Natyam ad

మంజీరా కు వరద పోటు

మెదక్ ముచ్చట్లు:

ఎగువన కురుస్తున్న బారీ వర్షాలతో సింగూర్ ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం తీవ్రస్థాయి లో ఉన్నందున దిగువన ఉన్న మంజీర కు ఇరిగేషన్ అధికారులు  నీటిని విడుదల చేసారు.
ఈ నేపధ్యంలో మెదక్ జిల్లా  రాష్ట్రం లో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవస్థానము ఏడుపాయల శ్రీ వన దుర్గాదేవి అమ్మ వారి ఆలయం కు వరద ప్రవాహం పోటెత్తింది. ఆలయ అధికారులు  గర్భాలయం మూసివేసారు.  రాజగోపురం లో అమ్మ వారి ఉత్సవ విగ్రహానికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగూరు ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద ప్రవాహం. రెండు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల.6వ.గేటును ఎత్తి 2.50 మీటర్లు 15వ. గేటును ఎత్తి 1.50 మీటర్లు దిగువకు నీరు  విడుదల చేసారు. మంజీర పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు  హెచ్చరించారు.

 

Tags: Flood tide to Manjira

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.