అంటువ్యాదులు ప్రభలకుండ అవగాహన సదస్సులు

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:18/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని 24 వార్డుల్లోను అంటువ్యాదులు ప్రభలకుండ ఉండేందుకు ప్రజల్లో అవగాహన సదస్సులు , వైద్యశిబిరాలు చేపట్టినట్లు మున్సిపల్‌ కెఎల్‌.వర్మ తెలిపారు . బుధవారం ఆయన మాట్లాడుతూ పట్టణంలో గత ఇరవై రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జ్వరాలు ప్రభలిందన్నారు. దీనిని నివారించేందుకు ముందుజాగ్రత్తగా వైద్య సిబ్బందితో కలసి చైతన్య సదస్సులు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో మురుగునీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రజలకు అవగాహన కలిగించేందుకు మున్సిపల్‌ సిబ్బందిచే కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేస్తూ జ్వరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించడం జరుగుతోందన్నారు.

ప్రజలను చైతన్యవంతులు చేసేందుకే ర్యాలీ…

పట్టణంలోని మెప్మా సిబ్బంది , సంకల్ప సోసైటి సభ్యులతో కలసి పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండు, కొత్తపేట, కొత్తయిండ్లు ప్రాంతాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. అలాగే స్వచ్చతేహి సేవ నినాదంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని , ప్లాస్టిక్‌ను నిషేధించాలని, గుడ్డబ్యాగులు, జనపనార సంచులు వినియోగించాలని నినాదాలు చే స్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్‌మిషన్‌ కోఆర్డినేటర్‌ రవి, సంకల్ప సభ్యులు జానకి, రాజు, సుజాత, బాబు తదితరులు పాల్గొన్నారు.

వైద్యశిబిరం….

మున్సిపాలిటి పరిధిలో జ్వరాలు ప్రభలడంతో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సోనియా ఆధ్వర్యంలో బుదవారం వైద్యశిబిరం నిర్వహించారు. పట్టణంలోని గాంధినగర్‌లో ప్రజలకు చికిత్సలు చేశారు. రక్తపరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మాట్లాడుతూ వాంతులు, విరేచనాలను నిర్లక్ష్యం చేయకుండ వెంటనే ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు పొందాలన్నారు. వర్షాకాలంలో అంటువ్యాదులు నివారించేందుకు ప్రజలు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సుకన్య, మంగమ్మ, సుగుణ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీని గుళ్లోకి రానివ్వని యాదవ కులస్తులు

Tags: Epidemiological Awareness Seminars

ఎంపీని గుళ్లోకి రానివ్వని యాదవ కులస్తులు

Date:18/09/2019

కర్ణాటక ముచ్చట్లు:

కుల రక్కసి ప్రజల్లో ఎంతగా నాటుకు పోయిందో కర్ణాటకలోని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. బీజేపీ ఎంపీ ఏ. నారాయణస్వామి దళిత కమ్యూనిటీకి చెందినవాడు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన తుమకూరులోని యాదవుల గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుందామనుకున్నారు. కానీ అతడిని ఆ కులస్తులు గుళ్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సంఘటనపై నాగరాజు అనే వ్యక్తి మాట్లాడుతూ.. మేము చాలా సాంప్రదాయవాదులం.

 

 

 

 

మా గుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి గుడిలో అడుగు పెడితే కీడు జరుగుతుందని కుల పెద్దలు చెప్పడంతో అతడిని గుళ్లోకి రానివ్వలేమని అన్నారు. ఈ సంఘటనపై ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, భారతదేశం కుల, మతాల సమ్మేళనం, భిన్నత్వంలో ఏకత్వం అనేవి ఉట్టి మాటలేనని మరోసారి రుజువయింది.

 

 

 

 

పార్లమెంట్‌ మెంబర్‌కే ఇలాంటి అవమానం జరిగినపుడు గ్రామాల్లో సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఇకనైనా మారాలని ఆశిద్దాం.

 

టీటీడీ పాలకమండలి జాబితా

Tags: Yadav castes who do not let the MP go

టీటీడీ పాలకమండలి జాబితా

Date:18/09/2019

తిరుమల ముచ్చట్లు:

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని బుధవారం నాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకూ పాలకమండలిలో 16 మంది సభ్యులు ఉండగా.. ఈ సంఖ్యను ప్రభుత్వం ఇటీవల 25మందికి పెంచింది. వీరితో పాటు దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో, దేవదాయ శాఖ కమిషనర్‌, తుడా చైర్మన్‌.. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉంటారు.

 

 

 

కాగా.. 28 మందిలో ఆంధ్రప్రదేశ్ నుంచీ 8 మందికీ, తెలంగాణ నుంచీ ఏడుగురికీ అవకాశం ఇచ్చారు. అలాగే… తమిళనాడు నుంచీ 4గురు, కర్ణాటక నుంచీ ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచీ ఒక్కొక్కరికి సభ్యత్వం కల్పించారు. టీటీడీ పాలకమండలిలో పలువురు ఎమ్మెల్యేలకు కూడా స్థానం కల్పించారు. మహిళా కోటాలో కూడా కొందరికి అవకాశం కల్పించడం విశేషం.

టీటీడీ పాలకమండలి జాబితా

1. యు.వి. రమణమూర్తి రాజు (ఎమ్మెల్యే)
2. మేడా మల్లిఖార్జునరెడ్డి (ఎమ్మెల్యే)
3. కొలుసు పార్ధసారధి (ఎమ్మెల్యే)
4. పరిగెల మురళీకృష్ణ
5. కృష్ణమూర్తి వైద్యనాథన్
6. నారాయణస్వామి శ్రీనివాసన్
7. జూపల్లి రామేశ్వరావు
8. వి.ప్రశాంతి
9. బి.పార్ధసారధిరెడ్డి
10. డాక్టర్ నిశ్చిత ముత్తవరపు
11. నాదెండ్ల సుబ్బారావు
12. డీపీ అనంత
13. రాజేశ్ శర్మ
14. రమేష్ శెట్టి
15. గుండవరపు వెంకట భాస్కరరావు
16. మూరంశెట్టీ రాములు
17. డి.దామోదరావు
18. చిప్పగిరి ప్రసాద్ కుమార్
19. ఎం.ఎస్.శివశంకరన్
20. సంపత్ రవి నారాయణ
21. సుధా నారాయణమూర్తి

22. కుమారగురు (ఎమ్మెల్యే)
23. పుట్టా ప్రతాప్ రెడ్డి
24. కె.శివకుమార్
25. స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఎండోమెంట్స్
26. దేవాదాయశాఖ కమిషనర్
27. తుడా ఛైర్మన్
28. టీటీడీ ఈవో

ఇదిలా ఉంటే.. పాలకమండలిలో సభ్యులుగా అవకాశం వస్తుందని ఆశించిన వారికి రాకపోగా.. ఊహించని వ్యక్తులకు చోటు దక్కడం గమనార్హం. దీంతో జాబితా చూసిన ఆశావహులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని తెలుస్తోంది.

నిలిచిన సురక్ష

Tags: List of TetiD Governing Council

సా…గుతున్నాయి 

Date:18/09/2019

నల్గొండ ముచ్చట్లు:

 

జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. జిల్లాలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టును మినహాయిస్తే అత్యధిక శాతం భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న వారే అధికం. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ విద్యుత్‌ మోటార్లు ఇక్కడే ఉన్నాయి. సహజంగానే విద్యుత్‌ వినియోగం కూడా జిల్లాలోనే ఎక్కువ. తాజా బడ్జెట్‌లో జిల్లా ప్రాజెక్టులకు నామ మాత్రంగా కూడా నిధులు కేటాయించలేదు. ఒక్కో ప్రాజెక్టుకు కోట్ల రూపాయల్లో బకాయిలు ఉండగా, కనీసం సిబ్బంది జీత భత్యాలకు సరిపడినంత కూడా నిధులు కేటాయించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

 

 

అరకొరగా ఇస్తున్న బడ్జెట్‌ కేటాయింపులు ఉద్యోగుల జీత భత్యాలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులకే సరిపోతుండడంతో ప్రాజెక్టుల పనులు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న విధంగా తయారయ్యాయి. జిల్లాలోని ఏఎమ్మార్పీ/ఎ స్‌ఎల్‌బీసీ, డిండి, ఉదయం సముంద్రం– బ్రా హ్మణ వెల్లెంల, మూసీ ప్రాజెక్టుల్లో కేవలం డిండి కి మాత్రమే ఓ మాదిరి కేటాయింపులు జరిపారు.

 

 

 

2005లో సీఎంగా ఉన్న దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.2,853కోట్లతో చేపట్టిన శ్రీశైలం లెఫ్ట్‌ బ్రాంచ్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) 2010 వరకు పూర్తి కావాల్సి ఉంది. ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం ఇన్‌లెట్‌ నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా మన్నెవారిపల్లి గ్రామపంచాయతీ కేశ్యతండా ఔట్‌లెట్‌ వరకు 43కిలోమీటర్ల ఇన్‌లెట్‌ సొరంగ మార్గాన్ని, అలాగే నక్కలగండి తండా ఇన్‌లెట్‌ నుంచి నేరెడుగొమ్ము ఔట్‌లెట్‌ వరకు మరో 7 కిలోమీటర్ల సొరంగ మార్గం పనులు ఉన్నాయి.

 

 

 

2010 నాటికే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ 60 శాతం కూడా పూర్తి కాకపోవడంతో 2012లో ప్రాజెక్టు నిర్మాణ కాల పరిమితిని 2017 డిసెంబర్‌ వరకు పెంచారు.  ఇప్పుడు కాస్తా 2020 నాటి వరకు అవకాశం కల్పించారు. గత బడ్జెట్‌లో రూ.700 కోట్లుగా పేర్కొని రూ.500కోట్లకు సవరించారు. కాగా ఈ బడ్జెట్‌లో కేవలం రూ.3కోట్లు మాత్రమే కేటాయించడంతో ఈప్రాజెక్టుకు ప్రభుత్వం నీళ్లొదిలిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు ఏకంగా  రూ.752.71 పేరుకుపోయాయి.

 

 

 

ఏఎమ్మార్పీకి అనుసంధానించేలా రూపొందిం చిన ఎస్‌ఎల్‌బీసీలో అంతర్భాగంగా ఉన్న నక్కలగండి బండ్‌ నిర్మాణం పనులూ వేగం పుంజుకోలేదు. నాగార్జున సాగర్‌ లో లెవల్‌ కెనాల్, ఏఎమ్మార్పీలోనే అంతర్భాగంగా ఉన్న ఉదయ సముద్రం–బ్రాహ్మణవెల్లెంలకు అసలు నిధులే ఇవ్వలేదు.

 

 

 

2009లో నాటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో మొదలైన ఉదయసముద్రం–బ్రాహ్మణ వెల్లెంల పనులు ముందుకు పడడం లేదు. ఆయకట్టేతర ప్రాంతమైన నకిరేకల్‌ నియోజకవర్గ పరిధిలోని నకిరేకల్, కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట, వీటితో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలోని  శాలిగౌరారం, నల్లగొండ నియోజకవర్గంలోని నల్లగొండ మండలాలకు తాగునీటితో పాటు, సాగునీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టుకు దశాబ్ధ కాలంగా అరకొర నిధులే ఇస్తున్నారు. నకిరేకల్, నల్లగొండ, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఎస్‌ఎల్‌బీసీలో అంతర్భాగంగా చేపట్టారు.

 

 

 

 

రూ.699కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా పనులు కొనసాగుతున్నాయి. ఈ బడ్జెట్‌లో పైసా విదిల్చలేదు. భూ సేకరణకు రూ.200 కోట్లు, మిగిలిన పనులన్నీ పూర్తి చేయడానికి మరో రూ.250కోట్లు వెరసి రూ.450 కోట్లు ఇస్తే కానీ ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా లేదు.

 

 

 

దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలలో 3.4లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు తాగునీ టిని అందించేందుకు  మూడున్నరేళ్ల కిందట మర్రిగూడ మండలం శివన్నగూడెం వద్ద పనులకు శంకుస్థాపన చేశారు. రూ.6,190కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఐదు రిజర్వాయర్లను నిర్మించనున్నారు. మర్రిగూడ మండలం శివన్నగూడెంలో 7 టీఎంసీల సామర్థ్యం, చింతపల్లి మండలం కిష్టరాయినిపల్లి వద్ద 5.7 టీఎంసీలు, చింతపల్లి మండల కేంద్రంలో 1.9 టీఎంసీలు,  గొట్టిముక్కల వద్ద 1.835 టీఎంసీలు, డిండి మండలం సింగరాజుపల్లి వద్ద 7 టీఎంసీల సా మర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయిం చారు.

 

 

 

 

ఇప్పటికే ఈ పనులు ప్రారంభం కాగా  ఇంకా 4,350 ఎకరాల భూమిని రైతులనుంచి భూ సేకరణ చేయాల్సి ఉంది.  ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సి ఉన్నా ప్రభుత్వం అదేమీ పట్టించుకోవడం లేదు. ఈ బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.90.87 కోట్లు మా త్రమే కేటాయించారు. ఆరువేల కోట్ల రూపాయల ప్రాజెక్టును పూర్తి చేయడానికి మరీ ఇంత చిన్న మొత్తంలో నిధులు కేటాయిస్తే పనులు పూ ర్తి కావడానికి ఎన్నేళ్లు పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఈ ప్రాజెక్టులో రూ.345.93కోట్లు పెండింగు బిల్లులు చెల్లించాల్సి ఉంది.

 

 

 

 

మూసీ ప్రాజెక్టు 1963లోనే అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ లక్ష్యం నెరవేరలేదు. నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందివ్వలేకపోతోంది. ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యం 41వేల 800 ఎకరాల ఆయకట్టుకు సాగునీరివ్వడం. రూ.2.20కోట్ల నిర్మాణ వ్యయంతో పూర్తయిన ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఆధునీకరించాలంటే కనీసం రూ.60 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. నిర్వహణ నిధులు మినహా మరమ్మతుల కోసం ఇప్పటి దాకా ఇచ్చింది కేవలం రూ.19కోట్లు. వీటితో ఇతరత్రా పనులన్నీ పూర్తయినా, కాల్వల లైనింగ్‌ సహా ఇతర ఆధునీకరణ పనులు మొదలే కాలేదు. గత బడ్జెట్‌లో రూ.4.62 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.

 

 

 

ఈ సారి మరింత తగ్గించి రూ.4.17కోట్లు ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో చెల్లించాల్సిన బకాయిలే రూ.12.24 కోట్లు ఉండడం గమనార్హం. మొత్తంగా జిల్లాలోని ప్రాజెక్టులకు అరకొరగా నిధులు ఇస్తుండడంతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ప్రాజెక్టులు పూర్తయ్యి, ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో, బీడు భూములకు సాగునీటిని ఎప్పటికి అందిస్తాయో అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

 

నిలిచిన సురక్ష

Tags: Saw … gutunnayi

నిలిచిన సురక్ష

Date:18/09/2019

మచలీపట్నం ముచ్చట్లు:

 

ముఖ్యమంత్రి బాల సురక్ష పేరిట కొనసాగుతున్న రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం సేవలు జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయాయి. సంచార వాహనాలకు సంబంధించిన అద్దె బకాయిలు, సిబ్బంది వేతనాలు విడుదల చేయడంలో నెలకున్న జాప్యమే కారణంగా తెలుస్తోంది. ఫలితంగా విద్యార్థులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే సమున్నత ఆశయంతో ప్రారంభించిన కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సోమవారం నుంచి సేవలను పునరుద్ధరించే అవకాశం ఉందని పర్యవేక్షిస్తున్న అధికారులు చెబుతున్నా ప్రస్తుతానికి స్పష్టత కొరవడింది.

 

 

ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్‌ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి బాల సురక్ష పేరిట అమలు చేస్తున్నారు. దీని నిర్వహణ కాంట్రాక్టును ‘ధనుష్‌ డిజిటల్‌ హెల్త్‌’ సంస్థకు అప్పగించారు. ప్రతి నియోజకవర్గానికి విధిగా ఒక వాహనం ఉండేలా కేటాయింపులు చేపట్టారు. వైద్య సిబ్బందిని ఒప్పంద పద్ధతిలో నియమించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న 18 ఏళ్లలోపు విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్‌ ప్రకారం శిబిరాలు నిర్వహించి విద్యార్థులకు వైద్యపరీక్షలు చేస్తున్నారు.

 

 

దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడే చిన్నారులు, విద్యార్థులను గుర్తించి స్థానికంగా ఉన్న ఉన్నత వైద్యశాలలకు తరలిస్తున్నారు.పుట్టుకతోనే గ్రహణం మొర్రి, దృష్టిలోపం, గుండెలో రథ్రం, కంటికి కనిపించని అవయవ లోపాలు, చెవిటి, మూగ వంటి లోపాలతో బాధపడుతున్న విద్యార్థులను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పంపిస్తున్నారు. శస్త్రచికిత్సలు, ఉన్నత వైద్యం ఖర్చు ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. ప్రతిరోజు ఒకటి, రెండు గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు వెళ్లి విద్యార్థులను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంచార వాహనం ద్వారా సేవలు అందిస్తూ వచ్చారు.

 

 

 

 

2012లో జవహర్‌ బాల ఆరోగ్య రక్ష పేరుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేస్తుండగా, తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంగా కొనసాగించారు. ఈ కార్యక్రమం అనుకున్నంతగా విజయవంతం కాకపోవడంతో మరికొన్ని అంశాలను జోడించి పీపీపీ విధానంలో అమలు బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించింది. పుట్టకతో లోపాలు ఉన్న అప్పుడే పుట్టిన నవజాత శిశువు నుంచి ఆరు నెలల వయసున్న చిన్నారులను ఆశా వర్కర్లు, ఆరు వారాల నుంచి ఆరు ఏళ్ల వరకు పిల్లలను అంగన్‌వాడీ సిబ్బంది గుర్తించి నమోదు చేసిన వివరాలను సంచార వైద్య బృందానికి అందజేస్తూ వచ్చారు.

 

 

 

 

 

6 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులను గుర్తించడానికి నేరుగా సంచార వైద్యబృందం సభ్యులు పాఠశాలలు, కళాశాలల్లో స్క్రీనింగ్‌ చేసేవారు. వైద్యసేవలు పారదర్శకంగా అందించడానికి సీడీపీవో, ఎంఈవో, ప్రధానోపాధ్యాయులతో మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. బాలబాలికలకు అందించిన సేవలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల రిఫరల్‌ మేనేజర్‌ పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ అధికారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి జిల్లా సమన్వయకర్తను నియమించారు. ఇప్పటి వరకు నాలుగు అంశాల్లో 30 రకాల పరీక్షలు చేసేందుకు బృందంలోని ఒక్కో వైద్యుడు రోజుకు 120 మందిని పరీక్షిస్తున్నారు. శస్త్ర చికిత్సలు పూర్తి ఉచితంగా చేయడం వల్ల తల్లిదండ్రులకు ఆర్థికంగా ఊరటనిచ్చింది.

 

 

 

 

పల్లెల్లో విస్తృతంగా ప్రచారం జరగడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పక్క గ్రామాల్లో నిర్వహించిన శిబిరాలకు తీసుకెళ్లి పరీక్షలు చేయించిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సేవలను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు పర్యవేక్షిస్తున్న అధికారులకు సమాచారం అందించారు. కార్యక్రమం నిలిచిపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

షురూ చేయండి..

Tags: Secure standing

షురూ చేయండి..

Date:18/09/2019

వరంగల్ ముచ్చట్లు:

 

మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరకు ఇంకా 140 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆరు నెలల ముందుగానే జాతర జపం మొదలు.. అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధుల కేటాయింపు ప్రతిపాదనలు.. జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశాలు ఇంత చేసి ముందుగానే పనులు ప్రారంభిస్తారని అనుకుంటే అలా జరగడం లేదు. జాతర సమీపించాక అధికారులు పనులు మొదలు పెట్టడం… అప్పటికే భక్తులు వస్తుండడంతో తూతూ మంత్రంగా పనులు చేపట్టి నాణ్యతకు తిలోదకాలు ఇస్తుండడం ఆనవాయితీగా మారింది. ఈ సారి కూడా సమయం సమీపిస్తున్నా పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో గత పరిస్థితులే పునరావృతమవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 

 

జాతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సవరణ ప్రతిపాదనల జాబితా సమర్పించాల్సి ఉంది. ఇది ఇప్పటి వరకు జరగకపోవడంతో నిధుల కేటాయింపులో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. దీంతో జాతర అభివృద్ధి పనులు అధికారులు అనుకునే సమయానికి ముందుకుగా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కొత్తగా ములుగు జిల్లా ఏర్పాటైన తరుణంలో జాతర ఏర్పాట్ల పనులు ఆరునెలల ముందుగానే ప్రారంభించాలని నిర్ణయించారు. పూజారుల సంఘం జాతర తేదీలు ఖరారు చేసిన తర్వాత మే 3న జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు.

 

 

మరోసారి జూలై నెలలో జాతర ఏర్పాట్లపై మేడారంలో సమీక్ష నిర్వహించి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించగా, మరోసారి ములుగులోని కలెక్టరెట్‌లో జాతరపై సమీక్షించారు.ఇక ఆగస్టు 14న జాతర శాశ్వత అభివృద్ధి పనుల్లో భాగంగా భూసేకరణ కోసం సమావేశం నిర్వహించారు. హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం కలెక్టర్, పీఓతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఇటీవల హైదరాబాద్‌లో కూడా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ జాతరలో భక్తుల ఏర్పాట్లపై, అభివృద్ధి పనుల ప్రతిపాదనలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.

 

 

 

 

ఇక జాతర ఏర్పాట్లపై మంత్రి దయాకర్‌రావు అధికారులు, పూజారులతో మేడారంలో సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఇంకా తేదీ ఖరారు కాలేదు. ఫలితంగా ప్రతిపాదనల ఖరారు, నిధుల మంజూరు.. పనుల ప్రారంభం పనులు ముందుకు సాగకపోవడంతో భక్తులు, పూజారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మేడారం జాతర అభివృద్ధి పనులు, ఏర్పాట్ల కోసం జిల్లా అధికార యంత్రాంగం రూ.175 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు సమర్పించగా.. ప్రతిపాదనలను తగ్గించి శాశ్వత అభివృద్ధి పనులకు ప్రతిపాదనల జాబితా రూపొందించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.

 

 

 

 

దీంతో శాఖల వారీగా అధికారులు ప్రతిపాదనలు తగ్గించే పనిలో నిమగ్నమయ్యారు. గత వారం ములుగు జిల్లా కలెక్టర్‌ నారాయరణరెడ్డి శాఖల అధికారులతో సమీక్షించారు. మరోసారి మేడారానికి వెళ్లి పనుల ప్రదేశాలను పక్కాగా పరిశీలించి ప్రతిపాదనల జాబితా ఫైనల్‌ చేయాలని ఆదేశించడంతో అధికారులు పరిశీలించారు.

 

 

వచ్చే ఏడాది 2020 ఫిబ్రవరి 5 నుంచి 8వత తేదీ వరకు సమ్మక్క – సారలమ్మ జాతర జరగనుంది. ఈ తేదీలను పూజారుల సంఘం బాధ్యులు ఈ ఏడాది ఏప్రిల్‌ 20న ప్రకటించారు. అంటే తొమ్మిది నెలల ముందుగానే తేదీలు ఖరారు చేశారు. పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి సమయం ఉండాలనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు నెల రోజుల ముందుగా అంటే ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు జాతర అభివృద్ధి పనులు పూర్తి కావాలి.

 

 

 

 

 

అయితే, తేదీలు ప్రకటించి ఐదు నెలలు కావొస్తున్నా ప్రతిపాదనల దశే దాటలేదు.  జాతరలో ఈసారి కొత్తగా స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు, తాగునీటి కోసం పైపులైన్ల ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం పనులు చేయాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ని«ధులు మంజూరై.. పనులకు అంచనా ఖరారు చేసి టెండర్లు నిర్వహించి అగ్రిమెంట్‌ జరగాలి. ఆ తర్వాత పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సామగ్రి తెప్పించి పనులు మొదలు పెట్టడానికి కనీసం నెల రోజుల సమయం పడుతోంది. అంటే ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే అక్టోబర్, నవంబర్‌ వరకు ఈ తంతంగం కొనసాగే అవకాశముంది.

 

 

 

 

 

అంతలోనే డిసెంబర్‌ మొదటి వారం నుంచి భక్తుల రాక మొదలవుతోంది. ఈలోపు సంక్రాంతి సెలవులు వస్తాయి. దీంతో భక్తుల రాక పెరుగుతోంది. రోజుకు వేల సంఖ్యలో వచ్చివెళ్తుంటారు. ఈ మేరకు నాణ్యతను విస్మరించి హడావుడిగా పనులు చేపట్టి రూ.కోట్ల నిధులను ఎప్పటిలాగే స్వాహా చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే గత జాతరలో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్, డార్మిటరీ భవనం, ఐటీడీఏ గెస్ట్‌ హౌస్‌ ఆవరణలో నిర్మించిన శాశ్వత మరుగుదొడ్లు, కాటేజీల ముందు నిర్మించిన సులభ్‌ మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి.

 

అరకొరగా చెత్త తయారీ కేంద్రాలు

Tags: Do it.

అరకొరగా చెత్త తయారీ కేంద్రాలు

Date:18/09/2019

శ్రీకాకుళం ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పరిచి, వాటి ద్వారా వచ్చే ఆదాయంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా మండలానికి 30 వరకూ కేంద్రాలను నిర్మించేందుకు ప్రతిపాదించి, నిర్మాణాలు కూడా ప్రారంభించారు. ఇందులో సుమారు 18 వరకూ నిర్మాణాలు పూర్తి చేసుకుని, ఎవురువల విక్రయాలు కూడా ప్రారంభించేశారు. కొన్ని గ్రామాల్లో నిర్మాణాలు నిలిచిపోగా, ఇంకోన్ని గ్రామాల్లో పూర్తిగా ప్రారంభానికి కూడా నోచుకోలేదు.

 

 

దీంతో ఆయా గ్రామాల్లో పారిశుధ్య సమస్య తలెత్తుతుంది. మారేడుపూడి, గోపాలరావు, గొలగాం, కొండుపాలెం, మాకవరం, మామిడిపాలెం, సుందరయ్యపేట, పాపయ్య సంతపాలెం గ్రామాల్లో మధ్యలోనే నిలచిపోయాయి. ఇక రొంగలివానిపాలెం, రేబాక గ్రామాల్లో స్థల సమస్య వల్ల ఇప్పటికీ ప్రారంభించ లేదు. రూ.2వేల లోపు జనాభా ఉన్న గ్రామంలో రూ.3లక్షలతో 12 కాలమ్స్‌ షెడ్డు, 2నుంచి 5వేలు జనాభా ఉంటే రూ.నాలుగున్నర లక్షలతో 18కాలమ్స్‌, 5 నుంచి 9వేలు జనాభా ఉంటే సుమారు రూ.8లక్షలతో 30 కాలమ్స్‌, 9వేలు పైబడ్డ జనాభా ఉన్న గ్రామాల్లో సుమారు రూ.10లక్షలతో 35 కాలమ్స్‌తో షెడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

 

 

 

 

బవులవాడ, మార్టూరు, సంపతిపురం, పిసినికాడ, గ్రామాలతో పాటు మొత్తం 18 యూనిట్లు పూర్తి అయినట్టు మండల అభివృద్ది అధికారి పి ఉమామహేశ్వరరావు తెలిపారు. వీటిలో కేవలం బవులవాడలో మాత్రమే చెత్త నుండి సంపద కొద్దిమేర ఉత్పత్తి చేయగలిగారు. కిలో రూ.10 నుంచి రూ.12 పెట్టడడంతో కొనుగోలుకు అంతగా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో నాలుగు గ్రామాల్లో తయారవుతున్న చెత్త నుంచి సంపద కేంద్రాల్లో చెత్త పేరుకుపోయినట్టు ఆయన చెప్పారు.

 

 

 

 

దీనిపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తామని త్వరలోనే అన్ని గ్రామాల్లో చెత్త నుంచి సంపద కేంద్రాలను పూర్తి చేసి ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తుమ్మపాల మేజర్‌ పంచాయితీలో షెడ్ల నిర్మాణం మాత్రమే జరిగింది. యంత్ర సామగ్రి పంచాయితీ కార్యాలయంలోనే మూలుగుతోంది. స్వచ్ఛ భారత మిషన్‌లో భాగంగా మూడేళ్ల కిందట మంజూరైన రెండు ట్రాక్టర్లు, సుమారు 25 రిక్షాలు నిరుపయోగంగా ఉండిపోయాయి. ఇదిలా ఉండగా ఇందులో పని చేసేందుకు ప్రతి వెయ్యి మంది జనాభాకు గ్రీన్‌ అంబాసిడర్‌ను ప్రభుత్వం నియమించింది.

 

 

 

 

 

వీరికి నెలకు రూ.6వేల జీతం ఇవ్వడానికి కూడా ప్రతిపాదించింది. అయితే కేంద్రాలు ప్రారంభించి, వాటిని నిర్వహణకూడా మొదలు పెట్టేశారు. సుమారు ఆరు నెలల నుంచి వీరికి ఇంత వరకు ఒక నెల జీతం కూడా ప్రభుత్వం నుంచి మంజూరు కాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుంచి సంపద కేంద్రం నిధులు మంజూరైనా గ్రామంలో పారిశుధ్య సమస్య అలాగే మిగిలిపోవడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వీటిని పూర్తి చేయాలని మండలంలోని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.

అరకొరగా చెత్త తయారీ కేంద్రాలు

Tags: About six hundred garbage plants

చలమల శెట్టి పొలిటికల్ కెరీర్ కు బ్రేకేనా

Date:18/09/2019

కాకినాడ ముచ్చట్లు:

చెల‌మ‌ల శెట్టి సునీల్‌. రాజ‌కీయ దుర‌దృష్ట వంతుల జాబితాలో మొద‌ట ఉండే పేరు ఇదేనా ? ఆయన ఇప్ప‌టికి మూడు సార్లు పోటీ చేస్తే.. మూడు సార్లూ ఓట‌మిపాల‌య్యారు. అది కూడా మూడు పార్టీల నుంచి పోటీ చేసినప్ప‌టికీ ఆయ‌నను ఏ ఒక్క‌పార్టీ కూడా గెలిపించుకోలేక పోయింది. కొన్ని పొర‌పాట్లు.. కొంత అన్ ల‌క్ వెర‌సి చెల‌మ‌ల శెట్టి సునీల్ రాజ‌కీయం అగ‌మ్య గోచ‌రంగా మారిపోయింది. మూడు సార్లు కూడా ఆయ‌న స్వ‌ల్ప తేడాతోనే ఓడిపోయారు.విష‌యంలోకి వెళ్తే.. తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ ఎంపీ స్థానం నుంచి వ‌రుస‌గా మూడు సార్లు పోటీ చేసిన సునీల్‌. మూడు సార్లు కూడా ప‌రాజ‌యం పాల‌య్యారు.

 

 

దీంతో ఆయ‌న తీవ్ర నిర్వేదంలో కూరుకుపోయారు. ఎన్నారైగా ఉన్న ఆయ‌న చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీతో ఆక‌ర్షితులు అయి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ, 2014 వైఎస్సార్‌సీపీ, 2019లో టీడీపీ…ఇలా మూడు ఎన్నికలు … మూడు పార్టీలన్నట్టుగా పోటీచేసిన చెల‌మ‌ల శెట్టి సునీల్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయినా మూడు ఎన్నికల్లో వరుస ఓటముల తరువాత పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించే సాహసం చేయలేకపోతున్నారు.

 

 

ఇటీవ‌ల వైసీపీ వేవ్‌లో మూడోసారి కూడా స్వ‌ల్ప తేడాతో ఓడిపోవ‌డంతో త‌నంత దుర‌దృష్ట వంతుడు ఎవ్వ‌రూ ఉండ‌ర‌ని ఆయ‌న క‌న్నీళ్లు కూడా పెట్టుకున్నారు. వాస్తవానికి సునీల్‌ హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ కాకినాడ ఎల్‌బీ నగర్‌లో పెద్ద బిల్డింగ్‌ అద్దెకు తీసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించే వారు. అటువంటి భవనం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. ఎన్నికల ముందు రావడం … ఓటమి తరువాత కనిపించకుండా పోవడం షరామామూలేనని అంటున్నారు. వాస్త‌వానికి ప్ర‌జారాజ్యంలో చేరిన‌ప్పుడు చిరంజీవి ప్ర‌భావంతో గెలుపు గుర్రం ఎక్కుతాన‌ని ఆయ‌న అనుకున్నారు. అయితే, ఓట‌మితో ఆయ‌న తీవ్రంగా మ‌ద‌న ప‌డ్డారు.

 

 

 

ఆ త‌ర్వాత పార్టీనే ఏకంగా కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డంతో వైసీపీలోకి జంప్ చేసేశారు. 2014లో ఆయ‌న వైసీపీ నుంచి వ‌రుస‌గా రెండోసారి ఎంపీగా పోటీ చేసి అప్పుడు కూడా ఓట‌మి పాల‌య్యారు. ఈ ఎన్నిక‌ల్లో చెల‌మ‌ల శెట్టి సునీల్ నాడు టీడీపీ నుంచి పోటీ చేసిన తోట న‌ర‌సింహం చేతిలో 13 వేల ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీలో ఉన్న సునీల్ వైసీపీలో ఉండాలా ? బ‌య‌ట‌కు రావాలా ? అని చాలా రోజులు డైల‌మాలో ఉన్నారు.

 

 

 

ఈ ద‌ఫా ఏప్రిల్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేయాల్సిన చెల‌మ‌ల శెట్టి సునీల్ త‌న సోద‌రుడుకి టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుమారుడికి మ‌ధ్య ఉన్న ప‌రిచ‌యం కార‌ణంగా అనూహ్యంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ క్ర‌మంలోనే ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేశారు. వైసీపీ త‌ర‌ఫున వంగా గీత పోటీ చేశారు.

 

 

 

 

నిజానికి గీత ఓట‌మి ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. ఆమెను జ‌నాలు మ‌ర్చిపోయి చాలాఏళ్లు అయ్యింది. కానీ.. జ‌గ‌న్ సునామీలో ఆమె విజ‌యం సాధించ‌గా.. గెలుస్తాడ‌ని అనుకున్న చెల‌మ‌ల శెట్టి సునీల్ మాత్రం చ‌తికిల ప‌డ్డారు. ఈ సారి కూడా సునీల్ 23 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఆయ‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఏంట‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారిపోయింది.

 

తీవ్ర డైలామాలో మాగంటి బాబు

Tags: Chalamala Shetty Breckena for Political Career