వాగుల్లో వరదనీరు తగ్గుముఖం

Flood water is declining in the waters

Flood water is declining in the waters

Date:12/11/2019

తిరువూరు ముచ్చట్లు:

కృష్ణాజిల్లా  తిరువూరు మండలంలోని వాగుల్లో వరదనీరు తగ్గుముఖం పట్టింది. దాంతో గానుగపాడులో అధికారికంగా ఇసుక రీచ్ ను మంగళవారం ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజా సంక్షేమానికి కట్టిబడి ఉన్నారు.  తిరువూరు నియోజకవర్గ ప్రజలకు ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా రాష్ట్ర పాలన సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ నాగేశ్వరరావు, సీఐ ప్రసన్నవీరయ్య గౌడ్, వైఎస్సార్సీపీ నాయకులు పిఏసీఎస్ అధ్యక్షులు కలకొండ రవికుమార్, తంగిరాల వెంకటరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ, జంగాల శ్రీనివాస్, పరసా శ్రీనివాసరావు, గద్దల ఏసురత్నం, గౌరసాని భాస్కరరెడ్డి,విస్సన్నపేట మండల పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ భూక్యా రాణి,దాసు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

 

కాలువలో పడి చిన్నారి మృతి

 

Tags:Flood water is declining in the waters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *