లెండి వాగులో వరద నీరు

Date:16/09/2020

కామారెడ్డి  ముచ్చట్లు:

భారీ వర్షాలకు తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దుల్లోని వాగులు వంకలు పొంగి పొర్లు తున్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ శివారులోని అంతర్రాష్ట్ర లెండి వాగుకు వరద ఉధృతి పెరిగింది.లో లెవల్ వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.దీంతో మద్నూర్ మండలం లోని శివారు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది.గోజిగామ్ సిర్పూర్,చిన్న టాక్లి, పెద్ద టాక్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి..మరో వైపు పత్తి, సొయా,పెసర పంటలు నీట మునిగాయి.పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అబ్యర్థిగా గోరటి వెంకన్న?

Tags:Flood water in Lendi Wagu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *