విద్యార్దులకు పువ్వులిచ్చిన టీచర్లు

యాదాద్రి ముచ్చట్లు:


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయగిరి ప్రభుత్వ పాఠశాల పేరెన్నికగన్నది. ఎంతో మంది ఇక్కడ విద్యనభ్యసించి దేశవిదేశాలలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు.   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్దుల చేరికలు మరింతపెంచాలని ఆ టీచర్లు భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రధానోపాధ్యాయుడు, ఇతర టీచర్లు  పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పువ్వులు ఇచ్చి స్వాగతం పలికారు. వేసవి సెలవుల తరువాత సోమవారం తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పాఠశాలకు వచ్చే విద్యార్థిని విద్యార్థులకు పువ్వుల ను ఇచ్చి మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని భవిష్యత్తులో ముందుకు పోవాలని ఆశీర్వదించారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు.

 

Tags: Flowering teachers for students

Post Midle
Post Midle
Natyam ad