచి బయటపడే అవకాశం ఉందని ఏదో ఒకమూల సందేహాం వెంటాడేదని, అయితే తీర్పుతో నా అనుమానం పటాపంచలైందని పేర్కొంది. ప్రస్తుతం బీకామ్ చదువుతోన్న బాధితురాలు, నిరంతరం నా మనసులో ఆలోచనలు ఈ కేసు చుట్టూ తిరుగుతూ ఉండేవని తెలియజేసింది. నేను ఇప్పుడు నా భవిష్యత్ గురించి ఆలోచిస్తా, నా వయస్సులో ఉన్న ఇతర అమ్మాయిలాగే నా జీవితాన్ని గడుపుతానని సంతోషం వ్యక్తం చేసింది. తీర్పు అనంతరం బాధితురాలి తండ్రి హర్షం వ్యక్తం చేశాడు.. తన కూతురు మొహంలో ఇప్పుడు సంతోషం ఉందని, ఇప్పుడు తాము చనిపోయినా సంతృప్తిగా ఉంటుందని భావోద్వేగానికి గురయ్యారు. కేసును వెనక్కి తీసుకోవాలంటూ అయిదేళ్లుగా తమను అనేక రకాలుగా ఒత్తిడికి గురి చేశారు.. చంపుతామని బెదిరించారు.. చివరికి న్యాయమే గెలిచింది’ అని ఆయన అన్నారు. ఆశారాంకు శిక్ష పడటంలో విశేషంగా కృషి చేసిన పోలీసులు, న్యాయవాదులు, తీర్పు ఇచ్చిన న్యాయమూర్తికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Tags: Other girls in the future will not

రామ్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స్ర‌వంతి మూవీస్ చిత్రం ప్రారంభం

Date:26/04/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
కొన్ని కాంబినేష‌న్లు అనూహ్యంగా తెర‌మీద‌కు వ‌స్తాయి. వ‌చ్చినంత  వేగంగానే ఆస‌క్తిని  రేకెత్తిస్తుంటాయి. యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌, స‌క్సెస్‌ఫుల్ డైర‌క్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు  కాంబినేష‌న్ కూడా అలాంటిదే. రామ్ హీరోగా, ప్ర‌వీణ్ స‌త్తారు  ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స్ర‌వంతి మూవీస్ సంస్థ  సినిమా మొద‌లుపెట్ట‌నుంద‌ని తొలి వార్త విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ట్రేడ్ వ‌ర్గాల్లోనూ అమితాస‌క్తి కనిపించింది. అలా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోన్న ఈ సినిమా ప్రారంభోత్స‌వం నిరాడంబ‌రంగా యూనిట్ స‌భ్యుల స‌మ‌క్షంలో గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఉత్త‌మాభిరుచిగ‌ల నిర్మాత `స్ర‌వంతి` ర‌వికిశోర్ నిర్మిస్తున్నారు. యువ ప్ర‌తిభాశాలి పి.కృష్ణ‌చైత‌న్య ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చిత్ర నిర్మాత `స్ర‌వంతి` ర‌వికిశోర్ మాట్లాడుతూ “ఏప్రిల్ 26న గురువారం హైద‌రాబాద్‌లో నిరాడంబ‌రంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాం.    మే 7 నుంచి జార్జియాలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మే నెలాఖరు వ‌ర‌కు తొలి షెడ్యూల్ సాగుతుంది. ఆ త‌ర్వాత స్విట్జ‌ర్లాండ్‌, ఫ్రాన్స్, ఇట‌లీలోని సుంద‌రమైన ప్ర‌దేశాల్లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తాం.  విదేశాల నుంచి తిరిగి వ‌చ్చాక కాశ్మీర్‌, ల‌డ‌ఖ్‌లో భారీ షెడ్యూల్స్ చేస్తాం. న్యూ వేవ్ లో సాగే చిత్ర‌మిది. మ‌రిన్ని విశేషాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం“ అని చెప్పారు.
ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు మాట్లాడుతూ “హీరో రామ్ కి చ‌క్క‌గా స‌రిపోయే క‌థ కుదిరింది.  స్క్రిప్ట్ గ్రిప్పింగ్‌గా ఉంది. యాక్ష‌న్, అడ్వంచ‌ర‌స్ అంశాలు పుష్క‌లంగా ఉంటాయి. న్యూ వేవ్‌లో సాగే సినిమా.  మే నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెడ‌తాం. ప్ర‌ముఖ సాంకేతిక నిపుణులు, న‌టీన‌టులు మా చిత్రానికి ప‌నిచేస్తారు. అంద‌రినీ మెప్పించే సినిమా అవుతుంది“ అని అన్నారు.
Tags: Sr. Swarnavi Movie is directed by Praveen Sattar