ఓల్డ్ సిటీపై మహాకూటమి దృష్టి

Focus on Old City

Focus on Old City

Date:10/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ముందస్తు ఎన్నికలు వచ్చాయి. కానీ కాంగ్రెస్‌ ఆ పార్టీ పాత బస్తీ పరేషాన్‌ చేస్తోంది. ఎంఐఎం కోటాలో పాగా వేసేందుకు ఎటువంటి ప్రణాళిక చేయలేదు. ఎంఐఎం తన పలుకుబడితో కాంగ్రెస్‌ పార్టీతో సహా ఏ పార్టీని ఎదగనీయకుండా చేస్తూనే ఉన్నది. ఎంఐఎం కంచుకోటలా భావిస్తున్న పాతబస్తీ కోటలు బద్దలు కొట్టేందుకు బలమైన అభ్యర్థులను దించుతున్నట్టు కాంగ్రెస్‌ ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా కొన్ని పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. చాంద్రాయణగుట్టలో మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను ఎదుర్కొనేందుకు మహ్మద్‌ ఫైల్మాన్‌ పేరు వినిపిస్తున్నది. తను పోటీ చేసేందుకు సుముఖంగా లేడని తెలుస్తున్నది. హఫీజ్‌ఖాన్‌ పేరు వినిపిస్తున్నది. యాకుత్‌పురా నుంచి మామిడి గోపి,అల్లంభాస్కర్‌ ఆశిస్తున్నారు. మైనార్టీ నుంచి ఫరాఖాన్‌ కూడా బరిలో ఉన్న్టట్టు తెలిసింది.
చార్మినార్‌ నుంచి ఎండీ గౌస్‌, అలీ మస్కతి, నాంపల్లి నుంచి ఫిరోజ్‌ఖాన్‌, కార్వాన్‌ నుంచి బందూలాల్‌, యూసుఫ్‌ఖాన్‌, బహుదూర్‌పుర నుంచి ఆయూబ్‌ఖాన్‌, మలక్‌పేట్‌ నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ పేరు వినిపిస్తున్నా…మైనార్టీ నేత కోసం వెతుకుతున్నట్టు తెలిసింది.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ…పాతబస్తీని నియంత్రిస్తున్నారనే జగమెరిగిన సత్యం. ఎంఐఎం అరాచకాలను ఎంతో సహనంతో భరిస్తున్న ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడంతోపాటు ఎంఐఎంకు ఎదురొడ్డి నిలబడే నేత కాంగ్రెస్‌ పార్టీలో లేరని పాత బస్తీ నేతలు అంటున్నారు. పాతబస్తీ అంటే ఎంఐఎం అన్న భావనతోపాటు ఆ పార్టీకి ఏడు సీట్లు వస్తాయనీ, వాటి గురించి మాట్లాడకండి అనే పరిస్థితి రాజకీయ వర్గాల్లో ఉన్నది.
ఇతర పార్టీల అభ్యర్థులను కూడా ఎంఐఎం నిర్ణయిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. దశాబ్దాలుగా పాతబస్తీలో కాంగ్రెస్‌ పార్టీ డమ్మీ అభ్యర్థులను దించి, పరోక్షంగా ఆ పార్టీ బలోపేతానికి కృషి చేసిందని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌తో పార్టీ స్నేహపూర్వకంగా ఉండటంతో కాంగ్రెస్‌ బుస్సుమంటుంది. గత నాలుగేండ్లుగా ఎంఐఎంను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదని ఆపార్టీ నేతలు అంటున్నారు. అందుకే పాత బస్తీలో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు జంకుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. స్థానిక నాయకులు పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేస్తామన్న రాష్ట్ర నాయకత్వం వారికి అండదండలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్‌, ఎంఐఎం స్నేహపూర్వకంగా ఉండటంతో పాత బస్తీలోకి కాంగ్రెస్‌ తొంగి చూడలేదు.
ఆ పార్టీతో పొత్తు ఉండటం వల్లే బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దించి పరోక్షంగా దాని గెలుపు కోసం కృషి చేసిందన్న ఆరోపణలు గతం నుంచే ఉన్నాయి. ఒక్కొక్కసారి పొత్తుల్లో ప్రతిష్టంభన ఏర్పడితే…నేరుగా కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద కూర్చొని పొత్తులు ఖరారు చేయించుకునేది. ఎంఐఎం ఏం చేసినా రాష్ట్ర నాయకత్వం చూసీచూడనట్టు వ్యవహరించిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఎంఐఎం ఏం చేసినా చెల్లిందని చెబుతున్నారు. ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ…ఆనాడు హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రిగా ఉండి పార్టీ బలోపేతం కోసం కృషి చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా టీపీసీసీ అధ్యక్షులు ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒప్పుకున్నారు.
ఈసారి బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతామని ప్రకటించారు. ఎన్నికల్లో ఎంఐఎంపై తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటిస్తున్న కాంగ్రెస్‌ నేతలు…ఇప్పటివరకు హైదరాబాద్‌ పార్లమెంటుకు ఇన్‌చార్జిని నియమించని దుస్తితి నెలకొంది. దీంతో పాతబస్తీలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. పైకి మాత్రం ఎంఐఎం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. ఎంఐఎంతో విభేదించి కాంగ్రెస్‌లో చేరిన ఎండీ గౌస్‌…పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఇస్తే అన్నినియోజకవర్గాల్లో తిరిగి ప్రచారం చేస్తానంటూ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. హైదరాబాద్‌ నగర అధ్యక్షుడిగా ఉన్న అంజన్‌కుమార్‌గానీ, గతంలో అధ్యక్షుడిగా ఉన్న దానం నాగేందర్‌ కూడా పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Tags:Focus on Old City

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *