నిలకడగా రూపాయి..!

Flexible rupee ..

Flexible rupee ..

Date:14/01/2019
ముంబై ముచ్చట్లు:
ఇండియన్ రూపాయి సోమవారం నిలకడగానే కదలాడుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. కీలకమైన ద్రవ్యోల్బణ గణాంకాలు సోమవారం సాయంత్రం వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల జరగనున్న ఆర్‌బీఐ పాలసీ సమావేశానికి ఈ గణాంకాలు కీలకం కానున్నాయి. ఉదయం 9.10 సమయంలో రూపాయి 70.51 వద్ద ట్రేడవుతోంది. మునపటి ముగింపు స్థాయి 70.50తో పోలిస్తే 0.03 శాతం మేర నష్టపోయింది. భారత్‌లో పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 7.246 శాతం వద్ద ట్రేడవుతున్నాయి. బాండ్ ఈల్డ్స్ మునపటి ముగింపు స్థాయి 7.247 శాతంగా ఉంది. బాండ్ ఈల్డ్స్, ధరలు పరస్పరం వ్యతిరేక దిశల్లో ఉంటాయి. వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 2.17 శాతంగా నమోదు కావొచ్చని అంచనాలున్నాయి. నవంబర్‌లో ఈ ద్రవ్యోల్బణం 2.33 శాతంగా ఉంది. అదేసమయంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 4.58 శాతంగా నమోదు కావొచ్చని అంచనాలున్నాయి.
Tags:Flexible rupee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *