అక్రమాలపై అంతస్తులు  

Date:18/02/2020

ఏలూరు ముచ్చట్లు:

 

పట్టణాల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అనుమతుల మంజూరు విషయంలో ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టినప్పటికీ పరిస్థితుల్లో మాత్రం

మార్పు రాలేదు. ఇప్పటికీ ఆయా పురపాలక సంఘాల్లో అవినీతి జరుగుతూనే ఉంది. ఒక వైపు అవినీతిని సహించేది లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నా కిందిస్థాయి అధికారులు,

కొందరు నాయకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. పట్టణ ప్రణాళిక విభాగంలో చేయి తడపనిదే పని పూర్తికాని దుస్థితి నెలకొంది. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న సమయంలో చూసీ

చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు నిర్మాణాలు పూర్తయిన తర్వాత వారికి మేలు చేసే విధంగా నోటీసులు జారీ చేసి మమ అనిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమ

నిర్మాణాలపై దృష్టి సారించింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో కరకట్టపై గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదికను సైతం కూలగొట్టించింది. రాష్ట్రంలోని పలు

జిల్లాల్లో నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన అక్రమ కట్టడాలపై కన్నెర్ర చేసింది. జిల్లాలో మాత్రం తణుకు, భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, కొవ్వూరు వంటి పట్టణాల్లో వీటి సంఖ్య

పెరుగుతోంది. ముఖ్యంగా భవనాలను నిర్మించేటప్పుడు ప్రధాన రహదారిని ఆనుకుని పది శాతం స్థలం వదులుతున్నట్లుగా సంబంధిత యజమానులు మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు.

అనంతరం అదే స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారు. భవిష్యత్‌లో రహదారి విస్తరణ పనులు చేపడితే తమకు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టును ఆశ్రయిస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులకు

ఆటంకం ఏర్పడటంతో పాటు జాప్యం జరిగి ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3200లకు పైగా బహుళ అంతస్తుల భవన సముదాయాలు

ఉన్నాయి. ఏలూరులో 450, భీమవరంలో 560, తణుకులో 350 వరకు ఉన్నాయి. ఇటీవల పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం వంటి పట్టణాలతో పాటు

గ్రామీణ ప్రాంతాల్లో కూడా భవనాలు నిర్మించారు. నిర్మిస్తున్నారు. రోజూ భవన నిర్మాణాలకు సంబంధించి పది దరఖాస్తులు అనుమతుల కోసం పట్టణ ప్రణాళిక విభాగానికి ఆన్‌లైన్‌లో

వస్తున్నాయంటే వీటి జోరు ఏవిధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్ఛు నిబంధనలు ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై 340(ఎ)పురపాలక సంఘ చట్టాన్ని అనుసరించి

జరిమానా విధిస్తారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తే ఆరు నెలల నుంచి మూడు నెలల వరకు జైలు శిక్ష, జరిమానాలు విధించే అవకాశం ఉంది.

అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం బీపీఎస్‌ పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని పలుమార్లు పొడిగిస్తూ అక్రమ నిర్మాణదారులకు అవకాశం కల్పించింది. దీంతో అక్రమ

నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏలూరు నగర పాలక సంస్థతో పాటు 9 మున్సిపాలిటీల పరిధిలో 2415 దరఖాస్తులు రాగా అందులో 1420 దరఖాస్తులను

పరిష్కరించారు. వీటి ద్వారా రూ.18.42 కోట్లు ఆదాయం ఆయా మున్సిపాలిటీలకు వచ్చింది.
2017 మార్చి 28న విడుదల చేసిన జీవో 119 ప్రకారం భవన నిర్మాణ సమయంలో నిబంధనలు విధిగా పాటించాల్సిందే. బహుళ అంతస్తుల భవనం చుట్టూ 10 అడుగుల సెట్‌

బ్యాక్‌ ఉండాలి. భవనం నిర్మించే ప్రాంతంలో అక్కడ ఉన్న రహదారి విస్తీర్ణాన్ని బట్టి 10 శాతం భూమిని సంబంధిత మున్సిపాలిటీకి (గిప్ట్‌ డీడ్‌) రిజిస్ట్రేషన్‌ చేయాలి. మున్సిపల్‌ అధికారులకు

ముందుగా నేల స్వభావం బట్టి స్ట్రక్చర్‌ నమూనా అందించి వారి నుంచి అనుమతులు పొందాలి. భవనం నిర్మించే ప్రతి ఒక్కరూ స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌ను నియమించుకోవాలి. భవనం ఎత్తు, నేల

స్వభావం బట్టి నిర్మాణ సామగ్రి వినియోగించుకోవాలి. భవన నిర్మాణ అనుమతులు, తదితర వివరాలు అందరికీ తెలిసేలా బయట ప్రదర్శించాలి. ఇంకుడు గుంత ఏర్పాటు, విద్యుత్‌ పరివర్తకం

ఏర్పాటునకు స్థలం వదలాలి. జీ+4 దాటి నిర్మించే భవనాలకు అగ్నిమాపక అనుమతులు తప్పనిసరి. పార్కింగ్‌ స్థలం ఉండాలి. జీ+4 భవనాలు 18 మీటర్ల ఎత్తు ఎట్టి పరిస్థితుల్లోదాటకూడదు. బహుళ అంతస్తుల భవనానికి తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకోవాలి.

అవనిగడ్డ లంకమ్మమాన్యం లో పోలీసుల కార్డాన్ సెర్చ్

Tags: Floors on irregularities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *