సామాజిక వర్గాల ప్రాతినిద్యం ఫై మహాకుటమి దృష్టి

Date:06/11/2018

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ఢిల్లీలో సుదీర్ఘ కసరత్తు కొనసాగుతోంది. మంగళవారం  ఉదయం 11గంటల నుంచి సుదీర్ఘ భేటీ కొనసాగుతోంది. కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ భక్తచరణ్‌ దాస్‌ నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి ఆర్‌సీ కుంతియా, కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జానా రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, రేవంత్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, షబ్బీర్‌ అలీ హాజరయ్యారు. ఇప్పటికే 57 మంది అభ్యర్థులను కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. మిగతా అభ్యర్థుల జాబితాపై ఈ భేటీలో కసరత్తు చేస్తున్నారు. మిత్ర పక్షాలకు కేటాయించాల్సిన స్థానాల పైనా సమాలోచనలు చేస్తున్నారు. సామాజిక వర్గాలవారీ ప్రాతినిధ్యంపైనా నేతలు ఈ భేటీలో దృష్టిసారించనున్నారు. మహా కూటమిలో సీట్ల కేటాయింపు అంశం ఓ కొలిక్కివచ్చాక ఒకేసారి 119 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్‌ నేతలు యోచిస్తున్నారు.కాగా సీట్ల జాబితాపై తెలంగాణ జనసమితి (తెజస) కోర్‌ కమిటీ కీలక భేటీ ముగిసింది. నిన్న కాంగ్రెస్ ఇచ్చిన సీట్ల జాబితాపై నేతలు చర్చించారు. ఈ భేటీ అనంతరం ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకట్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెజసకు కాంగ్రెస్‌ తొమ్మిది సీట్లు ప్రతిపాదించిందన్నారు. తొమ్మిది సీట్లలో తాము అడగని స్థానాలు కూడా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ ప్రతిపాదించిన సీట్లపై కోర్‌ కమిటీలో చర్చించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కాంగ్రెస్‌ను సంప్రదిస్తామన్నారు. మరోవైపు, మహబూబ్‌నగర్‌ టికెట్‌ను రాజేందర్‌రెడ్డికి కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సమావేశం వద్ద అనుచరులు నిరసన వ్యక్తంచేశారు.

సర్దుబాట్లు..సమస్యలు..

Tags:Focus on the representation of social circles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *