ప్రాజెక్టులలో భారీగా చేరుతున్న వరదనీరు

Date:13/07/2018
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. జిల్లాలోని ములకపల్లి, బూర్గంపాడు, దమ్మపేట, భద్రాచలం తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలో ఇప్పటి వరకు 4,625.4 ఎంఎంల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా.. 5,990.2 మి.మీ వర్షం నమోదైంది. అయితే పినపాక(-24.0 మి.మీ), చర్ల(-27.3 మి.మీ) మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. దమ్మపేట, అశ్వారావుపేట, చంద్రుగొండ, మణుగూరు, దుమ్ముగూడెం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో పెనుబల్లి మండలం సాధారణ వర్షం నమోదు కాగా మిగతా మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో 4,218.1 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 6,656.0 మి.మీ కురిసింది. భద్రాచలం వద్ద గోదావరి 30.5 అడుగుల మేర ప్రవహిస్తుంది. ఉదయం 29.5 అడుగులు కాగా సాయంత్రం మరింత పెరిగింది. చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరగడంతో శుక్రవారం సాయంత్రానికి 14 గేట్లు ఎత్తి 9,500 క్యూసెక్కుల నీటిని దిగువకు నీటిని వదులుతున్నారు.  పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం నీటిమట్టం 399.90 అడుగులకు పెరిగింది. టీఎంసీలలో 6.65 నీరు నిల్వ ఉంది. పెద్దవాగు జలాశయం నీటిమట్టం గరిష్ఠ పరిమితి 6 మీటర్లు కాగా ప్రస్తుతం 5.50 మీటర్ల వరకు నీరు వచ్చి చేరింది. పెనుబల్లి మండలంలోని లంకాసాగర్‌ జలాశయంలో 8.9 అడుగులకు, వైరా జలాశయం నీటిమట్టం 14.3 అడుగులకు చేరుకుంది.
ప్రాజెక్టులలో భారీగా చేరుతున్న వరదనీరుhttps://www.telugumuchatlu.com/flood-water-in-major-projects/
Tags; Flood water in major projects

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *