రెవిన్యూ సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ పెట్టండి.

కుప్పం ముచ్చట్లు:

విధుల్లో నిర్లక్ష్యం తగదు.అంకిత భావం తో..కష్టపడి పని చేయండి.నిజాయితీ గా పనిచేస్తూ. ప్రజలతో సత్ సంబంధాలు కలిగి.జిల్లా యంత్రాంగం నకు మంచి పేరు తీసుకొని రండి..రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం పర్యటన లో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి.రెవిన్యూ సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ పెట్టి కష్టపడి పని చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు.గురువారం మధ్యాహ్నం ఎం పి డి ఓ కార్యాలయంలో కుప్పం ఆర్ డి ఓ, నియోజక వర్గ తహశీల్దార్ లు,డిప్యూటీ తహసీల్దార్లు,ఆర్ ఐ లు, సర్వేయర్లు,వి ఆర్ ఓ లు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు తో కలసి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ…రెవిన్యూ సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ పెట్టి పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం తగదని, అలసత్వం వీడి కష్టపడి పని చేయాలని తెలిపారు. గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం పర్యటన లో భాగంగా అందిన అర్జీలు ఆర్ డి ఓ కు పంపడం జరుగుతుందని, తరువాత సంబంధిత మండలాలకు అందు తాయన్నారు.ఈ వినతులతో పాటు కుప్పం నియోజక వర్గంలో డ్రైవ్ తరహా లో ప్రతి సచివాలయం లో ఒక వి ఆర్ ఓ ఒక విలేజ్ సర్వేయర్ ఒక బృందం గా ఏర్పడి సచివాలయ పరిధిలోని ప్రతి గడపకు వెళ్లి రెవెన్యూ సంబంధమైన పాస్ బుక్ మ్యుటేషన్ లు, భూమి సర్వే,ఆక్రమణలు తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించి నివేదిక ను తయారు చేయాలన్నారు. వాటిని ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలన్నారు. జూలై 15 లోపు అధికారులు తమ పరిధిలో పరిష్కరించగల వినతులు, సమస్యలను పరిష్కరించాలన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు అయిన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావలన్నారు.. ధృవ పత్రాల పంపిణీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న వాటికి ఆమోదం తెలిపి మంజూరు చేయాలన్నారు..నిజాయితీ గా పనిచేస్తూ.. ప్రజలతో సత్ సంబంధాలు కలిగి..జిల్లా యంత్రాంగం నకు మంచి పేరు తీసుకొని రావాలని హితవు పలికారు.ఈ సమీక్ష లో కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు, ఏడి సర్వే గౌస్ బాషా, నాలుగు మండలాల తహసిల్దార్లు, సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

 

 

Tags:Focus on solving revenue problems.

 

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *