ఏడుపాయలకు వరద పోటు
మెదక్ ముచ్చట్లు:
పాపన్నపేటలోని ఏడు పాయల ఆలయం ముందు వరద మళ్ళీ పెరిగింది. వారం రోజులుగా జలదిగ్బంధంలోనే వన దుర్గా భవాని ఆలయం వుంది. ఆలయం ముందు మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అమ్మవారి నిజ రూప దర్శనానికి వచ్చే భక్తులకు నిరాశ తప్పడంలేదు. అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా నది ప్రవహిస్తోంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.
Tags: Flood tide for edupayas

